E-Paper
Advertisement

Manchu: విష్ణు తాగొచ్చి కొట్టాడా? సారధినే చిచ్చు పెట్టాడా? అసలేం జరిగింది? ఫుల్ డిటైల్స్..

Manchu: విష్ణు తాగొచ్చి కొట్టాడా? సారధినే చిచ్చు పెట్టాడా? అసలేం జరిగింది? ఫుల్ డిటైల్స్..
Advertisement

Manchu: ఆ వీడియో చూసే ఉంటారుగా. మంచు విష్ణు వీరావేశంతో ఊగిపోతున్నాడు. ఇద్దరు ఆపుతున్నా ఆగట్లేదు. వీడియోలో కొట్టే విజువల్ లేదుగానీ.. సారధిని చితకబాదేశాడు విష్ణు. అతని ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తం కారింది. భయంతో విష్ణు గదిలో ఉండగానే సారధి బయటికొచ్చేసి.. డోర్‌కి గడియపెట్టి.. విషయాన్ని మనోజ్‌కు చెప్పాడట.

మనోజ్ వెంటనే సారధి ఇంటికొచ్చాడు. అప్పటికే డోర్‌ను బాదుతున్నాడు విష్ణు. గడియ తీసి ఇంట్లోకి వెళ్లాడు మనోజ్. అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విష్ణు ఏమాత్రం తగ్గలేదు. మనోజ్ బెదరలేదు. “వాడు ఏదో అన్నాడు కదా.. ఒరేయ్ గిరేయ్ అని”.. అంటున్న విష్ణు వాయిస్ వీడియోలో రికార్డ్ అయింది. ఆ మాటలు మనోజ్‌ను ఉద్దేశించే. ఆ వీడియో తీసింది కూడా మనోజే అని తెలుస్తోంది. సారధి ఇంటిపక్కనే ఉండే ఓ వ్యక్తి.. గదిలో నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపించాయని.. ఆ ఇంట్లో విష్ణు, మనోజ్ ఇద్దరూ ఉన్నారని చెప్పాడు.

Advertisement

ముఖానికి గాయాలైన సారధి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. అంటే.. ఏ రేంజ్‌లో సారధిని విష్ణు కొట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు. గతంలో సిక్స్ ప్యాక్ చేసి.. జిమ్ బాడీ పెంచిన విష్ణు.. తమ్ముడి మీది కోపాన్ని సారధిపై చూపించి.. కసితీరా కొట్టాడని అంటున్నారు. ఆ వీడియోలో విష్ణును చూసిన కొందరు నెటిజన్లు.. అతను తాగున్నాడేమోనని కామెంట్లు పెడుతున్నారు. విష్ణు తాగాడా? లేదా? అనేదానికంటే అసలు ఎందుకు కొట్టాడనేదే అసలు విషయం.

సారధి.. మోహన్‌బాబుకు బంధువు. చాలాకాలంగా విష్ణుకు సన్నిహితంగా ఉంటున్నాడు. ‘మా’ ఎన్నికల సమయంలోనూ విష్ణు వెంటే ఉంటూ.. యాక్టివ్‌గా కనిపించాడు. అయితే, ఈమధ్య విష్ణు, సారధిల మధ్య గ్యాప్ వచ్చింది. సారధి.. విష్ణును వదిలేసి మనోజ్ పక్కన చేరాడు. ప్రస్తుతం మనోజ్‌కు సహాయకుడిగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని విష్ణు తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది.

Advertisement

రెండేళ్లుగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సారధి ఇటు నుంచి అటు షిఫ్ట్ అయ్యాక.. అవి మరింత పెరిగాయి. సారధియే లేనిపోని పుల్లలు పెడుతున్నాడని.. మా బ్రదర్స్ మధ్య చిచ్చుకు అతనే కారణమని విష్ణు ఆగ్రహంగా ఉన్నాడట. ఈసారి కోపం పీక్స్‌కు చేరడంతో.. ఇంటికెళ్లి మరీ సారధిని చితక్కొట్టాడు విష్ణు.

గొడవ వీడియో వైరల్ అయ్యాక ఘటనపై మంచు విష్ణు స్పందించాడు. ఇదేమంత పెద్ద గొడవ కాదని.. మనోజ్ చిన్నవాడని.. సారధి తనతో వాగ్వాధం చేస్తుంటే తమ్ముడు ఆపలేకపోయాడని.. వీడియో తీసి పోస్టు మాత్రం పెట్టాడని.. అన్నాడు. విషయాన్ని చిన్నగా చేసి చూపిస్తూనే మనోజ్‌పై విమర్శలు చేశాడు విష్ణు.

అటు, తండ్రి మోహన్‌బాబు సైతం మనోజ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొడుక్కి ఫోన్ చేసి వెంటనే సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను డిలీట్ చేయించాడు. ఆవేశం మంచిది కాదని.. అనర్థాలకు దారి తీస్తుందని.. కొడుకులు ఇద్దరికీ హిత బోధ చేశారు. త్వరలోనే వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడాలని భావిస్తున్నారట మోహన్‌బాబు. మరి, ఇంత జరిగాక మంచు బ్రదర్స్ కలిసిపోతారా? అన్నదమ్ముల యుద్ధం ఆగిపోతుందా?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×