E-Paper
Advertisement

Chicken Price Hike: కొండెక్కిన కోడి.. భారమైన గుడ్డు..?

Chicken Price Hike: కొండెక్కిన కోడి.. భారమైన గుడ్డు..?
Advertisement

Chicken Prices Hike in Andhra Pradesh and Telangana: సమ్మర్లో చికెన్ రేటు అమాంతం తగ్గిపోతుంది. కారణం.. సమ్మర్ హీట్ కి చికెన్ తినకూడదని భావిస్తారు. అలాగే వేడికి తట్టుకోలేక కోళ్లు చనిపోతుంటాయి. ఫలితంగా పౌల్ట్రీ వ్యాపారం కాస్త మందగిస్తుంది. వేసవి వేడి కాస్త తగ్గిందంటే చాలు.. చికెన్ ధరలకు రెక్కలొస్తాయి. కానీ ఇప్పుడు వేసవి ఇంకా వెళ్లకుండానే చికెన్ ధరలు పెరుగుతున్నాయి.

సామాన్యుడు కూడా ఒక రూ.100 పెట్టి తినే నాన్ వెజ్ చికెన్. మిగతా ఏ నాన్ వెజ్ చూసినా.. వందలు, వేల ఖరీదు ఉంటాయి. అంతపెట్టి తినే కంటే.. కాస్త చికెన్ వండుకుని తినడం మేలని భావించే వారు చాలామందే ఉన్నారు. కానీ ఇప్పుడా చికెన్ ధర కూడా పెరుగుతోంది.

Advertisement

వీకెండ్ వస్తే.. అందరూ చికెన్ షాపులవైపే చూస్తారు. ఒక్కోసారి చికెన్ షాపులు ఖాళీ కూడా ఉండవ్. బాగా రద్దీగా ఉంటాయి. అందరికీ ప్రియమైన చికెన్ ధర మరింత ప్రియం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వందల, వేల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతాయి. బ్రాయిలర్, ఫారం ఇలా రకాలు కూడా ఉంటాయి. గత నెలలో రూ.250 ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.300కు చేరువవుతోంది.

Also Read: రికార్డు స్థాయిలో లాభాలు.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్ !

Advertisement

పౌల్ట్రీల నిర్వహణ ఖర్చు, కోళ్ల మేత ఖర్చులు పెరగడంతోనే.. చికెన్ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ తో ధరతో పాటు.. కోడి గుడ్డు ధర కూడా 50 పైసల నుంచి రూ.1 మేర పెరిగింది. గత వారం ఒక గుడ్డు ధర రూ.5- రూ.5.50 ఉండగా.. ఈ వారం గుడ్డు ధర రూ.6 కు పెరిగింది. చికెన్ ధరలు పెరగడంతో.. వ్యాపారం తగ్గినట్లు వాపారులు వాపోతున్నారు. కిలో చికెన్ ధర రూ.250 ఉన్న సమయంలో ఒక్క జిల్లాలో 100 కేజీల వరకూ విక్రయాలు జరిగితే.. ఇప్పుడది 60-70 కేజీలకు తగ్గినట్లు సమాచారం. చికెన్, కోడిగుడ్డు ధర కూడా పెరగడంతో.. వినియోగదారులు ఇలాగైతే ఏం కొనాలి, ఏం తినాలని వాపోతున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×