E-Paper
Advertisement

Hydra Remarks: సీఎం రేవంత్ రెడ్డి మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలంగాణ.. ఎమన్నారంటే..?

Hydra Remarks: సీఎం రేవంత్ రెడ్డి మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలంగాణ.. ఎమన్నారంటే..?
Advertisement

Hydra Remarks: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారానికి దారితీశాయ్. బెంగళూరులో జరిగిన ఓ జాతీయ మీడియా సదస్సులో హైదరాబాద్‌లోని చెరువులు, కుంటల ఆక్రమణలని తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చిందని చెప్పారు. ఆ సంస్థకు హైడ్రా అని పేరు పెట్టడం వెనుక జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తి ఉందని చెప్పారు. అంతే సీఎంని, ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తేందుకు విపక్షాలకు అస్త్రం దొరికింది. దాంతో రాజకీయ వివాదం చెలరేగింది.

సీఎం ఆవేదన వ్యక్తం..

నిరుపేదలు చెరువులను ఆక్రమిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ, సంపన్నులు తమ ఫామ్‌హౌస్‌ల కోసం చెరువులను కబ్జా చేసి.. డ్రైనేజీలను వాటికి కలుపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకే ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. హిట్లర్‌కు అత్యంత ఇష్టమైన పదం హైడ్రా అని, ఎవరినైనా మట్టుబెట్టగల అతని కోర్ టీమ్‌ని హైడ్రా అని పిలిచేవారని తెలిపారు. ఆ హిట్లర్ నుంచే స్ఫూర్తి పొంది, ఆక్రమణదారుల్లో భయం పుట్టించడమే లక్ష్యంగా హైడ్రా అనే పేరుతో టాస్క్‌ఫోర్స్ తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతే.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలతో విరుచుపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ఆయనలోని నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం దేశం మొత్తానికి అర్థమైందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా ఓక హంతక ముఠా లాంటిదని సీఎం స్వయంగా ఒప్పుకున్నారని ఆయన ఆరోపించారు.

బీజేపీ నేతలు ఫైర్..

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి.. హిట్లర్‌ని ఆదర్శంగా తీసుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సమర్థిస్తుందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్న హిట్లర్, ఎమర్జెన్సీ మైండ్ సెట్ మరోసారి రేవంత్ రెడ్డి రూపంలో బయటపడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కూల్చివేతలను యుద్ధ ప్రాంతాలతో పోల్చడం దారుణమన్నారు. తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు కూడా సీఎం వాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

Also read: మీ ఫోన్ ఏళ్ల తరబడి పాడవకూడదా? అయితే ఈ 5 సీక్రెట్ టిప్స్ పాటించాల్సిందే!

హిట్లర్ నుంచి స్ఫూర్తి..

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయిలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయ్. కేంద్రమంత్రులు, జాతీయ పార్టీల ముఖ్య నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎం బహిరంగంగానే హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. ఇదే మాట బీజేపీ సీఎం అని ఉంటే దేశవ్యాప్తంగా అల్లకల్లోలం చేసేవారన్నారు. ఇలాంటి.. హింసాత్మక, నియంతృత్వ పోలికలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థని బలహీనపరుస్తాయని విమర్శించారు. కేరళ మాజీ సీఎం పినరయి విజయ్ కూడా.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి ప్రవర్తన, ఆలోచన విధానం హిట్లర్ తరహాలోనే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ప్రజాస్వామ్య పాలకులకు నిరంకుశ ఆలోచనలు తగవన్నారు.

కబ్జాదారుల గుండెల్లో భయం..

ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం హిట్లర్ స్ఫూర్తి వ్యాఖ్యలకు అర్థం వేరే ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని సరిచేస్తుంటే తమపై నిందలేయడమేంటి అన్నారు. హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏదైనా పని సాధించే దాకా విరమించని వాడినే హిట్లర్ అంటారని, ఏ పనినైనా పట్టుదలతో సాధించాలని సీఎం చెప్పారన్నారు. భూ కబ్జాదారుల గుండెల్లో భయం పుట్టిస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు. హైడ్రా రాజ్యాంగానికి లోబడి, చట్టపరిధిలోనే పనిచేస్తోందని చెప్పారు. హైడ్రా చర్యలను ప్రజలు హర్షిస్తున్నారన్నారు.

నిజ చరిత్రలో హిట్లర్..

రేవంత్ రెడ్డి చెప్పిన హిట్లర్ కోర్ టీమ్ హైడ్రా అనే పేరుపై.. చరిత్రకారులు, నెటిజిన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మార్వెల్ కామిక్స్ అనే ఫిక్షనల్ కథల్లో మాత్రమే నాజీలకు అనుబంధంగా హైడ్రా అనే ముఠా ఉంటుందని, నిజ చరిత్రలో హిట్లర్ తన వ్యక్తిగత సైన్యాన్ని గెస్టాపో అని పిలిచేవారని గుర్తుచేస్తున్నారు. కేవలం చెరువులు, కుంటల ఆక్రమణదారులను భయపెట్టే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన హిట్లర్ స్ఫూర్తి కామెంట్స్.. విపక్షాలకు ఓ ఆయుధంలా మారాయ్. కానీ, వెంటనే కాంగ్రెస్ నేతలు విపక్షాల విమర్శలను తిప్పికొట్టి సీఎం రేవంత్ రెడ్డి అసలు ఉద్దేశమేంటో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.

Also Read: బొబ్బిలి వీణల లొల్లి లేపిన ఎమ్మెల్యే బేబీ నాయన.. అయిన కదలని అటవీ శాఖ ఫైళ్లు!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×