E-Paper
Advertisement

Ahana Gautam Success Story : అమెరికాలో జాబ్ వదిలేసి.. స్టార్టప్‌తో రూ.100 కోట్లు..!

Ahana Gautam Success Story : అమెరికాలో జాబ్ వదిలేసి.. స్టార్టప్‌తో రూ.100 కోట్లు..!
Advertisement
business
Ahana Gautam

Ahana Gautam Success Story : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారు అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్. నిజంగానే మనం ఏదైనా కష్టపడి పనిచేస్తే విజయం దానంతటదే వస్తుందని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు దాని కోసం పూర్తిగా కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.

మనలో చాలా మంది చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధించాలని కలలుగంటుంటారు. మంచి శాలరీ ఉంటే దేన్నైనా వదులుకోవాలనుకుంటారు కొందరు. అయితే చాలా మంది పెద్ద పెద్ద ప్యాకేజీల్ని వదులుకొని.. చిన్న చిన్న ఆలోచనలతో స్టార్టప్స్ ప్రారంభించిన వారు ఉన్నారు.

Advertisement

Read More : పేటీఎంపై మరిన్ని చర్యలు తీసుకున్న ఆర్బీఐ..!

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అహనా గౌతమ్ కూడా అదే కోవలోకి వస్తుంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఆమె 2010లో ఐఐటీ బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత పైచదువుల కోసం అమెరికా వెళ్లింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో MBA పూర్తి చేసింది.

Advertisement

అనంతరం అమెరికాలో మంచి ఉద్యోగం చేసేవారు. ఈ నేపథ్యంలో స్వతహాగా జీవితంలో ఎదగాలనే తానే
స్వయంగా ఒక స్టార్టప్ ప్రారంభించింది. ఆ స్టార్టప్ విలువ ఇప్పుడు ఏకంగా రూ. 100 కోట్లు దాటడం విశేషం. 30 ఏళ్ల వయసులోపే ఈ ఘనతను ఆమె సాధించింది. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

స్టార్టప్ ప్రారంభం

అహానా అమెరికాలో ఉన్నప్పుడు బరువు అధికంగా పెరిగింది. అప్పుడు ఆమె బరువు తగ్గాలని భావించి ఒక హెల్దీ ఫుడ్ స్టోర్‌కు వెళ్లింది. ఆమె స్టోర్‌లో ఎలాంటి జంక్ ప్రొడక్ట్స్ లేకపోడం చూసి ఆశ్యర్యానికి గురైంది. ఆలస్యం చేయకుండా హెల్ధీ ఫుడ్ ప్రాముఖ్యతను తెలుసుకుంది. భారత్‌లో ఇలా ఎందుకు లేదా అని ఆలోచించింది. ఆ ఆలోచనే స్టార్టప్ పెట్టేందుకు ఇప్పుడు పునాది వేసింది.

Read More : ఇన్ స్టంట్ లోను తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

దీంతో అమెరికాలో జాబ్ వదిలేసి భారత్‌ వచ్చింది. 2019లో ఆమె తల్లి సపోర్ట్‌తో వెంచర్ ఓపెన్ సీక్రేట్ బిజినెస్ ప్రారంభించింది. FMCG సెక్టార్‌లో పనిచేసిన అనుభవం ఉన్న అహానాకు.. శుద్ధి చేసిన పంచదార, పిండి వాటి గురించి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆమె తన ప్రొడక్ట్స్‌లో ఎలాంటి పిండి, పామాయిల్ వంటివి ఉండకూడదని నిర్ణయించుకుంది.

పూర్తిగా జంక్ ఫ్రీ ఫుడ్ తయారీ చేసింది. ఈ స్నాక్స్‌లో విపరీతమైన పోషకాలు ఉండేలా చూసుకుంది. ప్రస్తుతం ఎన్నో స్టోర్లలో ఈ ఓపెన్ సీక్రెట్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ సొంత వెబ్‌సైట్‌లో కూడా ఈ ప్రొడక్ట్స్ సేల్స్ చేస్తున్నారు. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×