E-Paper
Advertisement

Qantas: ఘోస్ట్ ఫ్లైట్స్ కుంభకోణంలో.. కాంటాస్ కు 66 మిలియన్ డాలర్ల ఫైన్

Qantas: ఘోస్ట్ ఫ్లైట్స్ కుంభకోణంలో.. కాంటాస్ కు 66 మిలియన్ డాలర్ల ఫైన్
Advertisement

Qantas: ఆస్ట్రేలియా అతి పెద్ద విమానయాన సంస్థ కాంటాస్ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తప్పుబట్టిన ఆ దేశ నియంత్రణా సంస్థ కాంటాస్ కు రూ. 550 కోట్ల జరిమానా విధించింది. లాభాల కోసం అక్రమ విధానాలను అనుసరించిన కాంటాస్ చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఘోస్ట్ ప్లైట్స్ పేరుతో పిలబడుతున్న కుంభకోణంలో 66 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి కాంటాస్ సిద్ధమైంది. చాలా రోజులుగా ముందుగా రద్దయిన విమాన టికెట్లను కూడా కాంటాస్ అమ్ముతూ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించిందని ఆస్ట్రేలియా నియంత్రణా సంస్థ ప్రకటించింది. దీంతో 66 మిలియన్ డాలర్ల జరిమానాతో పాటు 86 వేల మంది ప్రయాణికులకు 13 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని నియంత్రణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

కాంటాస్ తీరుపై నియంత్రణా సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది. లాభాల కక్కుర్తితో కంపెనీ చేసిన పని ఏ మాత్రం సరైనది కాదని చివాట్లు పెట్టింది. సంస్థ నిర్వాకం వల్ల చాలా మంది వ్యాపారులు, పర్యటకులు రద్దు చేసిన విమానాల్లో టికెట్టు బుక్ చేసుకుని నష్టపోయారని వెల్లడించింది. తమ కస్టమర్లకు నష్టం కలిగించామని, మూడు రోజుల ముందు రద్దయిన విమానాల టికెట్లను కూడా విక్రయించాం, ప్రమాణాలను పాటించటంలో విఫలమయ్యాం,ప్రయాణికులకు సకాలంలో నోటిఫికేషన్లు పంపలేకపోయామని కాంటాస్ సీఈఓ వనెస్సా హడ్సన్ తమ తప్పును అంగీకరించారు.

Also Read: ప్రతిరోజూ రూ. 45 ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 25 లక్షలు మీ సొంతం!

Advertisement

ఇదిలా ఉంటే 103 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల ధరల పెంపకం, కరోనా సమయంలో ఉద్యోగుల తొలగింపు వంటి అంశాల్లో ఈ సంస్ధ తీవ్ర విమర్శలను ఎదర్కుంటుంది. గత ఏడాది ఈ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×