E-Paper
Advertisement

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్..  41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Advertisement

Hotels Levying Service Charges: తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్న రెస్టారెంట్లపై కఠిన చర్యలకు దిగింది ప్రభుత్వం. వినియోగదారుల రక్షణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పలు హోటళ్లపై కొరడా ఝులిపించింది కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ. ఈ క్రమంలో 41 హోటళ్లకు నోటీసులు ఇచ్చింది.

భోజనం బిల్లులో సర్వీస్ ఛార్జ్ వ్యవహారం- రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు భోజనం తర్వాత బిల్లు చేతికి బిల్లు ఇస్తారు. అందులో సర్వీస్ ఛార్జ్ అంటూ  అదనంగా 5 నుండి 10 శాతం జోడిస్తున్నాయి హోటల్లు. సర్వీసు ఛార్జ్ అనగానే ప్రభుత్వ విధించిన పన్ను అనుకుంటారు. మారు మాట్లాడకుండా దాన్ని కూడా చెల్లిస్తుంటాము.

Advertisement

41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు-వినియోగదారుల అనుమతి లేకుండా వారికిచ్చే బిల్లులో ఆటోమేటిక్‌గా సర్వీస్ ఛార్జ్ కలపడం చట్టవిరుద్ధమని చెబుతోంది  కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ-CCPA. ఈ నియమాలను ఉల్లంఘించిన 41 రెస్టారెంట్లపై విచారణ ప్రారంభించింది సీసీపీఏ. వీటిపై కఠిన చర్యలు రెడీ అవుతోంది. జూలై 19న వినియోగదారుల వ్యవహారాలు-ఆహారం,ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ విషయంలో తమ అనుమతి లేకుండానే బిల్లులో సర్వీస్ ఛార్జీ ఆటోమేటిక్‌గా జోడించబడిందని చూపే ఇన్‌ వాయిస్‌లను వినియోగదారులు.. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్-NCH కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయా హోటళ్లపై కొరడా ఝులిపించింది.  కస్టమర్ల అనుమతి లేకుండా బిల్లుల్లో అదనపు రుసుములు వేసినట్లు రుజువైంది.

Advertisement

ఓ హోటల్‌కు రూ.50 వేలు ఫైన్-కేఫ్ సిరీస్  ఛాయోస్ కి రూ. 50 వేల జరిమానా విధించింది. అంతేకాదు కస్టమర్ నుండి వసూలు చేసిన సర్వీస్ ఛార్జ్‌ను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. సాఫ్ట్‌వేర్‌లో సర్వీస్ ఛార్జ్ ఆటోమేటిక్‌గా పడకుండా బిల్లింగ్ సిస్టమ్‌ మార్చాలని స్పష్టం చేసింది. బార్బెక్యూ నేషన్, కెఫె బ్లూ బాటిల్, ఫూ అహ్మదాబాద్ వంటి రెస్టారెంట్లపై ఉత్తర్వులు జారీ చేసింది.

సర్వీస్ ఛార్జీలు తమ వ్యాపార నమూనాలో భాగమని, వాటి గురించి అవుట్‌లెట్లలో ప్రదర్శించే మెనూలు, నోటీసుల ద్వారా వినియోగదారులకు తెలియజేస్తామని వాదిస్తూ రెస్టారెంట్ సంఘాలు ప్రభుత్వ మార్గదర్శకాలపై  ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన విషయం తెల్సిందే.  ఢిల్లీ హైకోర్టు తీర్పు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ALSO READ: పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

వసూలు చేస్తే ఇదిగో నెంబర్, ఫిర్యాదు చేయొచ్చు-సర్వీస్ ఛార్జ్‌ను నిర్బంధంగా వసూలు చేయడం చట్టానికి విరుద్ధమని స్పష్టం చేస్తూ సీసీపీఏ మార్గదర్శకాలను సమర్థించింది న్యాయస్థానం. టిప్‌కు తాము వ్యతిరేకం కాదని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. తాము ఇచ్చిన సర్వీసుతో సంతృప్తి చెందితే వినియోగదారులు టిప్ ఇవ్వవచ్చు. ఆ విధంగా చెల్లించడానికి వినియోగదారులకు స్వేచ్ఛ ఉంది.

మీ అనుమతి లేకుండా బిల్లులో సర్వీస్ ఛార్జ్ జోడిస్తే దానిని తొలగించమని రెస్టారెంట్ నిర్వాహకులను కోరవచ్చు. మీ అభ్యర్థన తిరస్కరించినట్లయితే  మీరు 1915 (టోల్-ఫ్రీ) నెంబర్ లేకుంటే NCH ప్లాట్‌ఫారమ్ ద్వారా జాతీయ వినియోగదారుల సహాయవాణికి ఫిర్యాదు చేయవచ్చు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×