E-Paper
Advertisement

BMW S 1000 R: BMW కొత్త బైక్ వచ్చేసింది.. ధర అక్షరాలా రూ. 20 లక్షలు!

BMW S 1000 R: BMW కొత్త బైక్ వచ్చేసింది.. ధర అక్షరాలా రూ. 20 లక్షలు!
Advertisement

2025 BMW S 1000 R Launched:

విలాసవంతమైన కార్లు, బైకుల తయారీ సంస్థ మరో అదిరిపోయే టైవీలర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాదిరిగానే లగ్జరీ బైక్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. S 1000 R పేరుతో విడుదలైన ఈ బైక్ ధరను రూ. 19.90 లక్షలుగా ఫిక్స్ చేసింది. ఇది ఎక్స్ షోరూమ్ ధర కాగా, ఆన్ రోడ్ వచ్చే సరికి మరికొంత ధర పెరిగే అవకాశం ఉంటుంది. గత బైకులతో పోల్చితే ఇందులో సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది.

S 1000 R ఇంజిన్ ప్రత్యేకతలు..

S 1000 R బైక్ 999cc, లిక్విడ్-కూల్డ్, నాలుగు-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 11,000rpm దగ్గర 170bhp, 9,250rpm దగ్గర 114Nm టార్క్‌ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొత్త బైక్ కేవలం 3.2 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ వాహన గరిష్ట వేగాన్ని 250kmphకి పరిమితం చేసినట్లు BMW సంస్థ వెల్లడించింది.

S 1000 R ఫీచర్ల గురించి..

Advertisement

S 1000 R బైక్  ఫీచర్ల విషయానికొస్తే, ఈ బైక్‌లో డేటైమ్ రైడింగ్ లైట్లు, M క్విక్ యాక్షన్ థ్రోటిల్, రైడింగ్ మోడ్‌లు, ABS ప్రో, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు కనెక్టివిటీ, నావిగేషన్‌ తో కూడిన 6.5-అంగుళాల TFT డిస్‌ప్లేతో కూడిన హెడ్‌ లైట్ ప్రో లభిస్తుంది. దీనితో పాటు, ఈ బైక్‌ లో BMW  ఇంటెలిజెంట్ ఎమర్జెన్సీ కాల్ ఫీచర్ E-కాల్, సీటు కింద USB టైప్-C ఛార్జర్ ఉన్నాయి.

S 1000 R బైక్ డిజైన్..

S 1000 R బైక్ డిజైన్ మరింత స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ లో ఫ్యూయెల్ ట్యాంక్ ఆకారం ఉన్న విధానం,  షార్ప్ ట్యాంక్ పొడిగింపులు, బయట కనిపించే సబ్‌ ఫ్రేమ్ మరింత ఆకట్టుకుంటుంది.

ఎవరికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుందంటే?

Advertisement

S 1000 R బైక్ రైడర్లు డైనమిక్, కంఫర్ట్, M స్పోర్ట్ లాంటి ఆప్షనల్ ప్యాకేజీల నుంచి ఎంచుకోవచ్చు, వీటిలో క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్, షిఫ్ట్ అసిస్టెంట్, M లైట్‌వెయిట్ బ్యాటరీ, ఫోర్జ్డ్ వీల్స్ లాంటి అధునాతన భాగాలు ఉంటాయి. S 1000 R మూడు రంగు ఎంపికలలో వస్తుంది. వాటిలో ఒకటి బ్లాక్‌ స్టార్మ్ మెటాలిక్, రెండు స్టైల్ స్పోర్ట్‌ తో బ్లూఫైర్/ఎల్లో, మూడోది M ప్యాకేజీతో లైట్‌వైట్ యూని/ఎం మోటార్‌ స్పోర్ట్ బైక్. అన్ని వర్గాల రైడర్లకు ఈ బైక్ మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Read Also: ప్రొడక్ట్స్, బ్రాండ్ల పేరు మీద ఉండే TM, R సింబల్స్‌ కు అర్థం ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×