E-Paper
Advertisement

లోన్ క్లోజ్ చేశారా?.. ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం మర్చిపోకండి

లోన్ క్లోజ్ చేశారా?.. ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం మర్చిపోకండి
Advertisement

Loan Closure Documents: పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్.. ఇలా ఏ లోన్ అయినా సరే క్రమం తప్పకుండా ఈఎంఐలు కడుతుంటాం. ఒక లోన్ పూర్తి చేశామంటే ఎంతో భారం దిగినట్టే. లోన్ కట్టేసిన తర్వాత మనలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. లోన్ పూర్తైన ఆనందంలో క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోం. మనం అడిగితే తప్ప బ్యాంకులు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వవు. ఏ ఒక్కదాన్ని మర్చిపోయినా.. క్రెడిట్ స్కోర్, భవిష్యత్ రుణాలపై ప్రభావం పడుతుంది. రుణం పూర్తైన తర్వాత తప్పనిసరిగా తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం.

తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవే

లోన్ క్లోజర్ సర్టిఫికేట్

మీ లోన్ అధికారికంగా ముగిసిందని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. ఇది తీసుకోకపోతే మీ క్రెడిట్ హిస్టరీ దెబ్బ తినే ఛాన్స్ ఉంది.

నో డ్యూస్ సర్టిఫికేట్ (NDC)

Advertisement

మీరు బ్యాంకుకు బాకీ లేరని చెప్పే ఫ్రూఫ్. భవిష్యత్తులో బ్యాంకు నుంచి ఎలాంటి నోటీసులు రాకుండా ఇది ఉపయోగపడుతుంది. మీ ప్రాపర్టీపై బ్యాంకుకు ఎలాంటి హక్కు లేదని చెప్పే డాక్యుమెంట్ ఇది. మీరు ఎప్పుడైనా ఆస్తిని అమ్మాలని అనుకుంటే, నో డ్యూస్ సర్టిఫికేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సర్టిఫికెట్ పై కస్టమర్ లోన్ తీసుకున్న తేదీ, పూర్తిగా చెల్లించిన తేదీ, రుణం మొత్తం, కస్టమర్ వివరాలు, అకౌంట్ డిటైల్ ఉంటాయి.

ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లు

లోన్ తీసుకున్న సమయంలో ఒకవేళ ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు.. ప్రతి పేజీ తిరిగి ఇచ్చారని నిర్ధారించుకోండి. లోన్ కు ముందే మీ ఆస్తి పత్రాల జాబితాను తయారు చేసుకోండి . మీ రుణం తీరిపోయిన తర్వాత, అసలు పత్రాలను, మీ దగ్గరున్న వాటితో సరిపోల్చుకోండి.

లీన్ రిమూవల్ లెటర్

Advertisement

అప్పు తీరే వరకు మీ ఆస్తి లేదా వాహనం అమ్మకుండా ఉండేందుకు.. మీ ఆస్తిపై బ్యాంకుకు హక్కు కల్పించడమే లీన్. అందువల్ల లోన్ పూర్తైన తర్వాత మీ ప్రాపర్టీ మీద LIENను తొలగించుకోవడం ఒక ముఖ్యమైన భాగం. హోమ్ లోన్ అయితే మీరు రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ లీన్ ను తొలగించే ప్రక్రియను ఆలస్యం చేస్తే, బ్యాంకు జారీ చేసిన NOC సహాయంతో లీన్ రిమూవ్ చేసుకోవచ్చు.

Also Read: అమ్మబాబోయ్.. ఏప్రిల్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల హాలీడేస్ లిస్ట్ ఇదే!

సిబిల్ రిపోర్ట్

లోన్ ముగిసిన 60 తర్వాత మీ సిబిల్ స్కోర్ లో ఈ విషయం ప్రతిబింబించిందో లేదో చెక్ చేసుకోండి. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మంచి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. లోన్ చెల్లించిన తర్వాత.. మీ ఆర్థిక సంస్థ ఆ సమాచారాన్ని CIBIL వద్ద అప్డేట్ చేస్తుంది. ఈ డేటా అప్డేట్ కాకపోతే, మరో రుణం కోసం అప్లై చేసుకున్నప్పుడు లేదా భవిష్యత్తు లావాదేవీల్లో ఇబ్బందులు వస్తాయి. అందువల్ల, లోన్ పూర్తి చేసిన వివరాలను సిబిల్ లో అప్డేట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి.

చాలా మంది వీటిలో 1, 2 విషయాలు మర్చిపోతుంటారు. లోన్ ముగిసిన తర్వాత ఈ 5 ముఖ్య విషయాలను క్రాస్ చెక్ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×