E-Paper
Advertisement

Condoms: ఆటగాడే.. ఒక్కడే లక్షకు పైగా కండోమ్‌లు కొన్నాడట.. షాకిస్తున్న ఇన్‌స్టామార్ట్ ఇయర్ ఎండ్ రిపోర్ట్‌!

Condoms: ఆటగాడే.. ఒక్కడే లక్షకు పైగా కండోమ్‌లు కొన్నాడట.. షాకిస్తున్న ఇన్‌స్టామార్ట్ ఇయర్ ఎండ్ రిపోర్ట్‌!
Advertisement

Swiggy Instamart 2025: ఈ రోజుల్లో ప్రతి వస్తువును ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. కూరలో వేసి కరివేపాకు నుంచి లగ్జరీ వస్తువుల వరకు ఆర్డర్ చేస్తున్నారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్  తాజాగా తన ఇయర్ ఎండ్ ఆర్డర్ విశ్లేషణను విడుదల చేసింది. ఇండియన్స్ ఈ ఏడాదిలో తమ ప్లాట్‌ ఫారమ్‌ను ఎలా ఉపయోగించారో వివరించే ప్రయత్నం చేసింది. వినియోగదారులు తమ ప్లాట్ ఫారమ్ ను పాలు, కూరగాయలు, కరివేపాకు లాంటి రోజువారీ నిత్యావసరాల నుంచి ఐఫోన్లు, బంగారం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల లాంటి విలువైన వస్తువుల కొనుగోలు వరకు ఉపయోగించారని తెలిపింది. ఈ విశ్లేషణ 2025లో అతిపెద్ద,  చిన్న ఆర్డర్లను మాత్రమే కాకుండా, అత్యుత్తమ కార్ట్‌ లు, అధిక ఖర్చు చేసే వినియోగదారులు, అత్యంత తరచుగా ఆర్డర్ చేయబడిన ఉత్పత్తుల గురించి వివరించే ప్రయత్నం చేసింది.

రూ. లక్షకుపైగా విలువైన కండోమ్స్ కొనుగోలు

స్విగ్గీ ఇన్‌ స్టామార్ట్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ లో అత్యంత ఆసక్తికరమైన అంశం కండోమ్స్ కొనుగోలు. చెన్నైకి చెందిన ఓ వినియోగదారుడు ఏకంగా రూ. లక్షకుపై విలువ చేసే కండోమ్స్ ఆర్డర్ చేసినట్లు వివరించింది. ఇందుకోసం ఆయన  రూ.1,06,398 ఖర్చు చేసినట్లు తెలిపింది. సదరు వ్యక్తి 228 ప్రత్యేక కండోమ్ ఆర్డర్లను ఇచ్చాడు. తాజా నివేదికలో రికార్డు చేసిన అత్యంత అసాధారణమైన ఖర్చుకు సంబంధించిన అంశాలలో ఒకటిగా స్విగ్గీ ఇన్‌ స్టామార్ట్ వెల్లడించింది.  అంతేకాదు, ఈ ప్లాట్ ఫారమ్ లో ప్రతి 127 ఆర్డర్లలో ఒక కండోమ్‌ల ప్యాక్ ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ అత్యధికంగా కండోమ్స్ కొనుగోలు చేసినట్లు తెలలిపింది. గత నెలలతో పోలిస్తే కండోమ్ ఆర్డర్‌లు నవంబర్ లో 24 శాతం పెరిగాయని తెలిపింది.

పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసిన కస్టమర్లు

Advertisement

స్విగ్గీ ఇన్‌ స్టామార్ట్  వేదికగా కొంత మంది వినియోగదారులు ఎక్కువ విలువైన కొనుగోళ్లతో అందరినీ ఆకర్షించారు. బెంగళూరులోని ఒక కస్టమర్ 2025లో ఆర్డర్స్ ద్వారా అత్యంత ఎక్కువ ఖర్చు చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  మూడు ఐఫోన్లను కొనుగోలు చేయడానికి రూ. 4.3 లక్షల విలువైన ఒకే ఆర్డర్ ఇచ్చాడు. నోయిడాలో ఓ యువకుడు ఒకే ఆర్డర్‌ లో రూ.2.69 లక్షలు ఖర్చు చేసి, బ్లూటూత్ స్పీకర్లు, SSDలు, రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లను కొనుగోలు చేశాడు. ప్రీమియం ఎలక్ట్రానిక్స్ కోసం ఎంత ఎక్కువగా ఉపయోగించబడుతుందో అర్థం అవుతోంది.

Read Also: డిమార్ట్ లో ఇయర్ ఎండింగ్ ఆఫర్లు, వాటిపై ఏకంగా 80 శాతం తగ్గింపు!

రెడ్ బుల్ కోసం రూ. 16 లక్షలు ఖర్చు

Advertisement

ముంబై వినియోగదారులు సైతం పెద్ద మొత్తంలో ఆర్డర్స్ చేశారు. ఒకే అకౌంట్ నుంచి షుగర్ ఫ్రీ రెడ్ బుల్ కోసం ఏడాది పొడవునా రూ. 16.3 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.  చెన్నై వినియోగదారుడు పెంపుడు జంతువుల ఫుడ్ కోసం ప్రత్యేకంగా రూ. 2.41 లక్షలు ఖర్చు చేశాడు.  ఇన్ స్టంట్ డెలివరీకి పెరుగుతున్నఆదరణను చూపిస్తున్నట్లు స్విగ్గీ ఇన్‌ స్టామార్ట్  తెలిపింది.

Read Also: డిమార్టులో టాయిలెట్లు ఎందుకు ఉండవు? అర్జంట్ అయితే?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×