E-Paper
Advertisement

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..
Advertisement

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామాలు చేసే నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. కాగా రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇప్పటికే ముగ్గురు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. మోపిదేవి, బీద టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్‌.కృష్ణయ్య బీజేపీలో చేరతారని టాక్‌ నడుస్తోంది.

Advertisement

మరోవైపు వైసీపీలో నంబర్‌ టూగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబుపేల్చారు.  విజయసాయిరెడ్డి వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా రెండో సారి కొనసాగుతున్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభా పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు… ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి లోక్‌ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Also Read: గనుల ఘనుడు దొరికాడు.. తెర వెనుక మాటేంటి? కూటమి సర్కార్‌కు షర్మిల సూటి ప్రశ్న?

Advertisement

గతంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అప్పట్లో నందమూరి హీరో తారక్‌రత్న చనిపోయినప్పుడు ఆయన భార్య తరపు బంధువైన విజయసాయి అక్కడకు వెళ్లి టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలిగారు. దానిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. వైసీపీలో విజయసాయిరెడ్డికి ఒక దశలో ప్రాధాన్యత బాగా తగ్గిపోవడం.. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత పెరగడం ఇందుకు నిదర్శనమన్న వాదన కూడా కనిపించింది.

అయితే విజయసాయిరెడ్డి వైసీపీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తమ పార్టీలో చేరతానని తమను వేడుకున్నట్టు బాంబుపేల్చారు. మూడు నెలలుగా ఆయన స్వయంగా తననే బతిమలాడుతున్నట్లు వెల్లడించారు. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటివారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు. టీడీపీలో చేరేందుకు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని అచ్చెన్నాయుడు తెలిపారు.

అయితే విజయసాయిరెడ్డి దానిపై తీవ్రంగా స్పందించారు. అచ్చంనాయుడూ.. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని ట్వీట్‌లో విమర్శించారు. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు. విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా? అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మొత్తానికి విజయసాయిపై అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×