// // Adani Group: అమెరికాలో గౌతమ్ అదానీకి రిలీఫ్.. కేసులు ఉపసంహరణ -->
E-Paper
Advertisement

Adani Group: అమెరికాలో గౌతమ్ అదానీకి రిలీఫ్.. కేసులు ఉపసంహరణ, 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి ప్లాన్

Adani Group: అమెరికాలో గౌతమ్ అదానీకి రిలీఫ్.. కేసులు ఉపసంహరణ, 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి ప్లాన్
Advertisement

Adani Group: భారత్ వ్యాపారవేత్త  గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ వ్యవహారాలకు సంబంధించి కేసులను అమెరికా న్యాయశాఖ వాటిని శాశ్వతంగా ఉపసంహరించుకుంది. దీని వెనుక ఆయన ఆదేశంలో పెట్టుబడి పెడుతుండడమే అందుకు కారణంగా తెలుస్తోంది.

వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్

Advertisement

భారత్ వ్యాపారవేత్త అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది. ఆయనపై ఉన్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, అన్ని క్రిమినల్ ఆరోపణలను ట్రంప్ సర్కార్ శాశ్వతంగా ఉపసంహరించుకుంది. ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు నిర్ధారణకు వచ్చింది.

ఇదే విషయాన్ని న్యూయార్క్ న్యాయస్థానానికి తెలిపింది. ఈ నేపథ్యంలో గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్ లభించింది. అమెరికా మార్కెట్‌ నియంత్రణ సంస్థ-ఎస్‌ఈసీ, అక్కడి న్యాయశాఖకు గత వారం 180 లక్షల డాలర్లు చెల్లించిన విషయం తెల్సిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో ప్రారంభించిన ఉన్నత స్థాయి విచారణల నుంచి ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందనడానికి ఈ చర్య ఉదాహరణగా చెబుతున్నారు.

Advertisement

ఆయనపై కేసులు ఉపసంహరించుకున్న ట్రంప్ సర్కార్

అసలు వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు ఏంటి? భారత్‌లో సౌర విద్యుత్‌ ఒప్పందాలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులకు 2024లో దాదాపు 25 కోట్ల డాలర్ల లంచాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ సహా 8 మంది వ్యక్తులపై అమెరికాలో కేసు నమోదైంది.

లంచాల సొమ్ము కోసం అదానీ గ్రీన్‌ ఎనర్జీ తన ప్రాజెక్టుపై తప్పుడు సమాచారం ఇచ్చింది అమెరికా పెట్టబడుదారుల నుంచి నిధులు సేకరించింది. ఈ నేపథ్యంలో ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం కింద అమెరికాలో కేసులు నమోదైన విషయం తెల్సిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనలో ప్రారంభించిన ఉన్నత స్థాయి విచారణల నుంచి ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందనడానికి ఈ చర్య ఉదాహరణగా చెబుతున్నారు.

ALSO READ: దలాల్ స్ట్రీట్‌లో బేర్ వీరవిహారం.. ఒకానొక దశలో 1000 పాయింట్లు పతనం, రూపాయిదీ అదే పరిస్థితి

మరోవైపు ఇరాన్‌ నుంచి అక్రమంగా ఎల్‌పీజీ దిగుమతి చేసుకున్న కేసు నుంచి అదానీ గ్రూపునకు విముక్తి లభించింది. ఇందుకోసం దాదాపు రూ.2,645 కోట్లు చెల్లించి సెటిల్‌ చేసుకున్నట్టు ఆ గ్రూపు ప్రకటన చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థలకు సహకరించడంతో సాధ్యమైందని వెల్లడించింది. మూడేళ్ల కిందట అంటే 2023 జూన్‌ వరకు అదానీ గ్రూపు అమెరికా ఆంక్షలను అతిక్రమించి ఇరాన్‌ నుంచి ఎల్‌పీజీ దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇరాన్‌ నుంచి గాక మధ్యవర్తి కంపెనీ ద్వారా తప్పుడు పత్రాలు చూపించి దిగుమతి చేసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా అమెరికా ఆర్థిక శాఖ సెటిల్‌మెంట్‌కు అంగీకరించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాలో నమోదైన రెండు కేసుల నుంచి భారత్ బిలియనీర్ అదానీ శాశ్వతంగా విముక్తి లభించినట్లయ్యింది.

ఈ కేసుల వెనుక మరో విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అమెరికాలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు పరిష్కారం కాకపోవడంతో ముందుకు సాగలేకపోతున్నారని అదానీ గ్రూప్ ప్రతినిధులు అమెరికా అధికారులకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కొన్నివారాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×