E-Paper
Advertisement

Fuel Credit Cards: ఇంధన ఖర్చుల్లో ఆదా.. బెస్ట్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు, ఆఫర్లు ఇవే

Fuel Credit Cards: ఇంధన ఖర్చుల్లో ఆదా.. బెస్ట్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు, ఆఫర్లు ఇవే
Advertisement

Fuel Credit Cards: అంతర్జాతీయ పరిస్థితులతో చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతుందని వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ రూ.2 పైగా పెరిగింది. ఈ సమయంలో ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు… పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించుకోవడంలో సహాయపడతాయి. IOCL, BPCL, HPCL వంటి ఇంధన కంపెనీలతో బ్యాంకులు టై అప్ అయి క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఈ కార్డులతో రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్ తో పాటు, 1% సర్‌ఛార్జ్ ఫీజును మాఫీ చేస్తున్నాయి. మీరు ఎక్కువగా ఎక్కడ పెట్రోల్ నింపుతారో దాని ఆధారంగా క్రెడిట్ కార్డు ఎంపిక చేసుకుంటే బెటర్.

SBI BPCL ఆక్టేన్ క్రెడిట్ కార్డు

భారత్ పెట్రోలియం బంక్ లో మీరు ఎక్కువగా పెట్రోల్/డీజిల్ నింపుతుంటే SBI ఆక్టేన్ కార్డు బెస్ట్ ఆప్షన్. BPCL బంకుల్లో ఇంధనం కొనుగోలు చేస్తే 3.75% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇందులో రివార్డ్ పాయింట్ల ద్వారా 2.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్యూయల్ సర్‌ఛార్జ్ డీల్ 1.25%గా ఉంటుంది. ఫ్యూయల్ తో పాటు పుడ్, కిరాణా స్టోర్స్ లో కొనుగోళ్లకు 1.25% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. గోల్ఫ్ కోర్స్ యాక్సెస్, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ యాక్సెస్, భారీగా ఖర్చు చేసే వాళ్లకు స్మార్ట్ఈఎంఐ ఆఫర్లు ఉన్నాయి. ఇది కేవలం ఫ్యూయల్‌కు మాత్రమే కాకుండా, ఇతర అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

BPCL బంకుల్లో ఫ్యూయల్ నింపితే ప్రతి రూ.100కి 25 రివార్డ్ పాయింట్లు అంటే 6.25% క్యాష్‌బ్యాక్ వస్తుంది. రూ.4,000 వరకు లావాదేవీలపై 1% ఇంధన సర్‌ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. ఫుడ్, కిరాణా సరకులపై ప్రతి రూ.100కి 5 రివార్డ్ పాయింట్లు వస్తాయి. ప్రతి బిల్లింగ్ సైకిల్‌కు గరిష్టంగా 2,500 రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ఈ కార్డు యాన్యువల్ ఛార్జీ రూ.1499+GST, అయితే ఏడాదికి రూ.2,00,000 లకు పైగా ఖర్చు చేస్తే ఛార్జీ మాఫీ చేస్తారు.

ICICI బ్యాంక్ HPCL కోరల్ క్రెడిట్ కార్డ్

HPCL తో లింక్ అయి చాలా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కానీ ICICI కోరల్ వెర్షన్ కార్డు కాస్త ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ఫ్యూయల్ రివార్డులతో పాటు HPCL కొనుగోళ్లపై 2.5% క్యాష్‌బ్యాక్, 1% ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపుతో కలుపుకుని మొత్తం 3.5% వరకు సేవ్ చేసుకోవచ్చు. HPCL స్టేషన్లలో ప్రతి రూ.100 బిల్లుకు 10 రివార్డ్ పాయింట్లు, రూ.400 నుంచి రూ.5,000 లావాదేవీలపై 1% ఇంధన సర్ ఛార్జీ మినహాయింపు ఉంటుంది. రివార్డు పాయింట్లు, సంవత్సరానికి 8 ఉచిత ఎయిర్ పోర్టు లాంజ్ యాక్సెస్ లు ఉన్నాయి. ఈ కార్డు యాన్యువల్ ఛార్జీ రూ.199 మాత్రమే.

ఇండియన్‌ ఆయిల్ RBL బ్యాంక్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్

Advertisement

రివార్డుల్లో.. ఈ కార్డ్ మిగతా అన్నింటి కంటే ముందుంది. ఇండియన్‌ఆయిల్ బంకుల్లో ఫ్యూయల్ కొట్టిస్తే 8.5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రతి రూ.100 బిల్లుపై 15 ఫ్యూయల్ పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్లను అదనపు పెట్రోల్/డీజిల్ కోసం రీడీమ్ చేసుకోవచ్చు. అలాగే రూ.500- రూ.4000 మధ్య కొనుగోళ్లకు 1% సర్‌ ఛార్జీ మినహాయింపు ఉంటుంది. నెలకు మ్యాగ్జిమమ్ 2,000 ఫ్యూయల్ పాయింట్లు రూ.1000 పరిమితితో లభిస్తాయి. అంటే మీరు నెలకు సుమారు రూ.13,300 ఖర్చు చేస్తే గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే.. ప్రతి రూ.100కి కేవలం 2 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఈ కార్డు యాన్యువల్ ఛార్జీ రూ.1500+ జీఎస్టీ. సంవత్సరానికి రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తే యాన్యువల్ ఛార్జీ మాఫీ చేస్తారు. వీటితో పాటు IOCL HDFC Card, IOCL కోటక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ IOCL ప్యూయల్+ఎంటర్టైన్మెంట్ క్రెడిట్ కార్డు, HPCL ఎనర్జీ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ఆకర్షణీయమైన ప్రయోజనాలు అందిస్తున్నాయి.

Also Read:  మొదటిసారి క్రెడిట్ కార్డు అప్లై చేస్తున్నారా?.. ఈ విషయాలు చెక్ చేసుకోండి

గమనిక: ఈ ఆర్టికల్ లో సమాచారం పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితం. దీనితో బిగ్ టీవీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదు. క్రెడిట్ కార్డుల ఎంపిక ముందు నిపుణులు సలహాలు తీసుకుంటే మంచిది. ఇది కేవలం యూజర్ అవగాహన కోసం మాత్రమే.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×