// // E Vehicle Policy - ఈవీ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక టెస్లా ఎంట్రీ..! -->
E-Paper
Advertisement

E Vehicle Policy : ఈవీ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక టెస్లా ఎంట్రీ..!

E Vehicle Policy : ఈవీ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక టెస్లా ఎంట్రీ..!
Advertisement

E Vehicle Policy

E Vehicle Policy : భారత్ లో ఎలక్ట్రికల్ వెహికిల్స్ తయారీపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఈ-వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత్ ఎలక్ట్రికల్ వెహికల్ ల తయారీకి డెస్టినీగా మారుతుందని పేర్కొంది. ప్రపంచస్థాయి కంపెనీలు పెట్టుబడులు పెడతాయని తెలిపింది.

Advertisement

కేంద్రం తీసుకొచ్చి ఈవీ పాలసీలో పెట్టుబడిదారులను ఆకర్షించే అనేక అంశాలున్నాయి. పెట్టే పెట్టుబడిని బట్టి రాయితీలు లభిస్తాయి. భారత్ లో 5 వేల మిలియన్ డాలర్లు అంటే రూ. 4,150 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే .. ఆ కంపెనీకి అనేక రాయితీలను కేంద్ర ఇస్తుంది.

భారత్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో అమెరికాకు చెంది టెస్లా కంపెనీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ కంపెనీ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలగనుంది. ఇక టెస్లా భారత్ లో ఎంట్రీ ఇవ్వనుంది. టెస్లా భారత్ లో భారీ పెట్టుబడుల పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. 3 ఏళ్లలో ప్రొడక్షన్ యూనిట్ ను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది.

Advertisement

Also Read : జపాన్‌కు మేడ్ ఇన్ ఇండియా కార్లు.. అట్లుంటది మనతో!

ఇప్పటి వరకు భారీగా ఉన్న దిగుమతి సుంకాలు టెస్లాకు అడ్డంకిగా ఉన్నాయి. కార్ల రేట్ ప్రకారం 70 నుంచి 100 శాతం దిగుమతి సుంకాలున్నాయి. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన పాలసీ ప్రకారం ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీకి వినియోగించే 25 శాతం పార్ట్స్ స్థానికంగా సమీకరించాలి. ఈ నిబంధనలు పాటిస్తే ఆయా కంపెనీలకు బెనిఫిట్స్ లభిస్తాయి. 35 వేల డాలర్ల కంటే ఎక్కువ రేట్ ఉన్న కార్లను 15 శాతం సుంకం చెల్లించి దిగుమతి చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 8 వేల ఈవీ కార్ల వరకు దిగుమతి చేసుకునే వెసులుబాటు ఇస్తారు.

కేంద్ర తీసుకొచ్చిన ఈ-వెహికల్స్ పాలసీ వల్ల దేశంలో న్యూ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. మేకిన్ ఇండియా లక్ష్యానికి చేరువకావడానికి వీలుకలుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ-వెహికల్స్ ఉపయోగపడతాయి. క్రూడాయిల్ ఇంపోర్ట్ తగ్గుతుంది. అలాగే వాణిజ్య లోటు తగ్గతుందని కేంద్ర వాణిజ్యశాఖ పేర్కొంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×