E-Paper
Advertisement

బాడుదు మొదలైంది.. సీఎన్జీ ధరలు పెంపు, రెండువారాల్లో నాలుగోసారి

బాడుదు మొదలైంది.. సీఎన్జీ ధరలు పెంపు, రెండువారాల్లో నాలుగోసారి
Advertisement

CNG Price Hike: వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఆయిల్, సీఎన్జీ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా సీఎన్‌జీ ధరలు మరోసారి పెంచింది కేంద్రం. సీఎన్‌జీపై కిలో రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రధాన నగారాల్లో సీఎన్జీ ధరలను ఇప్పుడు చూద్దాం.

సీఎన్జీ ధరలు పెంపు, రెండువారాల్లో నాలుగోసారి

Advertisement

ప్రపంచంలో ఇంధన ధరల పెరుగుతున్న నేపథ్యంలో రెండు వారాలలోపు సీఎన్‌జీ ధరలను కిలోకు రూ. 2 చొప్పున పెంచింది కేంద్రం. మే 26 అనగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త ధరలతో ఢిల్లీలో సీఎన్‌జీ ధర ఇప్పుడు కిలోకు రూ. 83.09గా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపు చోటు చేసుకుంది. అమెరికా-ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో కీలకమైన చమురు రవాణా మార్గం హోర్ముజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు వెంటాడుతున్నాయి.

Advertisement

ఆటోలు, క్యాబ్‌లు వాటిపై అధిక భారం, ఆపై ప్రయాణికులకు సెగ

దీనికితోడు సోమవారం ఇరాన్ క్షిపణి ప్రయోగం కేంద్రం, ఇరాన్ బోటులపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో మరింత భయం పెరిగింది. ఈ క్రమంలో ముడి చమురు సరఫరా ఆందోళనల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ల నేపథ్యంలో తాజా పెంపు చోటుచేసుకుంది. ఫిబ్రవరి 28న మధ్య ప్రాచ్యంలో ఘర్షణ చెలరేగడానికి ముందు బ్యారెల్‌కు 72 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్, ఇప్పుడు 90 డాలర్లకు పైగానే పలుకుతోంది.

తాజా పెంపుతో మే 15 నుంచి లీటరుకు దాదాపు రూ. 7.50 లకు చేరింది. ఇంధన ధరల పెంపు వల్ల ప్రయాణికులు, రవాణా నిర్వాహకులు, అన్ని రంగాల వ్యాపారాలపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పదే పదే పెరగడం వల్ల రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తుల ధరలు అధికమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ALSO READ: షాపింగ్ మీది.. బ్యాగుల బరువు మాది.. స్టార్టప్ కంపెనీ క్రేజీ ఐడియా!

CNG ధరలు పదేపదే పెరగడం వల్ల ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగుళూరు, కోల్ కత్తా, చెన్నై వంటి నగరాల్లో బస్సులు, క్యాబ్‌లు ఈ ఇంధనంపై ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల ప్రయాణికులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×