E-Paper
Advertisement

Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. 80C పరిమితి పెంచుతారా?.. ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు

Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. 80C పరిమితి పెంచుతారా?.. ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారు
Advertisement

Budget 2026: 2026 బడ్జెట్ దగ్గర పడుతున్న కొద్దీ వ్యక్తిగత ఆదాయపు పన్నులో రాబోయే సంస్కరణల గురించి పన్ను చెల్లింపు దారులు, ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఊహాగానాలు చేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మారుతున్న జీవనశైలితో పన్ను పరిమితులు కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా దేశంలో పన్ను నిర్మాణాలు మారుతున్నాయి. వీటిల్లో ముఖ్యమైంది 2020లో తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం. దీంతో పన్ను విధానాన్ని సరళీకృతం చేసినప్పటికీ ఇంకా సమస్యలు అలానే ఉన్నాయి. పరిష్కరించబడలేదు.

ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో..వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గింపోతుంది. అందువల్ల చాలా మంది పన్ను చెల్లింపుదారులు కేంద్ర బడ్జెట్ నుంచి పన్ను ఉపశమనాలను ఆశిస్తు్న్నారు. పన్ను మినహాయింపుల్లో కీలకమైన 80C సీలింగ్ ను చివరిసారిగా 2014లో సవరించారు. గత పదేళ్లుగా జీవన వ్యయం, EMIలు, ఆరోగ్య బీమా ప్రీమియంలు, విద్యా వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కానీ పన్ను పరిమితులు మాత్రం అలాగే ఉన్నాయి.

80C పరిమితిలో పెంపు

Advertisement

బడ్జెట్ 2026 పై ఉద్యోగుల ప్రధాన డిమాండ్.. పన్ను పరిమితులు మార్పులు. దాదాపు పదేళ్లుగా సెక్షన్ 80C పరిమితిని రూ. 1.5 లక్షల వద్ద ఉంచారు. సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా మొత్తాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ప్రీమియంలు, EMIలు, పిల్లల చదువుల ఖర్చులు గణనీయంగా పెరిగినప్పటికీ పన్ను మినహాయింపులు పరిమితులు మారలేదని నిపుణులు అంటున్నారు. 80C పరిమితిని దాదాపు రూ. 3 లక్షలకు పెంచాలని, ఆరోగ్య బీమా పరిమితులను కూడా పెంచాలని, అత్యధిక 30% స్లాబ్‌కు ఆదాయ పరిమితిని పెంచాలని ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న డిమాండ్. దీంతో రూ. 10-35 లక్షల మధ్య సంపాదించే వారికి ఉపశమనం కనిపిస్తుంది.

ఈ పరిమితుల పెంపుతో మధ్యతరగతి కుటుంబాలు పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోవడానికి సహాయపడటమే కాకుండా, గృహనిర్మాణం, బీమా, పెట్టుబడి ఖర్చులను సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. మూలధన లాభాలు, పన్నుల పరిమితులలో మార్పులు చాలా కాలంగా ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెడతాయని అంటున్నారు.

కొత్త, పాత పన్ను విధానాలు

Advertisement

కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చి దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచినా.. ఇప్పటికీ రెండు వ్యవస్థలను వేరుగా అమలు చేస్తున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో గందరగోళం నెలకొంది. కొత్త పన్ను విధానంలో తక్కువ రేట్లు, తక్కువ తగ్గింపులు ఉన్నాయి. కానీ PPF, ELSS, గృహ రుణ తగ్గింపుల మార్గాలను ఇష్టపడే మధ్యతరగతి వారు పాత పన్ను విధానాన్నే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం, ఐటీ చెల్లింపు దాఖలు చేసిన వారిలో ఎక్కువ మంది కొత్త పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు.

Also Read:  బడ్జెట్ ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్న ఆపిల్.. మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే ధర తక్కువ

ఉద్యోగులు ఇంకేం కోరుకుంటున్నారు?

  • ద్రవ్యోల్బణానికి అనుగుణంగా స్లాబ్‌లను రూపొందించాలి
  • సెక్షన్ 87A రిబేట్ పరిమితులు మార్పులు
  • చిన్న పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెట్టే అస్పష్టతలను తొలగించడం
  • పాత పద్ధతిలో ఏవైనా మార్పులు
  • 80C-లింక్డ్ ఉత్పత్తుల్లో మార్పులు

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×