E-Paper
Advertisement

Gold Silver Price: 2026లో గోల్డ్ కొంటే బెటరా? సిల్వర్, కాపర్ కొనడం మంచిదా? నిపుణుల సలహా ఇదే!

Gold Silver Price: 2026లో గోల్డ్ కొంటే బెటరా? సిల్వర్, కాపర్ కొనడం మంచిదా? నిపుణుల సలహా ఇదే!
Advertisement

Gold Silver Price: గత ఏడాదిగా బంగారం, వెండి, కాపర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో.. వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాలు తలెత్తినా.. బంగారం వెండి ధరలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే వృద్ధిలో బంగారం కంటే వెండి మెరుగైన స్థితిలో ఉంది. గత ఐదేళ్లుగా వెండి ధరల్లో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయని నిపుణులు అంటున్నారు. ప్రపంచ డిజిటలైజేషన్, AI టెక్నాలజీ, EVలు, సౌర విద్యుత్, డేటా సెంటర్లతో వెండికి డిమాండ్ పెరిగింది. వెండిని అనేక దేశాలు కీలకమైన ఖనిజంగా భావిస్తున్నాయి.

బంగారం, వెండి నిష్పత్తి

రానున్న 3- 6 నెలల్లో బంగారం, వెండి మధ్య నిష్పత్తి కాలక్రమేణా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిష్పత్తి 40 లేదా అంతకంటే తక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు డాలర్ నుంచి బంగారం, వెండి ఆస్తుల వైపు కేటాయింపులను పెంచుతున్నాయి. ఇటీవలి ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు ఈ ఖనిజాలను ప్రోత్సహిస్తున్నాయి.

Advertisement

రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో బంగారం ధరలు 4,800 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరంలేదని నిపుణులు అంటున్నారు. వెండికి మోనిటరీ డిమాండ్, పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుండడంతో మార్కెట్ లో ఇప్పటికే సరఫరాపై ప్రభావం పడింది. డిమాండ్ పెరగడంతో వెండి ధరలు పెరుగుతున్నాయి.

కాపర్ కూడా

బంగారం, వెండితో పాటు కాపర్ విలువ కూడా క్రమంగా పెరుగుతోంది. విద్యుత్ ఉపకరణాలు, AI, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీకి రాగిని వినియోగిస్తున్నారు. వెండి లాగా రాగి చాలా ఏళ్లుగా తక్కువ విలువతో మార్కెట్ అయ్యేది. కాపర్ గనులు తగ్గిపోతుండడంతో.. కాపర్ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాపర్ కు రానున్న రెండేళ్లు ఆశాజనకంగా ఉంటుందని అంటున్నారు.

చమురు సరఫరాలు

Advertisement

అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక కారణాలతో బంగారం వెంటనే ప్రయోజనం పొందుతుందని నిపుణులు అంటున్నారు. పారిశ్రామికీకరణతో వెండి, రాగి ధరల్లో మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు. ‘అయితే చమురు ఇందుకు భిన్నంగా ఉంది. రాజకీయ కారణాలున్నా.. చమురు సరఫరా బాగానే ఉంది. రష్యా, ఇరాన్ నుంచి ఎక్కువగా చమురు అంతర్జాతీయ మార్కెట్ లోకి ప్రవేశించవచ్చు. ఫలితంగా చమురు ధరలపై ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్ లో చమురు సరఫరా పుష్కలంగా ఉంది. సముద్రంలో నిల్వలు ఎక్కువగా ఉండడం, ఒపెక్ యేతర దేశాలు చమురు సరఫరా పెరగడంతో.. ధరలపై మార్పులు చోటుచేసుకోవచ్చు. భారత్ ఇంధన ధరలను ప్రయోజనం పొందే అవకాశం ఉంది’ అని నిపుణులు అంటున్నారు.

Also Read: చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. నేడు ఎంత పెరిగిందంటే!

2026లో

ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం.. 2026లో వెండి, బంగారం, రాగి, అల్యూమినియం ధరలు పెరుగుతాయి. బంగారం రూ.4,470 నుంచి రూ.4,550 వరకు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు పెరగవచ్చు. వెండి 71 నుంచి 78 డాలర్లకు.. బ్రేక్ అవుట్ ధరలు 80 డాలర్లు ఆపై 95–100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×