E-Paper
Advertisement

వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?

వరంగల్ కాంగ్రెస్‌లో ‘సునామీ’.. కడియం టార్గెట్‌గా కొండా సురేఖ ఫిర్యాదు, రేవంత్ ఏం చేయబోతున్నారు?
Advertisement

Warangal Congress: వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న ‘ప్రోటోకాల్ వార్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేవాదాయ శాఖ పరిధిలోని ఒక సమావేశం కాస్తా.. ఇద్దరు అగ్ర నేతల మధ్య ఆధిపత్య పోరుకు వేదికైంది. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారి చివరకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ గడప తొక్కినంత వరకు వెళ్లింది.

వివాదానికి కారణమైన సమీక్షా సమావేశం

Advertisement

ఇటీవల దేవాదాయ శాఖ (ఎండోమెంట్) ప్రధాన కార్యాలయంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశమే ఈ రచ్చకు కారణమైంది. స్థానిక ఎమ్మెల్యేగా, ఆలయ కమిటీ బాధ్యుడిగా కడియం ఈ సమీక్ష నిర్వహించారు. అయితే, తన శాఖలో తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కడియం ఎలా జోక్యం చేసుకుంటారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోపంతోనే ఆమె ప్రజాభవన్‌లో జరిగిన ఓ కీలక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు కూడా హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. తన శాఖపై కడియం పెత్తనం ఏంటని ఆమె హైకమాండ్‌కు గట్టిగానే ఫిర్యాదు చేశారు.

Also Read: అంతరిక్షంలోకి మన వరంగల్ కళ.. సూది రంధ్రంలో సైన్స్ దిగ్గజాలు, అమెరికాను సైతం అధిగమించి..

Advertisement

ఆధిపత్య పోరు.. అధిష్టానం డైలమా

ఈ వివాదం కేవలం ప్రోటోకాల్‌కు సంబంధించింది మాత్రమే కాదు, వరంగల్ జిల్లాలో భవిష్యత్ రాజకీయ ఆధిపత్యం కోసమేనని స్పష్టమవుతోంది. కడియంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సురేఖ పట్టుబడుతుండగా.. ఆయనలాంటి సీనియర్ నేతపై చర్యలు తీసుకునే సాహసం అధిష్టానం చేస్తుందా? అన్నది అనుమానమే. ఈ అంతర్గత పోరు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారడమే కాకుండా, ప్రతిపక్షాలకు మంచి ఆయుధంగా దొరికింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ ‘వరంగల్ వార్’కు ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.

తప్పుగా అర్థం చేసుకున్నారు.. కడియం కౌంటర్

మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదుపై కడియం శ్రీహరి అంతే ఘాటుగా స్పందించారు. మంత్రి తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా అధికారులను కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చే హక్కు తనకు ఉందన్నారు. తాము అసలు సమీక్షే నిర్వహించలేదని, కేవలం ఆలయాల అభివృద్ధి కోసమే దేవాదాయ కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని వారే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారంటూ ఆయన మంత్రి సురేఖపై ఎదురుదాడికి దిగారు.

Also Read: ఇక అంతా ఈవీల రాజ్యమేనా? జూన్ సేల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×