E-Paper
Advertisement

2024 Rolls Royce Cullinan Revealed: రోల్స్ రాయిస్ ఊహించని గిఫ్ట్.. ఆరేళ్ల తర్వాత కల్లినన్ లెటెస్ట్ వేరియంట్ లాంచ్..!

2024 Rolls Royce Cullinan Revealed: రోల్స్ రాయిస్ ఊహించని గిఫ్ట్.. ఆరేళ్ల తర్వాత కల్లినన్ లెటెస్ట్ వేరియంట్ లాంచ్..!
Advertisement

2024 Rolls Royce Cullinan Revealed: దేశంలో లగ్జరీ కార్లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి రోడ్డుపై అలా వెళుతూ మన కంట్లో పడితే తల తిప్పుకోలేము. అందులోనూ రోల్స్ రాయిస్ అయితే ఇంకా పిచ్చెక్కిపోద్ది. వాటి లుక్, పొడవు మనలను కట్టిపడేస్తాయి. ఈ క్రమంలో రోల్స్ రాయిస్ Cullinan SUVని ప్రారంభించిన 6 సంవత్సరాల తర్వాత తన లేటెస్ట్ వేరియంట్ మోడల్‌ను ఆవిష్కరించింది.

ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేయడం ద్వారా ఈ అల్ట్రా లగ్జరీ SUVలో కంపెనీ అనేక మార్పులను చేసింది. అప్‌డేట్ తర్వాత లెటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఈ గొప్ప కారుతో వినియోగదారులు గతంలో కంటే ఎక్కువగా ఇష్టపడతారు. రోల్స్ రాయిస్ ఈ కారును కంపెనీ చరిత్రలో తయారు చేసిన అత్యంత ధృడమైన సిరీస్ 2గా వెల్లడించింది. కారు ముందు భాగంలో కొత్త LED DRLలు ఉన్నాయి. దాని గ్రిల్ కూడా కొత్త లుక్‌లో కనిపిస్తుంది.

Advertisement

2024 Rolls-Royce Cullinan  సైడ్ ప్రొఫైల్ కూడా లెటెస్ట్ లుక్‌తో చూడొచ్చు. చాలా చోట్ల గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. SUV చాలా పెద్ద పరిమాణంలో ఉన్న 23 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. మీరు కారును చూడగానే కచ్చితంగా చాలా ఇష్టపడతారు.

Also Read: స్పీడ్ పెంచిన మహీంద్రా.. 456 కిమీ రేంజ్‌తో త్వరలో కొత్త EV

Advertisement

అయితే ఈ కారు లోపలి భాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తే మీ హృదయం సంతోషిస్తుంది. దీని క్యాబిన్ చాలా అందంగా ఉంది.  డ్యాష్‌బోర్డ్ అద్భుతమైన నాణ్యమైన మెటీరియల్‌తో తయారు చేశారు. దీని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మీకు లగ్జరీ నిజమైన ఆనందాన్ని అందిస్తుంది.

Rolls-Royce 2024 Cullinan SUVలో ఎటువంటి సాంకేతిక మార్పులు చేయలేదు. అయితే దీని ఇంజన్ ఇప్పటికే చాలా శక్తివంతమైనది. SUV 6.75-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Also Read: కొత్త రంగుల్లో యమహా FZS V4.. ఈ సారి లుక్ అదిరిపోయింది!

ఇది ఆల్ వీల్ డ్రైవ్ SUV. ఇది 0-100 km/h నుండి చాలా త్వరగా వేగాన్ని అందుకుంటుంది. స్టాండర్డ్ రోల్స్ రాయిస్ కల్లినన్‌తో ఉన్న ఇంజన్ 571 హెచ్‌పి పవర్, 850 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ మోడల్‌తో ఉన్న ఇంజన్ 600 హెచ్‌పి పవర్, 900 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×