E-Paper
Advertisement

Bajaj Freedom 125: ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్.. తక్కువ ధరకు లభించే వేరియంట్ ఇదే.. ఫీచర్లు ఎందులో ఎక్కువంటే?

Bajaj Freedom 125: ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్.. తక్కువ ధరకు లభించే వేరియంట్ ఇదే.. ఫీచర్లు ఎందులో ఎక్కువంటే?
Advertisement

Bajaj Freedom 125 Low Price Variant: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవలే ‘ఫ్రీడమ్ 125’ పేరుతో ప్రపంచంలో తొలి సీఎన్‌జీ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ కోసం ఎంతో మంది వాహన ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. మొత్తంగా ఈ సీఎన్‌జీ బైక్ జూలై 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ బైక్ అదిరిపోయే లుక్ అండ్ డిజైన్, కళ్లుచెదిరే ఫీచర్లతో మొత్తం డ్రమ్, డ్రమ్ ఎల్‌ఈడీ, డిస్క్ ఎల్‌ఈడీ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఈ బైక్‌ను రెండు ఆప్షన్లలో మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అందులో ఒకటి సీఎన్‌జీ కాగా మరొకటి పెట్రోల్. ఈ రెండూ కలిపి మొత్తం 330 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఈ మూడు వేరియంట్లలో ఏది తక్కువ ధరకు లభిస్తుంది. ఏది ఎంత మైలేజీ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Bajaj Freedom 125 CNG drum variant

Advertisement

బజాజ్ లాంచ్ చేసిన ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్‌లో మొదటిది డ్రమ్ వేరియంట్. ఇది ఎంట్రీ లెవెల్ వేరియంట్. ఈ వేరియంట్ కేవలం రూ.95,000 ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ ఆప్షన్ ఇవ్వబడలేదు. ఈ వేరియంట్‌లో ముందువైపు 130 మిమీ CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్), అలాగే 110 మిమీ రియర్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రూపొందించిబడింది. ఇది 17 ఇంచుల ఫ్రంట్, 16 ఇంచుల రియర్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఈ వేరియంట్ ప్యూటర్ గ్రే/ఎల్లో అండ్ ఎబోనీ బ్లాక్ / రెడ్‌తో మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఫుల్ ఎల్‌సీడీ కన్సోల్, హలోజన్ హెడ్‌లైట్‌ వంటివి ఉన్నాయి.

Also Read: అసలు ఊహించలేదు.. బజాజ్ CNG అదిరింది.. లుక్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!

Advertisement

Bajaj Freedom 125 CNG Drum LED variant

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డ్రమ్ ఎల్‌ఈడీ మిడ్ రేంజ్ వేరియంట్. ఈ వేరియంట్ మార్కెట్‌లోకి రూ.1,05,000 ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూడా ఎంట్రీ లెవెల్ వేరియంట్ మాదిరిగానే బ్లూటూత్ కనెక్టివిటీ లేదు. కాగా ఇందులో 130 మిమీ రియర్ డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ (డే టైమ్ లైటింగ్), ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ట్యాంక్ కవర్ ప్లాప్‌ను కలిగి ఉంది. ఈ వేరియంట్ ఎబోనీ బ్లాక్/ గ్రే, కరేబియన్ బ్లూ, ప్యూటర్ గ్రే/ బ్లాక్, రేసింగ్ రెడ్, సబర్ వైట్ వంటి మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

Bajaj Freedom 125 CNG Disc LED variant

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ డిస్క్ ఎల్‌ఈడీ టాప్ వేరియంట్. ఈ వేరియంట్ ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్ వేరియంట్లలో ఉన్న అన్నీ ఫీచర్లను పొందుతుంది. ఇది రూ.1,10,000 ఎక్స్ షోరూమ్ ధరతో రిలీజ్ అయింది. ఇందులో మిస్డ్ కాల్ ఇండికేషన్, కాల్ వార్నింగ్ కోసం బ్లూటూల్ ద్వారా మొబైల్ కనెక్టివిటీతో వస్తుంది. అంతేకాకుండా 240 మిమీ ఫ్రంట్ డిస్క్, 130 మిమీ రియర్ డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌తో వస్తుంది. 17 ఇంచుల ఫ్రంట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల మంచి ఫీచర్లు కలిగిన ఈ బైక్‌ను మీకు ఇష్టమైన ధరలో కొనుక్కోవచ్చు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×