E-Paper
Advertisement

Biogas Plant: ఇంట్లోనే వంట గ్యాస్ తయారీ.. కేంద్రం నుంచి నిధులు.. అమ్ముకుంటే డబ్బే డబ్బు!

Biogas Plant: ఇంట్లోనే వంట గ్యాస్ తయారీ.. కేంద్రం నుంచి నిధులు.. అమ్ముకుంటే డబ్బే డబ్బు!
Advertisement

Biogas Plant: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందంటూ పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. దీనికి తోడు చాలా చోట్ల డొమెస్టిక్ సిలిండర్లు డెలివరీ కాకపోతుండటంతో సామాన్యుల్లో ఆందోళన మెుదలైంది. అయితే ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా బయో గ్లాస్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. దీనిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయో గ్యాస్ ప్లాంట్ కు కేంద్రం ఆర్థిక సాయాన్ని సైతం చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ కథనంలో పరిశీలిద్దాం.

బయో గ్యాస్ తయారీ విధానం

సేంద్రియ పదార్థాలు ఆక్సిజన్ లేని స్థితిలో కుళ్లిపోవడం (Anaerobic Digestion) ద్వారా విడుదలయ్యే వాయువును బయో గ్యాస్ అంటారు. ఇందులో ప్రధానంగా మిథేన్ ఉంటుంది. ఇంట్లోనే బయో గ్యాస్ తయారు చేయడానికి ఆవు పేడ, గేదె పేడ, వంటగది వ్యర్థాలు (కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం), పండ్ల వ్యర్థాలు అవసరం అవుతాయి. అనంతరం వాటిని నీటిలో వేసి చిక్కటి మిశ్రమంగా మార్చాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గాలి ప్రవేశించలేని (ఆక్సిజన్) ఒక ట్యాంక్ లో పోసి.. పూర్తిగా మూసి వేయాలి. ట్యాంక్‌లో బ్యాక్టీరియా చర్య వల్ల 15 నుండి 20 రోజుల్లో గ్యాస్ విడుదలవుతుంది. విడుదలైన గ్యాస్‌ను పైపుల ద్వారా స్టవ్‌కు అనుసంధానించుకోవచ్చు.

కేంద్రం అందించే ఆర్థిక సాయం

Advertisement

గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసే వారికి.. భారత ప్రభుత్వం ‘గోబర్ ధన్’ (GOBAR-dhan), నేషనల్ బయో గ్యాస్ అండ్ ఆర్గానిక్ మెన్యూర్ ప్రోగ్రామ్ (NNBOMP) ద్వారా రాయితీలు అందిస్తోంది. ఇంటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే చిన్నపాటి ప్లాంట్లపై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.9,800 – రూ.14,350 వరకు సబ్సిడీ అందిస్తోంది. ఈ మొత్తం రాష్ట్రాన్ని బట్టి, లబ్ధిదారుని వర్గాన్ని (SC/ST/ఈశాన్య రాష్ట్రాలు) బట్టి మారుతుంటాయి. పథకానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం.. మీ జిల్లాలోని ‘పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’ (NEDCAP వంటివి) లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి.

Also Read: LPG Gas Production: ఎల్‌పీజీ గ్యాస్ ఎలా తయారు చేస్తారు? ఏ ముడి పదార్థాలు అవసరం? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి!

బయో గ్యాస్ ద్వారా లాభాలు

Advertisement

బయో గ్యాస్‌ను నేరుగా అమ్ముకోవడంతో పాటు దాని ఉప ఉత్పత్తుల ద్వారా లాభాలు సంపాదించవచ్చు. వంట గ్యాస్ కోసం ప్రతీ నెల చేసే ఖర్చు తగ్గుతుంది. గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత మిగిలే వ్యర్థం (Slurry) అద్భుతమైన సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. దీనిని ఎండబెట్టి ప్యాక్ చేసి రైతులకు లేదా నర్సరీలకు అమ్ముకోవచ్చు. ఇది రసాయన ఎరువుల కంటే ఖరీదైనది. మీరు భారీ స్థాయిలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే గ్యాస్‌ను సిలిండర్లలో నింపి వాణిజ్య అవసరాలకు విక్రయించవచ్చు. దీని కోసం ప్రభుత్వం ‘SATAT’ పథకం కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు ప్లాంట్ లీకేజీ లేకుండా చూసుకోవడం, సరైన గాలి వెలుతురు ఉన్న చోట నిర్మించడం భద్రతాపరంగా చాలా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు.

Also Read: AP Weather: ఎండల వేళ.. చలచల్లని శుభవార్త.. 5 రోజులు వర్షాలే వర్షాలు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×