E-Paper
Advertisement

Buying AC Tips: కొత్త ఏసీ కొనే ముందు తెలుసుకోవాల్సిన 7 విషయాలివే

Buying AC Tips: కొత్త ఏసీ కొనే ముందు తెలుసుకోవాల్సిన 7 విషయాలివే
Advertisement

Buying AC Tips: ఈ ఏడాది కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలు 40°C దాటుతుంటాయి. దీంతో ఎయిర్ కండిషనర్ అవసరంగా మారాయి. ఏసీ కొనుగోలు చేసే ముందు కొన్న ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే మన్నికైన ప్రాడెక్ట్ తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సరైన మోడల్ ను ఎంచుకుంటే సౌకర్యంతో పాటు కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.

1.మీరు ఏసీ కొనాలని డిసైడ్ అయినప్పుడు మొదటిగా బడ్జెట్‌ను ఫిక్స్ చేసుకోండి. మీ బడ్జెట్ లో ఉన్న ఎయిర్ కండిషనర్లను షార్ట్‌లిస్ట్ చేసుకోండి. మంచి ఎయిర్ కండిషనర్లు రూ. 26,000 నుంచి స్టార్ అవుతున్నాయి. బ్రాండ్, ఫీచర్లను బట్టి ధర ఉంటుంది.

Advertisement

2.మీ రూమ్ పరిమాణం బట్టి ఏసీ యూనిట్‌ను సెలెక్ట్ చేసుకోండి. 120 చదరపు గదులు రూమ్ లకు సాధారణంగా 1-టన్ ఏసీ సరిపోతుంది. రూమ్ స్పేస్ ను బట్టి ఏసీని సెలెక్ట్ చేసుకోండి.

3.ఏసీ కొనే ముందు ముఖ్యంగా చూడాల్సిన మరో అంశం స్టార్ రేటింగ్. ఏసీ పనిచేసే సామర్థ్యాన్ని బట్టి ఎక్కువ స్టార్ రేటింగ్‌లు ఉంటాయి. అలాగే స్టార్ రేటింగ్.. ఎంత విద్యుత్ ను ఖర్చు చేస్తాయో కూడా తెలియజేస్తాయి. తక్కువ స్టార్ రేటింగ్ ఏసీలు తగ్గింపులో వచ్చినా కరెంట్ ఛార్జీలను పెంచేస్తాయి.

Advertisement

4. ఏసీ తీసుకునే ముందు బ్రాండ్ క్వాలిటీ, వారంటీ, కస్టమర్ రివ్యూస్ చెక్ చేయండి. ఎక్కువ రోజులు పనిచేసే ఏసీ కాస్త ఎక్కువ ధర ఉండవచ్చు కానీ నిర్వహణ ఖర్చులను తక్కువగా ఉంటాయి.

5.ఎయిర్ కండిషనర్ కొనుగోలులో చెక్ చేయాల్సిన మరో ముఖ్యమైన అంశం టైప్. ఏసీలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి. స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ.
విండో ఎయిర్ కండిషనర్లను ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం. వాటిని గది కిటికీలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఎటువంటి డ్రిల్లింగ్ అవసరం లేదు. కానీ కొంత ప్రదేశాన్ని మాత్రమే కూల్ చేస్తుంది. స్ప్లిట్ ఏసీ ఎక్కువ ప్రదేశాన్ని చాలా త్వరగా కూల్ చేస్తుంది. స్ప్లిట్ ACలో చల్లని గాలిని వేగంగా బయటకు పంపే బ్లోయర్‌లు ఉంటాయి. ఇవి విండో ఏసీల కంటే తక్కువ శబ్దం చేస్తాయి.

6.ఏసీలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ అవసరం. కాబట్టి, AC కొనడానికి ముందు కంపెనీ సర్వీసింగ్ స్పీడ్ గా ఉంటుందో? లేదో? ఎంక్వైరీ చేయండి.

7. రిమోట్ కంట్రోల్, స్మార్ట్ కనెక్టివిటీ, స్లీప్ మోడ్‌, స్పీడ్ కూలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయా? అనేది చెక్ చేయండి. నేడు ప్రతి ఇంట్లో ఏసీలు ఉంటున్నాయి. మీకు తెలిసిన వారి ఇంట్లో ఏ ఏసీ వాడుతున్నారు, వాటి పనితీరును అడిగి తెలుసుకోండి.

Also Read: జియో ప్లాన్‌లో 20GB బోనస్ డేటా.. డైలీ 2GB డేటా, 90 రోజుల వాలిడిటీ, మరిన్ని బెనిఫిట్స్.. ధర ఎంతంటే

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×