E-Paper
Advertisement

యూకే పీఎం కుర్చీ ఖాళీ.. 10 ఏళ్లలో 7వ ప్రధానమంత్రి.. బ్రిటన్ పాలిటిక్స్‌లో అసలేం జరుగుతోంది?

యూకే పీఎం కుర్చీ ఖాళీ.. 10 ఏళ్లలో 7వ ప్రధానమంత్రి.. బ్రిటన్ పాలిటిక్స్‌లో అసలేం జరుగుతోంది?
Advertisement

Starmer Resignation: యునైటెడ్ కింగ్‌డమ్‌కు కొత్త ప్రధాని రాబోతున్నాడు. ప్రస్తుత ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2024 ఎన్నికలలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ, కేవలం రెండేళ్ల లోపే ఆయన తప్పుకున్నారు. నిజానికి తప్పుకున్నారు అనేకంటే తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాలి.

2024 ఎన్నికల్లో..

కీర్ స్టార్మర్ నాయకత్వంపై గత కొన్ని నెలలుగా లేబర్ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇటీవల జరిగిన మే నెల స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఉపఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు పుంజుకోవడంతో పరిస్థితులు మారిపోయాయి. నేతల్లో ఆయనపై నమ్మకం సడలిపోయింది. పార్టీని తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించే సత్తా ఆయనకు లేదని సొంత పార్టీ ఎంపీలే భావించడం ఆయనకు శాపంగా మారింది. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం దిశగా నడిపించారు స్టార్మర్. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు ముగింపు పలికి ప్రధానమంత్రి అయ్యారు ఆయన. మొదట్లో భారీ ప్రజా మద్దతు లభించింది స్టార్మర్‌కు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలు, పార్టీ అంతర్గత విభేదాల విషయంలో సవాళ్ల మొదలయ్యాయి.

Advertisement

Also read: Sai Krishna: హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు జగన్ టీమ్ సంచలన ఫిర్యాదు..!

తీవ్ర వ్యతిరేకత..

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనడంలో స్టార్మర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వచ్చాయి. వింటర్ ఫ్యూయల్ పేమెంట్స్ నిలిపివేయడం, సంక్షేమ పథకాల్లో కోతలు వంటి నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. ఒపీనియన్ పోల్స్‌లో ఆయన రేటింగ్స్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇటీవల రక్షణ వ్యయాల ప్రణాళికలపై విభేదాలు రావడంతో రక్షణ శాఖ మంత్రి జాన్ హీలీతో పాటు మరికొందరు మంత్రులు, సహాయ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇది స్టార్మర్‌కు మరింత మైనస్‌గా మారింది. స్టార్మర్‌పై వ్యతిరేకత పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన స్నేహితుడు పీటర్ మాండెల్సన్‌ను అమెరికాలో యూకే రాయబారిగా నియమించాలనుకున్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది. తాను పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని వాదిస్తూ వచ్చిన స్టార్మర్‌ చివరికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు.

స్టార్మర్ రాజీనామా డిమాండ్..

Advertisement

స్టార్మర్ రాజీనామాతో కొత్త ప్రధాని ఎవరనే క్వశ్చన్ మొదలైంది. అయితే లేబర్ పార్టీలోనే స్టార్మర్‌కు బలమైన ప్రత్యర్థిగా ఉన్న మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్‌హామ్ రీసెంట్‌గా జరిగిన మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించారు. బర్న్‌హామ్ రాకతో స్టార్మర్ రాజీనామా డిమాండ్ పెరిగింది. సో.. బర్న్‌హామ్‌ని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీలోని మెజారిటీ ఎంపీల మద్దతు ఆయనకు ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ ముగిసేవరకు అంటే.. సెప్టెంబర్ వరకు కీర్ స్టార్మర్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. ఈ రాజీనామాతో బ్రిటన్ గత పదేళ్లలో ఏడో ప్రధానిని చూడబోతోంది.

Storey By: Anup Big Tv

Also read: రబ్బరు తోట బావిలో పడ్డ ఏనుగు పిల్ల.. కాపాడాలంటూ గుంపుగా ఏనుగుల భీకర గర్జనలు!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×