E-Paper
Advertisement

NEET Reexam: నీట్ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్లు కొట్టేస్తూ పరీక్షకు గ్రీన్ సిగ్నల్!

NEET Reexam: నీట్ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్లు కొట్టేస్తూ పరీక్షకు గ్రీన్ సిగ్నల్!
Advertisement

NEET Reexam: ఇక ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్‌ జరగనుంది. ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేసింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఎగ్జామ్‌ను నిలిపేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పలువురికి షాక్ ఇచ్చింది. అత్యవసరంగా విచారణ జరపాలంటూ వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో ఈ ఎగ్జామ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.

టెలిగ్రామ్ యాప్‌ బ్యాన్..

మరోవైపు ఈ ఎగ్జామ్‌ కోసమే తాత్కాలికంగా టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ బ్యాన్‌ను ఎత్తేయాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది టెలిగ్రామ్. కానీ ఈ నిషేధం సరైనదేనని సమర్థించింది హైకోర్టు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేవారికి టెలిగ్రామ్‌ ఒక వేదికగా మారిందని అనుమానస్పద చానల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరినా టెలిగ్రామ్ పట్టించుకోలేదని మండిపడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం కేంద్రానికి ఆ అధికారం ఉందని కోర్టు క్లియర్‌కట్‌గా తెలిపింది. అంతేకాదు మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్‌ను నిలిపివేయాలని కేంద్రం కోరినా.. టెలిగ్రామ్‌ పట్టించుకోలేదని గుర్తు చేసింది.

Advertisement

Also read: Rythu Bharosa: తెలంగాణ రైతులకు పండగే పండగ.. 67 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు..!

ఈసారి పరీక్ష నిర్వహణలో..

నీట్ పేపర్ లీక్‌లో టెలిగ్రామ్‌ చానళ్లు, గ్రూప్‌లు కీ రోల్ ప్లే చేశాయనే ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా కేంద్రం ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది కూడా. ఈసారి పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా భద్రతా చర్యలు తీసుకుంది NTA. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు భద్రత మధ్య ఈ ఎగ్జామ్ జరగనుంది. ఇక ఎగ్జామ్‌లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఎన్‌టీఏ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు విమాన మార్గంలో నీట్ ఎగ్జామ్ పేపర్స్‌ రాష్ట్రాలకు చేరుకున్నాయి. జీపీఎస్ ట్రాకింగ్ ఉన్న వాహనాల్లో పేపర్స్‌ను తరలించనున్నారు. ఇక ఎగ్జామ్ సెంటర్లలో జామర్లను కూడా ఏర్పాటు చేశారు.

ఉచిత ప్రయాణం..

Advertisement

తెలంగాణలో నీట్ ఎగ్జామ్ రాసే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించనున్నారు. ఈసారి ఎగ్జామ్‌ టైమ్‌ను కూడా పెంచారు. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ఎగ్జామ్ టైమ్‌ను 195 నిమిషాలకు పెంచారు. ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరగనుంది.

Also read: El Niño: నైరుతి రుతుపవనాలను మింగేస్తున్న ఎల్ నినో.. ఈ ఏడాది పంటలు దెబ్బతినే ఛాన్స్..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×