E-Paper
Advertisement

స్పెయిన్‌లో అగ్నితాండవం.. 12 మంది సజీవదహనం, రూట్ మారడమే ప్రాణం తీసిందా?

స్పెయిన్‌లో అగ్నితాండవం.. 12 మంది సజీవదహనం, రూట్ మారడమే ప్రాణం తీసిందా?
Advertisement

Spain Wildfires: సౌత్ స్పెయిన్‌లోని అల్మేరియా ప్రావిన్స్‌లో మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతంలో మొదలైన ఈ మంటలకు ఈదురుగాలులు తోడవడంతో వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. మరో 23 మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రిపూట మంటలు వ్యాపించడంతో మరణాల సంఖ్య పెరిగిందని ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

రెస్క్యూ ఆపరేషన్స్‌కు అంతరాయం..

Advertisement

మంటలు జనావాసాల్లోకి వ్యాపించడంతో.. వేలాది మంది ప్రజలు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 16 విమానాలను, వందలాది మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. అయితే.. ఈ ప్రమాదం కొండ ప్రాంతంలో సంభవించడంతో రెస్క్యూ ఆపరేషన్స్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

చరిత్రలోనే అత్యంత వనాశకరమైన అగ్ని ప్రమాదం..

Advertisement

స్పెయిన్ చరిత్రలోనే ఇది అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదమని హెల్త్ మినిస్టర్ పేర్కొన్నారు. మృతుల్లో అందరూ విదేశీయులేనని తెలిపారు. నలుగురు బ్రిటీషర్లు కారులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. బాధితులు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అధికారులు పేర్కొన్న రూట్‌లో కాకుండా.. మరో మార్గంలో వెళ్లడం వల్లే మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని తెలిపారు.

రికార్డు స్థాయిలో టెంపరేచర్..

కరెంట్ పోల్ కూలడంతో మంటలు అంటుకుని ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇప్పటికే స్పెయిన్‌లో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదు కావడం, భారీ ఈదురుగాలులతో ఈ కార్చిచ్చు ఎంత వరకు వ్యాపిస్తుంది. ఎప్పుడు కంట్రోల్‌లోకి వస్తుందో చూడాలి మరి.

Also Read: తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×