E-Paper
Advertisement

10 Minute Delivery: గిగ్ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. 10 నిమిషాల డెలివరీ విధానం బంద్

10 Minute Delivery: గిగ్ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. 10 నిమిషాల డెలివరీ విధానం బంద్
Advertisement

10 Minute Delivery: గిగ్ వర్కర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 10 నిమిషాల్లో ఆన్ లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ క్విక్ కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై 10 నిమిషాల్లో డెలివరీ యాడ్స్ ఇవ్వకూడదంటూ బ్లింకిట్ సహా క్విక్ కామర్స్ సంస్థలను ఆదేశించింది. 10 నిమిషాల నిబంధన ఎత్తివేయాలని న్యూఇయర్ సందర్భంగా గిగ్ వర్కర్లు దేశ వ్యాప్తంగా నిరసన తెలిపారు. దీంతో కేంద్రం తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

బ్లింకిట్ కీలక నిర్ణయం

10 నిమిషాల డెలివరీపై బ్లింకిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 10 ని|| క్విక్‌ డెలివరీని నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో గిగ్‌ వర్కర్లకు భారీ ఉపశమనం కలగనుంది. గిగ్‌ వర్కర్ల భద్రతా దృష్ట్యా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ క్విక్ కామర్స్ సంస్థలైన బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో మాట్లాడారు. త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్‌లు 10 నిమిషాల డెలివరీ నిబంధనను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జెప్టో, స్విగ్గీ కూడా 10 నిమిషాల విధానాన్ని నిలిపివేశాయి.

Advertisement

Also Read: 10 నిమిషాల్లో ఐఫోన్ 17 డెలివరీ.. ఇలా ఆర్డర్ చేయండి 

గిగ్ వర్కర్ల సమ్మె

కేంద్ర ప్రభుత్వ జోక్యం, గిగ్ వర్కర్ల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో బ్లింకిట్ 10 మినిట్స్ డెలివరీ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో అన్ని క్విక్ ప్లాట్‌ఫామ్‌ల డెలివరీ వర్కర్లు తమ పని పరిస్థితులు, డెలివరీ ఒత్తిడి, సామాజిక భద్రత లేకపోవడం వంటి సమస్యలను లేవనెత్తుతూ దేశవ్యాప్తంగా సమ్మె చేశారు.

10 ని. డెలవరీ విధానంలో మార్పులు

Advertisement

ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం చేసుకుని.. కంపెనీలు 10 మినిట్స్ డెలివరీ విధానంపై పునరాలోచించుకోవాలని సూచించారు. ఈ మేరకు కేంద్రం ప్రధాన ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరిపారు. చర్చలలో భాగంగా మాండవీయ బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల సందర్భంగా, కంపెనీలు తమ 10 మినిట్స్ డెలివరీ తొలగించాలని కేంద్ర మంత్రి కోరారు. ఈ విధానంతో ఒత్తిడి పెరుగుతుందని గిగ్ వర్కర్ల డిమాండ్లపై స్పందించాలని సూచించారు. అన్ని కంపెనీలు తమ ప్రకటనలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి 10 ని. డెలివరీ విధానాన్ని తొలగిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.

స్పందిస్తున్న సంస్థలు

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సహా ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకులు ఫాస్ట్ డెలివరీ మోడళ్లను సమర్థించుకుంటున్నారు. ఇవి సిస్టమ్ డిజైన్‌పై ఆధారపడి ఉన్నాయని, అలాగే డెలివరీ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. 10 నిమిషాల డెలివరీ బ్రాండింగ్‌ను తగ్గించాలనే ఆదేశాలపై కంపెనీలు స్పందించి తమ విధానాలను మార్పు చేస్తాయో? లేదో? వేచిచూడాలి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×