E-Paper
Advertisement

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన ధరలు!

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన ధరలు!
Advertisement

Chicken Prices Down in Telangana: కొద్ది రోజులుగా సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్న చికెన్ ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు మార్కెట్‌ లో అందనంత ఎత్తులో ఉన్న చికెన్ రేటు.. ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. కిలో చికెన్ ధర రూ.300 దాటగా, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రూ.230 నుంచి రూ.260 మధ్య పలుకుతోంది. ధరలు ఒక్కసారిగా తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో మటన్ కంటే చికెన్‌ కు ఎక్కువ డిమాండ్ ఉండటంతో గత కొన్ని వారాలుగా ధరలు భారీగా పెరిగాయి. అయితే, ఇప్పుడు పరిస్థితి కొంత మారింది.

ధరల తగ్గుదలకు కారణం ఏంటంటే?

గత నెలలో చికెన్ సరఫరా తగ్గడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. విపరీతమైన ఎండ కారణంగా చాలా వరకు కోళ్లు చనిపోవడం, అదే సమయంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, వీకెండ్ కొనుగోళ్లు పెరగడంతో చికెన్ మార్కెట్‌ లో డిమాండ్ భారీగా పెరిగింది. కోళ్ల పెంపక ఖర్చులు కూడా అధికం కావడంతో  వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్మాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌ లో కోళ్ల సరఫరా పెరగడం, డిమాండ్ కొంత తగ్గడం వల్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయని చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు మాంసాహారం వినియోగాన్ని తగ్గించడం కూడా ధరలు తగ్గేందుకు కారణం అయ్యింది.

కిలో ధర రూ. 230 నుంచి 260 వరకు..

Advertisement

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు పట్టణాల్లో ప్రస్తుతం చికెన్ కిలో రూ.230 నుంచి రూ.260 మధ్య కొనసాగుతోంది.  లైవ్ చికెన్ ధరలు కూడా గతంతో పోలిస్తే తగ్గాయి. కొద్ది రోజుల కిందట కిలో లైవ్ చికెన్ రూ.180 దాటగా, ఇప్పుడు రూ.140 నుంచి రూ.160 మధ్య అమ్ముతున్నారు. ఫలితంగా రిటైల్ మార్కెట్‌ లో కూడా ధరలు తగ్గాయి.

హోటల్ వ్యాపారులకు ఊరట

చికెన్ ధరలు తగ్గడంతో హోటల్ వ్యాపారులు కూడా కొంత ఊరట పొందుతున్నారు. గతంలో చికెన్ రేట్లు పెరగడంతో  హోటళ్లు చికెన్ వంటకాల ధరలను పెంచాయి. ఇప్పుడు మళ్లీ ధరలు తగ్గుతుండటంతో వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ధరల తగ్గుదలపై పౌల్ట్రీ రైతుల ఆందోళన

Advertisement

అటు పౌల్ట్రీ రైతులు మాత్రం ధరలు తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఫీడ్ ధరలు, విద్యుత్ ఖర్చులు, రవాణా ఖర్చులు అధికంగానే ఉన్నా, మార్కెట్ ధరలు తగ్గడం వల్ల లాభాలు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు. ధరలు మరింత పడిపోతే చిన్నకారు పౌల్ట్రీ రైతులకు నష్టం వచ్చే అవకాశముందని అంటున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే చికెన్ డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం, అయితే ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు కాస్త సంతోషంగా ఉన్నారు. గత వారం వరకు కిలో చికెన్ కొనాలంటే రూ.300కు పైగా ఖర్చు చేయాల్సి వచ్చేదని,   ఇప్పుడు రూ.230కి లభించడం సంతోషంగా ఉందంటున్నారు.

Read Also: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు.. వామ్మో.. ఈసారి చుక్కలే!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×