E-Paper
Advertisement

Nalgonda Murders: ఆస్తికోసం మరీ ఇంత దారుణమా.. నల్గొండ జిల్లా హత్యల కేసులో సంచలన నిజాలివే..?

Nalgonda Murders: ఆస్తికోసం మరీ ఇంత దారుణమా.. నల్గొండ జిల్లా హత్యల కేసులో సంచలన నిజాలివే..?
Advertisement

Nalgonda Murders: సినిమా ట్విస్టులు కూడా పనికిరావు.. సీరియల్ విలన్లు కూడా ఈమె ముందు వేస్ట్. ఆస్తి పిచ్చి కళ్లకు కప్పేస్తే.. కన్నప్రేమ కాస్తా కసాయిగా మారింది. పైసల కక్కుర్తి.. సొంతవాళ్ల రక్తం తాగేలా చేసింది. నల్గొండ జిల్లాను వణికించిన నలుగురి హత్యల కేసులో పోలీసులు గుట్టు విప్పితే.. ఊపిరి ఆగిపోయే నిజం బయటపడింది. ఆ నరరూప రాక్షసి మరెవరో కాదు.. ఆ ఇంట్లో పుట్టి పెరిగిన కన్నకూతురే! తన భర్తతో కలిసి ఆమె ఆడిన డెడ్లీ గేమ్ స్టోరీ ఇదీ..

నెల నుంచి నెలన్నర సమయం..

నల్గొండను వణికించిన ఆ నాలుగు హత్యల మిస్టరీ విడిపోయింది. టీవీ సీరియల్స్‌ని మించిన ట్విస్టులతో, వినేవాళ్ల గుండెలు ఆగిపోయేలా ఉన్న ఈ కథలో అసలు విలన్ ఎవరో తెలిసి పోలీసులు సైతం షాకయ్యారు. ఆస్తి కోసం కన్నతల్లిని, తోడబుట్టినవాళ్లను సుపారీ గ్యాంగ్‌తో నరికి చంపించిన ఆ అదృశ్య హంతకుడు మరెవరో కాదు. ఆమె కన్నకూతురే. హత్యకు గురైన హసీనాకు గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఆ తర్వాత ఆమె షేక్ సుల్తాన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే, సుల్తాన్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. హసీనాకు బోలెడంత ఆస్తి ఉంది. ఇక్కడే పెద్ద కూతురి మైండ్‌లో సైతాన్ చేరింది. అమ్మ ఆస్తి మొత్తం ఆ సవతి పిల్లలకే పోతుంది. మనకేం మిగలదు అని కుళ్లు పెంచుకుంది. ఎలాగైనా ఆ ఆస్తిని నొక్కేయాలని మొగుడితో కలిసి ప్లాన్ వేసింది.

Advertisement

Also Read: తల్లి ఆఫీసర్.. కొడుకు ఏజెంట్.. ‘డబుల్ బెడ్రూం’ ఇళ్లపై సినిమా రేంజ్ మోసం!

తల్లి ఇంట్లోనే దొంగతనం

ఈ కిలాడీ దంపతుల టార్గెట్ ఒక్కటే పైసలు. అందుకే గతంలోనే గుట్టుచప్పుడు కాకుండా సొంత తల్లి ఇంట్లోనే దొంగతనం చేశారు. అప్పట్లో డబ్బులు కొట్టేసి సేఫ్‌గా తప్పించుకున్న ఈ జంటకు, ఈసారి ఎలాగైనా ఆస్తి మొత్తాన్ని గుంజేయాలనే దురాశ పుట్టింది. ఒక్కొక్కరిని కాదు.. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తే అడ్డుండదు, చట్టబద్ధంగా ఆస్తి మొత్తం తనకే వస్తుందని ఆ కూతురు డిసైడ్ అయింది. అనుకున్నదే తడవుగా భర్తతో కలిసి రంగంలోకి దిగింది. ఓ సుపారీ గ్యాంగ్‌ను సెట్ చేసి, వాళ్ల చేతిలో లక్షల రూపాయలు పెట్టింది.తొమ్మిది నెలలు మోసి, జోలపాడి పెంచిన కన్నతల్లిని, తోడబుట్టిన వాళ్లను ఆ సుపారీ గ్యాంగ్‌తో ఇంట్లోనే నరికి చంపించింది.

సీన్ రివర్స్..

Advertisement

తాము తప్పు చేసి హ్యాపీగా ఆస్తిని ఎంజాయ్ చేద్దామనుకున్నారు ఆ భార్యాభర్తలు. కానీ, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ తారుమారైంది. తమదైన శైలిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. హంతకులు బయటెక్కడో లేరు, ఆ ఇంట్లోనే ఉన్నారని కనిపెట్టారు. దొంగతనం దగ్గర్నుంచి, ఈ దారుణ నరమేధం వరకు అన్నిటికీ ఈ పెద్ద కూతురు, అల్లుడే మాస్టర్ మైండ్స్ అని తేల్చి జైలు ఊచల వెనక్కి నెట్టారు.

Storey By:Appa Rao big Tv

Also read: Crude Prices: సామాన్యుడికి గుడ్‌న్యూస్.. 72 డాలర్లకు పడిపోయిన క్రూడాయిల్ ధరలు!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×