E-Paper
Advertisement

Mohan Naik: ఏసీబీ చరిత్రలోనే మోస్ట్ కాస్ట్‌లీ తిమింగలం..కాంట్రాక్టర్ల రక్తం తాగడం ఆయన నైజం..?

Mohan Naik: ఏసీబీ చరిత్రలోనే మోస్ట్ కాస్ట్‌లీ తిమింగలం..కాంట్రాక్టర్ల రక్తం తాగడం ఆయన నైజం..?
Advertisement

Mohan Naik: మిలమిల మెరుస్తున్న బంగారు బిస్కెట్లు, కట్టలుకట్టలుగా కరెన్సీ నోట్లు, విదేశీ మద్యం సీసాలు, గుట్టలుగుట్టలుగా ఆస్తుల దస్త్రాలు ఓ ప్రభుత్వ అధికారి ఇళ్లపై తెలంగాణ ACB జరిపిన మెరుపు దాడుల్లో తేలిన నగ్న సత్యాలివి. ఏసీబీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన తిమింగలంగా భావిస్తున్న రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మోహన్‌నాయక్‌ అవినీతి విశ్వరూపం ఇది. ఈయనగారి ఆస్తుల లెక్క చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.

16 ప్రాంతాల్లో..

30 ఏళ్ల కేరీర్‌లో మోహన్ నాయక్ వెనకేసుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో మరెన్నో రెట్లు ఉంటుంది. అందుకే అతను మాములు ప్రభుత్వ ఉద్యోగి కాదు. బల్ల కింద చేయి చాసి కాంట్రాక్టర్లను పీక్కుతిన్న ఓ రాబందు అని చెప్పాలి. ఏసీబీ బృందాలు ఏకకాలంలో 16 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో మోహన్‌నాయక్‌ అవినీతి విశ్వరూపం బయట ప్రపంచానికి తెలిసింది. మొత్తంగా 17 కోట్ల 94 లక్షల ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించిన ఏసీబీ మోహన్‌నాయక్‌ను అరెస్ట్‌ చేసింది. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ మరెన్నో రెట్లు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. యావరేజ్‌ గా మోహన్‌ నాయక్‌ ఆస్తుల విలువ 150 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. ఈ 5 యాప్స్ ఉంటే చాలు!

బడా కాంట్రాక్టర్లతో లింకులు..

నిజామాబాద్ జిల్లా కులాస్‌పూర్‌ తండాకు చెందిన మోహన్‌నాయక్‌ 29 ఏళ్ల క్రితం సర్కారు కొలువులో చేరారు. నల్గొండ, నిజామాబాద్ ఎస్‌ఈగా, తెలంగాణ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తూ గతేడాది సెప్టెంబర్‌లో అత్యున్నత ఈఎన్సీ స్థానానికి చేరారు. ఆర్అండ్‌బీ శాఖలో టెండర్ల కేటాయింపు మొదలుకొని బిల్లుల మంజూరు వరకు కమీషన్లు లేనిదే ఈయన ఫైలు ముందుకు కదలనివ్వరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమార్జన వెనుక ఉన్న మరికొందరు ఉన్నతాధికారులు, బడా బడా కాంట్రాక్టర్ల లింకులపై దర్యాప్తు ముమ్మరమైంది.

తెరవెనుక చక్రం..

Advertisement

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 వేల 445 కోట్లతో 1,806 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు, వంతెనల పనులు ప్రారంభమయ్యాయి. ఈ భారీ ప్రాజెక్టుల బిల్లుల మంజూరులోనే మోహన్‌నాయక్‌ తన చేతివాటం ప్రదర్శించినట్లు ప్రచారం జరుగుతోంది. బడా కాంట్రాక్టర్లతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ, చిన్న కాంట్రాక్టర్లను బిల్లుల కోసం ఇబ్బంది పెట్టడంలో మోహన్‌నాయక్‌ రూటే వేరు. చివరికి తన పరిధిలోకి రాని హ్యామ్‌ రోడ్ల టెండర్లలో సైతం జోక్యం చేసుకొని, తెరవెనుక చక్రం తిప్పి ఓ ముఠాకు ప్యాకేజీలు దక్కేలా చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read: Hyderabad Rains: హైటెక్ సిటీ పరువు తీసిన మొదటి వాన.. మన గ్లోబల్ సిటీ ట్రాఫిక్‌తో దిమాక్ ఖరాబ్..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×