// // Cognizant Bonus: ఉద్యోగులకు 100 శాతం బోనస్.. గుడ్ న్యూస్ చెప్పిన కాగ్నిజెంట్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Cognizant Bonus: ఉద్యోగులకు 100 శాతం బోనస్.. గుడ్ న్యూస్ చెప్పిన కాగ్నిజెంట్

Cognizant Bonus: ఉద్యోగులకు 100 శాతం బోనస్.. గుడ్ న్యూస్ చెప్పిన కాగ్నిజెంట్
Advertisement

Cognizant Bonus: ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 సంవత్సరానికి 100 శాతం బోనస్ ప్రకటించింది. రెండేళ్ల ముందుగానే తన లక్ష్యాన్ని చేరుకున్నందుకు గానూ.. ఈ బోనస్ ప్రకటించినట్లు తెలిపింది. అగ్రశ్రేణి పనితీరుతో కంపెనీ “విన్నర్స్ సర్కిల్”లోకి ప్రవేశించిందని సీఈవో ఎస్.రవి కుమార్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో తెలిపారు.

100 శాతం బోనస్

“2025 ఫలితాలు క్రమశిక్షణతో కూడిన పనితీరు, మా క్లయింట్లు, కాగ్నిజెంట్ పట్ల నిబద్ధతకు ప్రత్యక్ష ఫలితం. ఉద్యోగుల ప్రయత్యాలను గుర్తించి, 100 శాతం బోనస్ ప్రకటించేందుకు సంతోషంగా ఉన్నాము” అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవి కుమార్ తెలిపారు. కాంగ్నిజెంట్ కంపెనీలో 3,50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భారతదేశంలోనే ఉన్నారు.

ఆదాయంలో సూపర్

Advertisement

కాగ్నిజెంట్ 2027 నాటికి ‘విన్నర్ సర్కిల్’ అనే లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకుంది. కానీ 2025లో దానిని సాధించింది. నిర్దేశించుకున్న లక్ష్యానికి ముందుగానే విజేత సర్కిల్‌కు చేరుకోవడం కంపెనీ సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తుందని సీఈవో అన్నారు. 2025లో 6.4 శాతం వృద్ధిరేటుతో కాగ్నిజెంట్ “విన్నర్ సర్కిల్”లోకి ప్రవేశించింది. 2025 మొత్తానికి కాగ్నిజెంట్ ఆదాయం 7 శాతం పెరిగి 21.10 బిలియన్ డాలర్ల (అంటే సుమారు రూ.1.90 లక్షల కోట్లు)కు చేరింది. ఈ కంపెనీ జనవరి-డిసెంబరును ఆర్థిక సంవత్సరంగా భావిస్తుంది. ఈ సంస్థ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది.

Also Read:  గ్లోబల్ మార్కెట్‌లో భారత్ గర్జన.. అమెరికాతో బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం సిద్ధం!

Advertisement

కంపెనీ అంతర్గత బెంచ్‌మార్కింగ్ ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా కాగ్నిజెంట్ ఆదాయం క్రమంగా వృద్ధి సాధిస్తుంది. 2022లో 10వ స్థానం, 2023లో ఎనిమిదో స్థానం, 2024లో ఆరవ స్థానానికి చేరుకుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×