E-Paper
Advertisement

ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పార్లమెంటులో ప్రకటన, ఇంకా ఏం చెప్పిందంటే..

ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పార్లమెంటులో ప్రకటన, ఇంకా ఏం చెప్పిందంటే..
Advertisement

Polymer Notes: ఎట్టకేలకు ప్లాస్టిక్ నోట్లకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రూ.10, రూ.20 నోట్ల జెండా ఊపింది. రూ. 100 కోట్ల ఆయా నోట్ల తయారీ చేపడుతున్నట్లు పార్లమెంటులో వెల్లడించింది. ప్లాస్టిక్ నోట్లు ఓకే.. మరి పేపర్ నోట్లు మాటేంటి? అన్నదానిపై కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్- ప్లాస్టిక్ నోట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పాలిమర్ కరెన్సీ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద వినియోగంలోకి తీసుకొస్తామన్న ఆర్బీఐ చేసిన ప్రతిపాదనకు జెండా ఊపింది. వీటిని ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు-RBI కి అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు.

Advertisement

పార్లమెంటులో ప్రకటన- లోక్‌సభకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 25 కింద కేంద్ర బోర్డు సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకుందని  తెలిపారు. సామాన్యులు అత్యధికంగా వినియోగించే రూ . 10, రూ. 20 ప్లాస్టిక్ నోట్లను తీసుకురానున్నట్లు తెలియజేశారు.  కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు మన్నిక ఎక్కువ కాలం కలిగి ఉంటుందని ఆర్బీఐ చెప్పిందని సదరు మంత్రి స్పష్టత ఇచ్చారు.

పేపర్ కరెన్సీ మాటేంటి? పలు అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడైందన్నారు. ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయని చెప్పకనే చెప్పారు. పాలిమర్ నోట్లు వస్తే.. పేపర్ కరెన్సీపై ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. పాలిమర్ నోట్ల ప్రతిపాదన ప్రాథమిక దశలో ఉందన్నారు. వ్యవస్థలోకి చలామణిలోని వచ్చిన తర్వాత అంచనా వేస్తామన్నారు.

Advertisement

ప్లాస్టిక్-పేపర్లు నోట్లు రెండూ  అమల్లో ఉంటాయన్నారు. డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ కంటిన్యూ అవుతుందన్నారు. కాగితపు కరెన్సీకి అదనంగా ప్లాస్టిక్ నోట్లను తెస్తున్నామన్నారు మంత్రి. పేపర్ నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చే ప్రతిపాదన ఇప్పటివరకు ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు.

ALSO READ: రూ.100 కోట్లపైగా ఆదాయం.. నాలుగు రెట్లుకు పెరిగిన భారతీయులు,  వివరాలు బయటపెట్టిన కేంద్రం

పాలిమర్ నోట్లను రూ. 100 కోట్ల చొప్పున రూ. 10, రూ. 20 నోట్లను ముద్రించాలని నిర్ణయించింది కేంద్రం. తొలుత మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఓ వైపు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నా, నగదు వినియోగం అదే స్థాయిలో ఉన్నట్లు తేలింది.

టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే ముడి పదార్థాల సేకరణ, ముద్రణ పూర్తయిన తర్వాత ఆయా నోట్లను దశలవారీగా మార్కెట్లోకి విడుదల చేయనుంది కేంద్రం. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని పాలిమర్‌ నోట్లను ముద్రించనుంది కేంద్రం. రెండువారాల కిందట ఆర్‌బిఐ పాలిమర్ నోట్ల పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోందని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×