E-Paper
Advertisement

Aurangzeb : ఔరంగజేబు.. అనే పేరు వెనక కథ తెలుసా?

Aurangzeb : ఔరంగజేబు.. అనే పేరు వెనక కథ తెలుసా?
Advertisement

Aurangzeb : మనం చిన్నప్పటి నుంచి వినే ఔరంగజేబు అనేది… మొఘల్ చక్రవర్తి అసలు పేరు కాదు. ఆయన అసలు పేరు ముజఫర్ మొహియొద్దీన్ అలంఘీర్! మరి ఆయన అసలు పేరేంటి? అసలు పేరుండగా.. మరి ఈ ఔరంగజేబు అనే పేరు ఎలా వచ్చింది? అనేది తెలుసుకోవాలంటే.. మనం చరిత్రలోకి వెళ్లాలి.

దక్కన్ దండయాత్రకు తరలి వచ్చిన మొఘలు చక్రవర్తి.. అప్పట్లో నేటి ఔరంగాబాద్‌లో ఉండేవాడు. చక్రవర్తి నివసించే మహల్.. అక్కడి షాహీ మసీదు పక్కనే ఉండేది. రోజూ భవనం మీద కాసేపు చల్లగాలికి తిరిగే చక్రవర్తికి.. కొంత దూరంలో పొగలు పైకి లేస్తూ కనబడేవి. అదేమిటని వాకబు చేయగా.. కొందరు అక్కడ వంట చేసుకుంటున్నారని భటులు తెలిపారు. అయితే.. ఆ వరుసలోనే కొన్ని ఇళ్లు ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి పొగరాదేంటి? వాళ్లు వంట చేసుకోరా? అని విచారించాడు.

Advertisement

‘ఆ పొగరాని చోట.. ఓ చిన్న గుడి ఉంది. అక్కడ చాలామంది బ్రాహ్మణులు నివసిస్తుంటారు. వారు రోజూ పట్టణంలో భిక్షాటన చేసి జీవిస్తుంటారు. కనుక వారు వంట చేసుకోరు’ అని భటులు వివరం చెప్పారు. ఈ సంగతి తెలిసి చక్రవర్తి మనసు చివుక్కుమంది. నాకు కూతవేటు దూరంలోనే ఇంత దారిద్ర్యం ఉందా? అనుకుని వారందరికీ ఓ భోజనశాల ఏర్పాటు చేయించి.. వారే ఆహారం తయారు చేసుకునే ఏర్పాటు చేయించాడు.

దీంతో అక్కడి బ్రాహ్మణ వర్గమంతా సంతోషించింది. పొగ రాకపోవటాన్ని బట్టి తమ బాధను కనుక్కున్న చక్రవర్తి ఔదార్యానికి వారికి ఆయన పట్ల ఎంతో కృతజ్ఞతా భావం కలిగింది. భిక్షాటన, పౌరోహిత్యంతో తాము ఆర్జించే సంపదనంతా పోగుచేసి ఆయనకో బహుమతిని ఇవ్వాలని నిర్ణయించారు.

Advertisement

ఆయన కూర్చునేందుకు చక్రవర్తి హోదాకు తగిన ఓ సింహాసనాన్ని చేయించాలని నిర్ణయించారు. చివరకు ఒక గద్దె (సింహాసనం) తయారు చేయించారు. దాని నిండా రంగు రంగుల మెరిసే రాళ్ళు పొదిగారు. తిరంగ్ అంటే 3, నవ్‌రంగ్ అంటే 9.. ఇలా.. లెక్కుకు మించిన రాళ్లు పొదిగితే దానిని ‘ఔరంగ్’ అంటారు. జేబ్ అంటే.. పొందినవాడు అని అర్థం. దీంతో ఆయన పేరు ‘ఔరంగజేబ్’ అయింది.

తన తర్వాత ఈ గద్దె మీద కూర్చుని ఎవరు రాజ్యమేలినా వారు ఔరంగజేబ్ అని పిలవబడతారని చక్రవర్తి (అలంఘీర్) ప్రకటించాడు. ఇక్కడ ఓ సారూప్యత కూడా ఉంది. ఏ ప్రాంతపు బ్రాహ్మణులు ఆ బహుమతిని అందించారో ఆ ప్రాంతం పేరు ఔరంగపూర్. అందువల్ల ఆ బహుమతికి ఆ బహుమతి స్వీకరించిన చక్రవర్తికీ ఆ పేరు మరింతగా సరిపోయింది.

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×