E-Paper
Advertisement

అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల సబ్ స్క్రైబర్లు.. రూ.5 వేల పెన్షన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే?

అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల సబ్ స్క్రైబర్లు.. రూ.5 వేల పెన్షన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే?
Advertisement

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన(APY) అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీమ్. ఏప్రిల్ 21, 2026 నాటికి ఈ పథకంలో మొత్తం 9 కోట్లకు పైగా చందాదారులు చేరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్లకు పైగా కొత్త చందాదారులు చేరడంతో అత్యంత విజయవంతమైన ఏడాదిగా నిలిచింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని పర్యవేక్షిస్తుంది. భారత ప్రభుత్వం సామాజిక భద్రతా కార్యక్రమంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది.

మే 9, 2015న అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది కేంద్రం. ఏపీవైతో కార్మికులకు పదవీ విరమణ ఆదాయంపై దృష్టి పెట్టింది. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, తపాలా శాఖల్లో ఏపీవై పథకం చందాదారులు గణనీయంగా పెరిగారు.

అటల్ పెన్షన్ యోజన

Advertisement

అటల్ పెన్షన్ యోజన పథకంలో ఆదాయపు పన్ను చెల్లించని 18-40 మధ్య వయస్సు గల పౌరులు.. పదవీ విరమణ సమయానికి పెన్షన్ అందించేందుకు పొదుపు చేసుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం తక్కువ ఆదాయం గల అసంఘటిత కార్మికుల కోసం నిర్మించినది. ఈ పథకం మూడు కీలక ప్రయోజనాల ద్వారా పూర్తి ఆర్థిక రక్షణ లభిస్తుంది.

  • పింఛన్ హామీ: 60 ఏళ్ల వయస్సు నిండిన చందాదారులకు నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పింఛన్ పొందుతారు. అందుకు కోసం చందాదారులు నెలకు రూ.42 చొప్పున(18 ఏళ్లు వారు) చందా చెల్లించాల్సి ఉంటుంది. వయస్సును బట్టి చందా మొత్తం పెరుగుతుంది.
  • లైఫ్ పార్టనర్: చందాదారు మరణించిన తర్వాత, జీవిత భాగస్వామికి జీవితాంతం అదే పింఛన్ అందిస్తారు.
  • నామినీ: చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత, పింఛను నిధి నామినీకి తిరిగి అందిస్తారు.

ఎగ్జిట్ రూల్స్

60 సంవత్సరాల లోపు ఈ స్కీమ్ నుంచి వైదొలిగితే నిర్వహణ ఛార్జీలు మినహాయించి, చందాదారులు తమ చందాలతో పాటు వడ్డీ పొందుతారు. మార్చి 31, 2016కు ముందు తెరిచిన ఖాతాల కోసం ఈ ఆదాయం పొందరు.

60 ఏళ్లలోపు మరణిస్తే

  • చందాదారుడు 60 ఏళ్లు నిండిన తర్వాత మరణిస్తే.. జీవిత భాగస్వామికి పింఛన్ కొనసాగిస్తారు.
  • 60 ఏళ్లు నిండకుండా మరణిస్తే.. చందాదారుడి పొదువు మొత్తాన్ని జీవిత భాగస్వామి లేదా నామినీ అందిస్తారు.

అటల్ పెన్షన్ యోజనకు ఎవరు అర్హులు? అనర్హులు?

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
  • 60 సంవత్సరాలు నిండినప్పటి నుంచి పింఛన్ ప్రారంభం
  • అక్టోబర్ 1, 2022 నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు లేదా గతంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు అనర్హులు
Advertisement

Also Read: ప్రైవేట్ ఉద్యోగులకు రూ.5,000 పెన్షన్.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఆఫ్‌లైన్ – సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ఉన్న వారు స్థానిక బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులలో రిజస్టర్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ విధానం

  • ప్రాథమిక, నామినీ సమాచారాన్ని అందించడం ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆటో డెబిట్ కూడా ప్రారంభించవచ్చు.
  • APY రిజిస్ట్రేషన్ కు ఆధార్ ను ఉపయోగించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చేయవచ్చు. ఇ-NPS పోర్టల్ లో వినియోగదారుడు డిజిటల్ సైన్ పూర్తి చేసిన తర్వాత ఈ పథకం కింద నమోదు అవుతారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అటల్ పెన్షన్ యోజనలో చందాదారుల సంఖ్య రికార్డు స్థాయిలో 9 కోట్ల మార్కును దాటింది.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×