E-Paper
Advertisement

పూర్తిగా స్వదేశంలో తయారైన మూడు పెద్ద నౌకలు.. వాటిని చూస్తేనే వణుకుతున్న శత్రు దేశాలు!

పూర్తిగా స్వదేశంలో తయారైన మూడు పెద్ద నౌకలు.. వాటిని చూస్తేనే వణుకుతున్న శత్రు దేశాలు!
Advertisement

Navy Warships: ఇండియన్ నేవీని మరింత బలోపేతం చేస్తూ మరో మూడు యుద్ధ నౌకలు అధికారికంగా జలప్రవేశం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా.. ఈ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్ అగ్రయ్, ఐఎన్‌ సంశోధక్, ఐఎన్ఎస్‌ దుణగిరి వార్‌షిప్స్‌ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. ఈ మూడు వార్‌ షిప్స్ ఆధునికత, ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నారు మోడీ. ఈ మూడు యుద్ధ నౌకలను ఇండియన్ నేవీ వార్‌షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. మరో విషయం ఏంటంటే ఈ మూడు యుద్ధనౌకలు కూడా గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ నిర్మించింది. వీటి ఎంట్రీతో ఇండియన్ నేవీ బ్లూ వాటర్ ఆపరేషన్స్‌ కోసం మాత్రమే కాదు.. భారత తీర ప్రాంతానికి మరింత భద్రత చేకూరినట్టే.

ఇది 110 మీటర్ల పొడవు..

ఐఎన్‌ఎస్ అగ్రయ్.. ఇది అర్ణాలా క్లాస్ యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్ క్రాఫ్ట్‌. లైట్ వెయిట్ టార్పిటోలు, స్వదేశీయంగా తయారైన రాకెట్ లాంచర్లతో పాటు.. అత్యాధునిక సోనార్‌ సిస్టమ్స్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. శత్రు దేశాల సబ్‌మెరైన్‌లను గుర్తించి నాశనం చేసే సత్తా దీని సొంతం. ఐఎన్‌ఎస్ సంశోధక్.. ఇది ఓ సర్వే నౌక. హైడ్రోగ్రాఫిక్ సర్వే, ఖచ్చితమైన కొలతలు, పరిమాణం వంటి వాటిని తెలుసుకోవడంతో పాటు.. చార్టుల తయారీలో మన సామర్థ్యం మరింత పెంచేలా దీనిని రూపొందించారు. ఇది 110 మీటర్ల పొడవు ఉంటుంది. పోర్టులు, సీఛానళ్లు, మారిటైం పరిధిలో సముద్రాన్ని అధ్యయనం చేయడం, నావిగేషన్‌ విధుల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్, విపత్కర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్స్, రక్షణ చర్యలు చేపట్టేందుకు సంశోధక్‌ను డెవలప్‌ చేసింది ఇండియన్ నేవీ.

Advertisement

Also read: పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ2’ చర్చలు షురూ చేసిన సుజిత్!

75 శాతం స్వదేశీ టెక్నాలజీతో..

ఐఎన్‌ఎస్ దుణగిరి.. ఇది ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగెట్. ఇందులో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు ఉంటాయి. బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్‌ మిసైల్స్‌తో పాటు.. మిడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్‌ మిసైల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మూడు నౌకల్లో దాదాపు 75 శాతం స్వదేశీ టెక్నాలజీతోనే రూపొందించారు. అంతేకాదు 200 MSMEలు వీటి నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.

Advertisement

Storey By: Appa rao Big Tv

Also read: Accident: మెహదీపట్నంలో దారుణం.. నర్సును ఢీకొట్టిన ఇన్నోవా కారు..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×