E-Paper
Advertisement

Suicide Harassment: నాతో ఎఫైర్ కంటిన్యూ చేయాల్సిందే.. వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య!

Suicide Harassment: నాతో ఎఫైర్ కంటిన్యూ చేయాల్సిందే.. వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య!
Advertisement

Suicide Harassment: అవును.. మీరు వింటున్నది నిజం. ఆడవాళ్లపై వేధింపులు చూసుంటారు కానీ.. ఇక్కడ ఓ మగాడిని మహిళ వేధించింది. చెప్పింది చేయకపోతే పరువు తీస్తానంది. దీంతో ఆ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం కోకట్ గ్రామానికి చెందిన గాండ్ల శివకుమార్ వయస్సు 31 ఏళ్లు. హ్యాపీగా సాగిపోతున్న అతని లైఫ్‌లోకి అదే గ్రామానికి చెందిన పబ్బన్ గారి రాణెమ్మ అనే వివాహిత ఎంటర్ అయింది. మొదట్లో ఇద్దరి మధ్య పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎలాగైనా ఈ బంధం నుంచి బయటపడాలనుకున్నాడు. కానీ, అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

ఊరి పెద్దలు పంచాయితీ..

నువ్వు నన్ను వదిలేయడం ఏంటి..? నాతో ఎఫైర్‌ కంటిన్యూ చేయాల్సిందేనంటూ రాణెమ్మ, శివకుమార్‌ను టార్చర్‌ చేయడం స్టార్ట్ చేసింది. రోజురోజుకూ వేధింపులు ఎక్కువ కావడంతో.. వ్యవహారం కాస్తా ఊరి పెద్దల వరకు వెళ్లింది. పెద్ద మనుషులు పంచాయితీ పెట్టారు. ఇద్దరినీ పిలిచి గట్టిగానే చెప్పారు. ఎవరి దారి వారు చూసుకోండి.. గొడవలు వద్దని వార్నింగ్ ఇచ్చారు. ఊరి పెద్దలు పంచాయితీ పెట్టినా సరే.. రాణెమ్మ తీరు మాత్రం అస్సలు మారలేదు. లొంగిపోవడం ఆమె డిక్షనరీలోనే లేదన్నట్టు ప్రవర్తించింది.

Advertisement

Also read: Kaleshwaram: కేటీఆర్ సవాల్‌కు సర్కార్ కౌంటర్.. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ హీట్ పాలిటిక్స్!

ఫోన్ కాల్స్ టార్చర్..

పంచాయితీ అయిపోయిన తర్వాత రాణెమ్మ మరింత రెచ్చిపోయింది. శివకుమార్‌కు ఫోన్ చేసి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. నాతో వివాహేతర సంబంధం కంటిన్యూ చేయకపోతే.. నీ పరువు బజారుకు ఈడుస్తా అంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. ఒకవైపు సమాజానికి భయం.. ఇంకోవైపు ఆమె చేస్తున్న ఫోన్ కాల్స్ టార్చర్ తట్టుకోలేకపోయాడు శివకుమార్. మనస్తాపానికి గురై, తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. రాణెమ్మ పెట్టిన వేధింపులు, బెదిరింపుల వల్లే తన భర్త చనిపోయాడంటూ శివకుమార్ భార్య చంద్రకళ పోలీసులకు కంప్లైంట్ చేసింది.

Advertisement

Also read: Prashant Kishor: మళ్లీ ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్.. బంకీపూర్‌లో వ్యూహకర్త నయా స్కెచ్ ఇదే!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×