E-Paper
Advertisement

సూర్యుడు ఉదయాన్నే పెద్దగా ఎందుకు కనిపిస్తాడో ఎప్పుడైనా ఆలోచించారా ?

సూర్యుడు ఉదయాన్నే పెద్దగా ఎందుకు కనిపిస్తాడో ఎప్పుడైనా ఆలోచించారా ?
Advertisement

Sun Illusion:మీరెప్పుడైనా ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకసారి తూర్పు వైపు చూస్తే మీకు ఒక పెద్ద బాల్ సైజ్‌లో ఎర్రగా సూర్యుడు కనిపిస్తాడు. అదే సూర్యుడిని మీరు మధ్యాహ్నం అబ్జర్వ్ చేస్తే చిన్నగా అయిపోతాడు. పొద్దున్నే కనిపించిన సూరీడు, మధ్యాహ్నానికి చిన్న సైజ్‌కి ఎలా మారిపోయాడని ఎప్పుడైనా ఆలోచించారా?

ఇంతకీ సూరీడు షేప్ మార్చుకుంటూ మనతో ఆటలాడుతున్నాడా? లేక మనమే అలా కనిపిస్తున్నాడని భ్రమలో ఉన్నామా? ఇంతకీ ఈ సూరిమామ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటి? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? తెలుసుకుందాం రండి.

మన మైండ్ ప్లే చేసే చిన్న సైకలాజికల్ ట్రిక్

Advertisement

నిజంగా చెప్పాలంటే సూరీడు పొద్దున ఎలా ఉంటాడో, మధ్యాహ్నం కూడా అలాగే ఉంటాడు. కానీ మన మైండ్ ప్లే చేసే చిన్న సైకలాజికల్ ట్రిక్ వల్ల మనకి అలా అనిపిస్తుందట. ఇక వాళ్ల పరిభాషలో చెప్పాలంటే దీనిని “హొరైజన్ ఇల్యూజన్” లేదా “మూన్ ఇల్యూజన్” అని అంటారట.

దీన్ని కాస్త విడమరిచి చెప్పాలంటే, పొద్దున్నే సూర్యుడు ఆకాశం అంచున మెల్లిగా బయటికి వస్తున్నప్పుడు అతనికి మనకు అడ్డంగా ఎత్తుగా ఉండే కొండలు, పెద్ద పెద్ద చెట్లు, అడ్డదిడ్డంగా కరెంట్ స్తంభాలు వంటివి కనిపిస్తుంటాయి.

Advertisement

వాటి వెనకాల నుండి వస్తున్న సూర్యుడు వాటి కన్నా పెద్దగా కనిపించడంతో ఆ సమయంలో మన మెదడు ఏమనుకుంటుంది? ఇంత పెద్దగా ఉన్న కొండలు, గుట్టలు, చెట్లు, బిల్డింగులు చాలా చిన్నవని, సూరీడు చాలా పెద్దగా ఉంటాడని మన మైండ్ మనల్ని మెంటల్‌గా ఫిక్స్ చేస్తుంది.

అదే పెద్దగా కనిపించిన సూరిమామ మధ్యాహ్నం అయ్యే సరికి సరిగ్గా మన నెత్తి మీదకి వచ్చేస్తాడు. అప్పుడు అతనితో కంపేర్ చేయడానికి ఎలాంటి కొండలు, గుట్టలు, చెట్లు, బిల్డింగులు ఉండవు. కాబట్టి సూరీడు చాలా చిన్నగా కనిపిస్తాడు. అంటే పోల్చడానికి ఏమీ లేకపోవడంతో మన మైండ్ సూరీడుని చాలా చిన్నగా అయిపోయాడని అనుకుంటుంది.

ఇక చాలామంది వాతావరణంలోని గాలి లేదా పొగమంచు వల్ల సూర్యుడు భూతద్దంలో చూసినట్లు పెద్దగా కనిపిస్తాడని అనుకుంటారు. కానీ అది నిజం కానే కాదు. కేవలం వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సూర్యుడు కొన్నిసార్లు గుండ్రంగా కాకుండా కాస్త అండాకారంలో కనిపించవచ్చేమో గానీ, సూర్యుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. కేవలం మన మెదడు మాత్రమే మన ఆలోచన తగ్గట్టుగా రీడ్ చేసుకుంటుంది.

అదే మరి మన మైండ్ చేసే మ్యాజిక్

ఏంటీ… ఇంకా నమ్మట్లేదా?

అయితే ఓ పని చేయండి. సూర్యుడు మిమ్మల్ని తన షేప్ మార్చుకుని నిజంగానే బురిడీ కొట్టిస్తున్నాడని మీరు అనుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒకసారి ఉదయం మీకు కనిపించే సూరీడుని ఫోటో తీసి పెట్టుకోండి. ఇక మళ్లీ మధ్యాహ్నం మీకు నడినెత్తిన కనిపించే సూరీడుని మరోసారి ఫోటో తీయండి.

ఇప్పుడు ఈ రెండు ఫోటోలను ఒకదానితో ఒకటి కంపేర్ చేసి చూడండి.

ఏంటి… షాక్ అయ్యారా?

రెండు ఫోటోలలో ఉన్న సూరిమామ ఒకే సైజ్‌లో కనిపిస్తున్నాడా?

అదే మరి మన మైండ్ చేసే మ్యాజిక్.

సో, ఇకనైనా మన కళ్లతో చూసేది ప్రతిదీ నిజం కాదని, కొన్ని సార్లు మన మైండ్ మనతో ఆటలాడుతుందని అర్థమైందని అనుకుంటా !

also read :QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×