E-Paper
Advertisement

కేరళలో ప్రచారం.. ఢిల్లీలో సిఫార్సు: టీ-కాంగ్రెస్ నేతల ‘డబుల్ గేమ్’ ఇదేనా?

కేరళలో ప్రచారం.. ఢిల్లీలో సిఫార్సు: టీ-కాంగ్రెస్ నేతల ‘డబుల్ గేమ్’ ఇదేనా?
Advertisement

Kerala Campaig: తెలంగాణ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళ రాష్ట్రానికి క్యూ కడుతుండటం చర్చలకు దారితీస్తోంది.. ఇంతకీ ఎందుకు కేరళ వెళ్లడానికి ఎందుకంత ఉత్సహాం చూపిస్తున్నారు?.. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనికి ఎందుకు అంతలా పోటీ పడుతున్నారు?.. ఇంకా వివిధ రాష్ట్రాల్లో సైతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేరళపై మాత్రమే ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? కేరళ ఎన్నికల బరిలో ఉన్న ఆ ఏఐసీసీ అగ్ర నేతను ప్రసన్నం చేసుకోవడానికే క్యూ కడుతున్నారా? ఇంతకీ ఎవరా అగ్ర నేత?

కేరళపై కన్నేసిన తెలంగాణ కాంగ్రెస్

ఒకవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా నడుస్తున్నాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల చూపు మాత్రం అసెంబ్లీ సెషన్స్ కంటే కేరళ వైపే ఎక్కువ ఫోకస్ అవుతోందన్న చర్చ జోరుగా జరుగుతోంది. కేరళ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అయితే ఏముంది సాధారణంగా రాష్ట్రాల్లో ఎన్నికలో వస్తూనే ఉంటాయి.. జాతీయ పార్టీ కాబట్టి నేతలను ఎన్నికల ప్రచారం లో పాల్గొనాలని ఏఐసీసీ పెద్దలు ఆదేశిస్తుంటారు. అలాగే నేతలు వారి ఫ్రీ టైం చూసుకోనో షెడ్యూల్ వేసుకొని ప్రచారానికి వెళ్ళి వస్తారు. ఇదంతా రొటీన్ ప్రాసెస్సేగా అంటారా?.. కానీ ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇందుకు భిన్నాంగా కనిపిస్తోంది టీ కాంగ్రెస్ నేతల తీరు..

రేవంత్‌తో పాటు కీలక నేతలు ఎంట్రీ

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ నుండి కేరళ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక మంత్రులు, ఎంపీలు, నేతలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నేందుకు సిద్దమౌతున్నారు. మంత్రులు పొంగులేటి, సీతక్క, శ్రీధర్ బాబు, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారం కోసం రెడీ అవుతున్నారు. వారే కాదు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, సీడబ్ల్యూసీ మెంబెర్ వంశీచంద్‌రెడ్డి లు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అలాగే సీఎం సన్నిహితుడు, ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి సైతం కేరళ ఎన్నికల‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన్నట్లు తెలుస్తోంది.

ఎందుకు కేరళపైనే ఫోకస్?

ఇంకా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌లు కేరళ ఎన్నికల ప్రచారం కోసం లాంగ్ ట్రిప్ వేసిన్నట్లు తెలుస్తోంది. వీరే కాదు మరికొంత మంది మంత్రులు, సీనియర్ నాయకులు వెళ్ళడానికి సిద్దమౌతున్నట్లు సమాచారం. అయితే ఎందుకు ఇంత మంది క్యూ కడుతున్నారు.. మిగతా రాష్ట్రాలో కూడా ఎన్నికలు ఉన్నాయి కదా… ఆ రాష్ట్రాల పై ఎందుకు ఫోకస్ చేయడం లేదు అంటే దానికి ప్రత్యేకమైన కారణం కనిపిస్తోంది.

టీ కాంగ్రెస్ నేతల అసలు టార్గెట్ అదేనా?

Advertisement

కేసీ వేణుగోపాల్ .. ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ ఏఐసిసి, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి అత్యంత సన్నిహితుడు. అలాంటి కేసీ వేణుగోపాల్ కేరళ ఎన్నికల బరిలో ఉండడం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేరళకి క్యూ కట్టడానికి కారణమంట. ఏఐసీసీలో కేసీ వేణుగోపాల్ పాత్ర ఎంత కీలకమైందో అందరికి తెలిసిందే. కేసీ వేణుగోపాల్‌తో మంచిగా ఉంటే, ఆయన్ని ఇంప్రెస్స్ చేసి గుడ్ లుక్స్‌లో పడితే ఈ రోజు కాకపోయినా రేపైనా పదవులు వస్తాయని… ఆయన చెప్పిన వ్యక్తులకు అధిష్టాన పెద్దలు ప్రిఫరెన్స్ ఇస్తారని, పార్టీ లో మంచి ప్రాధాన్యత ఉంటుందన్నది కాంగ్రెస్‌లో బహిరంగ రహస్యమే.

కేరళ ఫలితాలపై కేసీ భవిష్యత్

కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వేణుగోపాల్ తన మనిషిని సీఎంగా నియమించే చాన్స్‌ ఉంటుంది..అలాగే కేరళలో అధికారంలోకి వస్తే నేషనల్ లెవల్‌లోనే కేసీ వేణుగోపాల్ మరింత కీ రోల్ ప్లే చేస్తారన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. కేరళలో కాంగ్రెస్ గెలిస్తే కేసీ పట్టు మరింత పెరుగుతుంది, అధిష్టానం దగ్గర కూడా వెయిటేజ్ పెరిగే అవకాశం ఉండటంతో…కేసీ వేణుగోపాల్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో టీ కాంగ్రెస్ నేతలు ఉన్నారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ.

ఫలితాలపై ఆసక్తి

దాంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కేరళ కి క్యూ కట్టడానికి సిద్దమైన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30 వ తేదీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత… దాదాపు తెలంగాణ అగ్ర నేతలంతా కేరళ లోనే కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ నేతల ప్రచారం కేరళ లో ఏ మేరకు పని చేస్తుందో.

Also Read: మే నెలలో మోడీ టీమ్ ప్రక్షాళన.. 2029 కోసం ఇప్పటి నుంచే భారీ స్కెచ్!

Story by: Apparao, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×