E-Paper
Advertisement

Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?

Tungabhadra Levels: బిగ్ అలర్ట్.. రాయలసీమను ముంచేయబోతున్న భారీ సంక్షోభం..?
Advertisement

Tungabhadra Levels: సాధారణంగా తుంగభద్ర జలాశయం జులైలో నిండుకుండలా ఉండాలి. కానీ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవు. నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. తుంగభద్ర జలాశయం నీటి నిల్వసామర్థ్యం 105 టీఎంసీలు. కానీ ప్రస్తుతం జలాశయంలో 24 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

దిక్కుతోచని స్థితిలో రైతాంగం..

తుంగభద్ర జలాశయంపైనే కర్నూలు జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. కానీ, ఇప్పుడు ఆ జీవనది వెలవెలబోతోంది. అరకొర వర్షాలు పడ్డా ఆ వరద కేవలం డ్యాం లోపలి అవసరాలకే సరిపోతోంది. కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల నిలిచిపోవడంతో ఆయకట్టు రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టాలనుకున్న రైతులకు.. తుంగభద్ర ప్రస్తుత పరిస్థితి తీవ్ర నిరాశను మిగులుస్తోంది.

Advertisement

Also read: RTA Officials: వామ్మో వీళ్లు మహా ముదుర్లు.. నెంబర్ ప్లేట్ స్థానంలో ‘RTA’ బోర్డు పెట్టి అలా చేస్తారా..?

తాగునీటి సమస్య..

సాగునీటి సంగతి పక్కన పెడితే.. రాయలసీమలోని ప్రధాన నగరాలు, గ్రామాలకు డ్రింకింగ్ వాటర్ సమస్య ఏర్పడే ఛాన్స్ లేకపోలేదు. డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీటిని కేవలం తాగునీటి అవసరాలకే రిజర్వ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్ అధికారులు అప్రమత్తమై ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడవచ్చు. ప్రకృతి కరుణించి ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే తుంగభద్రకు పూర్వవైభవం వస్తుంది.. లేకపోతే నీటి కష్టాలు తప్పేలా లేవు.

Advertisement

Storey By: Appa Rao Big Tv

Also read: రూ.1,500 లోపే బెస్ట్ స్మార్ట్‌వాచ్.. బోట్ ఎక్స్‌టెండ్ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×