E-Paper
Advertisement

బైజూస్ ఫౌండర్‌కు కష్టాలు.. రవీంద్రన్‌కు భారీ ఎదురుదెబ్బ, ఆపై ఆరునెలల జైలు

బైజూస్ ఫౌండర్‌కు కష్టాలు.. రవీంద్రన్‌కు భారీ ఎదురుదెబ్బ, ఆపై ఆరునెలల జైలు
Advertisement

Biju’s Founder: బైజూస్ ఫౌండర్ రవీంద్రన్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆయన స్థాపించిన సామ్రాజ్యం నిట్ట నిలువునా కుప్పకూలింది. ఫలితంగా ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా ఆయన జైలుకి వెళ్లే పరిస్థితి దాపురించింది. ఇంతకీ న్యాయస్థానంలో ఏం జరిగింది?

బైజూస్ ఫౌండర్‌కు కష్టాలు రెట్టింపు

Advertisement

బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ పేరు చెప్పనక్కర్లేదు. తొలిసారి లాక్ డౌన్‌లో ఆయనతోపాటు బైజూస్ కంపెనీ అంతగా పాపులర్ అయ్యింది. ఆయన స్థాపించిన థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (బైజూస్‌గా ప్రసిద్ధి చెందిన) సంస్థ అతన్ని బిలియనీర్‌గా మార్చింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షించాడు.

ఎంతవేగంగా ఎదిగిందో, అదే స్థాయిలో కిందకు దిగజారిపోయింది. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే రవీంద్రన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు సింగపూర్ న్యాయస్థానం ఆరునెలలు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే ఆయన చేసిన అతి పెద్ద తప్పు. స్టార్టప్‌లో బిలియనీర్‌గా వెలిగిన రవీంద్రన్, తన ఆస్తుల వివరాలను దాయడమే న్యాయస్థానం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

రవీంద్రన్‌కు జైలు శిక్ష..  ఆపై 70 వేల డాలర్ల జరిమానా

బైజూస్ సంస్థ నష్టాల్లో ఉన్న సమయంలో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన ఓ అనుబంధ సంస్థ అందులో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఒప్పందం ఉల్లంఘనల కారణంగా ఖతార్ సంస్థ నేరుగా సింగపూర్ న్యాయస్థానంలో పోరాటానికి దిగింది. నిధులను రికవరీ చేసుకునే ప్రక్రియలో భాగంగా ధిక్కరణ పిటిషన్‌ను దాఖలైంది.

ఈ కేసు విచారణలో భాగంగా బైజూస్ రవీంద్రన్ వ్యక్తిగత ఆస్తులు, కంపెనీ వాటాల వివరాలను సమర్పించాల్సి ఉంది. బీఆర్ ఇన్వెస్ట్‌కో అనే అనుబంధ సంస్థకు యాజమాన్య పత్రాలను చూపించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రవీంద్రన్ బేఖాతరు చేశారు. ఆస్తుల వివరాలను వెల్లడించకుండా దాట వేయడంతో ఆగ్రహించింది సింగపూర్ కోర్టు.

ALSO READ: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

పరిస్థితి గమనించిన కోర్టు, లొంగిపోవాలని ఆయన్ని ఆదేశించింది. జైలు శిక్షతోపాటు కోర్టు ఖర్చుల కోసం దాదాపు 70,500 డాలర్ల జరిమానా కింద చెల్లించాల్సి ఉంది. ఖతార్ హోల్డింగ్స్ తరఫున డ్రూ అండ్ నాపియర్ ప్రాతినిధ్యం వహించగా, బైజూస్ ఇన్వెస్ట్‌మెంట్స్ తరఫున ఫెర్వెంట్ ఛాంబర్స్ ప్రాతినిధ్యం వహించింది.

బైజూస్ పతనం తర్వాత ఆయనపై వివిద దేశాల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. రుణదాతల నుంచి తీసుకున్న 1.2 బిలియన్ డాలర్ల లోన్ రికవరీ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రవీంద్రన్ ఎక్కడున్నారనేది ఇంకా తెలియాల్సివుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×