E-Paper
Advertisement

BSNL Cheapest Recharge Plans: దెబ్బ మీద దెబ్బ.. BSNL నుంచి మూడు చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్!

BSNL Cheapest Recharge Plans: దెబ్బ మీద దెబ్బ.. BSNL నుంచి మూడు చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్!
Advertisement

BSNL Cheapest Recharge Plans: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తోంది. జూలై 3, 2024న, Jio, Airtel తమ కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచి జాబితాను విడుదల చేశాయి. అదే సమయంలో Vi కొత్త రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాను జూలై 4న విడుదల చేసింది. దీని తరువాత మూడు కంపెనీలకు పోటీగా BSNL అనేక ప్లాన్‌లను విడుదల చేసింది.

వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL నిరంతరం వివిధ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఇది కాకుండా సంస్థ ద్వారా అనేక సేవల్లో కూడా మార్పులు చేస్తున్నారు. కంపెనీ రీఛార్జ్ ప్లాన్‌లు 5G నెట్‌వర్క్‌కి సంబంధించి అందుబాటులో లేవు. కానీ, 4G నెట్వర్క్ ప్లాన్‌లను చాలా తక్కువ ధరకి ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో BSNL అందించే 3 చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: BSNLను ఇక తట్టుకోలేరు భయ్యా.. అతి తక్కువ ధరకే 3 నెలలు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా!

BSNL Rs. 197 Recharge Plan
BSNL 70 రోజుల వాలిడిటీతో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. మీరు కేవలం 197 రూపాయలకే 70 రోజుల పాటు 2GB డేటాను పొందవచ్చు. అయితే అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ 18 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు 70 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు రూ. 199 రీఛార్జ్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.

Advertisement

BSNL Rs. 797 Recharge Plan
BSNL రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాలో 300 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.797. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అయితే మొదటి 60 రోజుల ప్లాన్‌తో 2GB డేటా మాత్రమే లభిస్తుంది.

Also Read: ఆట ఇప్పుడే మొదలైంది.. BSNLతో ఎలాన్ మస్క్ ఒప్పందం..!

BSNL Rs. 1999 Recharge Plan
365 రోజుల వాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్ అంటే 1 సంవత్సరం రూ. 1999కి అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు అన్‌లిమిటెడ్ కాలింగ్, 600 GB డేటా బెనిఫిట్ పొందుతారు. ఇది కాకుండా BSNL ట్యూన్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. SIMని 1 సంవత్సరం పాటు యాక్టివ్‌గా ఉంచడానికి, ఎక్కువ రోజుల పాటు కాలింగ్ ప్రయోజనాలను పొందడానికి ఈ ప్లాన్ చౌకగా ఉంటుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×