E-Paper
Advertisement

Manakondur Granite Quarry: మానకొండూర్‌లో ‘షాడో’ రాజకీయం.. మంత్రి పేరిట ఫేక్ లెటర్.. గ్రానైట్ క్వారీపై కన్ను!

Manakondur Granite Quarry: మానకొండూర్‌లో ‘షాడో’ రాజకీయం..  మంత్రి పేరిట ఫేక్ లెటర్.. గ్రానైట్ క్వారీపై కన్ను!
Advertisement

Manakondur Granite Quarry:  ప్రభుత్వం మాదే.. మేము చెప్పిందే వేదం.. మాట వినకుంటే అధికారుల బదీలీలు, పార్టీ నుంచి నాయకుల‌ సస్పెన్షన్…. ఇదంతా రెండు సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న తంతు … మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లిని డమ్మీని చేసి మురళీ అనే ఆయన వర్గీయుడు షాడో ఎమ్మెల్యేగా చెలాయిస్తున్నాడంట. ఇప్పుడు అయనగారి కన్ను ఓ గ్రానైట్ పై క్వారీపై పడడంతో.. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అధికారులను నానా ఇబ్బందులు పెట్టడమే కాకుండా, జిల్లాకి చెందిన మంత్రి వివేక్ పేరిట ఫేక్ లెటర్ సృష్టించి తతంగం నడిపించాలని చూస్తున్నాడంట. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి ఆధారాలతో ఆరోపణలు చేయడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.

రాజకీయ వాతావరణంలో షాడో ఎమ్మెల్యే వివాదం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి‌ సత్యనారాయణ, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళి వ్యవహారాలు రాజకీయంగా రచ్చ రేపుతున్నాయి. మానకొండూర్ ఎమ్మెల్యే వ్యవహారాలు మొత్తం షాడో ఎమ్మెల్యే నే చూస్తున్నాడని గత రెండు సంవత్సరాలుగా పలు అరోపణలు వస్తున్నాయి. కవ్వంపల్లి‌ సత్యనారాయణ మానకొండూర్ ఎమ్మెల్యే గా గెలవడంలో కీలకపాత్ర పోషించిన నాయకులను ఇప్పుడు ఆయనకి దూరం చెయ్యడంలో మురళీ దే కీలకపాత్ర అని నియోజకవర్గంలో ముందు నుంచి టాక్ వినిపిస్తోంది.

మానకొండూర్ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు

Advertisement

మానకొండూర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఆ ఇద్దరిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి …ఏకంగా‌ మానకొండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన అరోపణలు జిల్లాలోనే రాజకీయంగా కాక రేపుతున్నాయి. మానకొండూర్ నియోజకవర్గంలో మురళి అనధికారికంగా చేస్తున్న చట్టాలు నాయకులకి, వ్యాపారులకి, అధికారులకి శాపంగా మారాయని… ఎక్కడా లేని ప్రత్యేక చట్టాలు నియోజకవర్గంలో అమలు చేస్తూ ఇద్దరూ ఎమ్మెల్యే లుగా పాలన కొనసాగిస్తున్నారని మీడియా సమావేశం పెట్టి బాంబు పేల్చాడు రసమయి.

షాడో ఎమ్మెల్యే సృష్టించిన ఫేక్ లెటర్ రహస్యాలు

షాడో ఎమ్మెల్యే మురళి నియోజకవర్గంలోని ఓ మండలంలో గ్రానైట్ క్వారీ కబ్జా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడని, దాని కోసం ఏకంగా మంత్రి వివేక్ పేరిట ఓ నకిలి లెటర్ సృష్టించారని రసమయి బాలకిషన్ ఆధారలతో‌ మీడియా ముందు ఉంచారు. ఇటీవల ఓ ఎస్సై బదిలీ విషయంలో సిపి వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం రచ్చకెక్కింది. ఇప్పుడు షాడో ఎమ్మెల్యే ఫేక్ లెటర్ ఉదంతం కవ్వంపల్లికి కొత్త తలనొప్పులు తీసుకువచ్చాయి.

మానకొండూర్‌లో పోలీస్ వర్సెస్ రాజకీయ టగ్‌ఆఫ్ వార్

Advertisement

మానకొండూర్ నియోజకవర్గం లోని‌ ఓ ఎస్సై వ్యవహారం సీపీ గౌస్ అలం వర్సెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నట్లు సాగింది. అక్కడ పనిచేస్తున్న ఎస్సై ఎమ్మెల్యే కి అనుకూలంగా వ్యవహారించడమే కాకుండా సీపీ అదేశాలని డోంట్ కేర్ అనడంతో పాటు, పలువురు పోలీసు అధికారుల బదిలీలలో జోక్యం చేసుకుని ట్రాన్స్‌ట్రాక్షన్లు నడపడంతో ఆ ఎస్సైని సీపీ మందలించారు. అయినా ఎస్ఐ తీరు మారకపోవడంతో సస్పెండ్ చేసారు. అప్పట్లో ఎస్ఐకి కవ్వంపల్లి మద్దతు పలికి భంగపడ్డారు. ఇది జరిగి నెలరోజులు గడవకముందే ఇప్పుడు ఓ మండలంలోని గ్రానైట్ క్వారీ పంచాయతి విషయం లో మురళీ, కరీంనగర్ కి చెందిన ఓ నాయకుడు తలదూర్చి క్వారీ కబ్జాకి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సోషల్ మీడియాలో గ్రానైట్ కబ్జా ఫేక్ లెటర్

ఆ గ్రానైట్ యజమానిని లొంగదీసుకునేందుకు పోలిసు అధికారులతో ఫోన్ సిగ్నల్ అధారంగా బెదిరించారని అరోపణలు వస్తున్నాయి..అయితే ఆ గ్రానైట్ క్వారీని కబ్జా చెయ్యడానికి మంత్రి వివేక్ ఎండర్స్ చేసినట్లు మురళి ఓ ఫేక్ లెటర్ సృష్టించాడంట. ఇప్పుడు ఆ లెటర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ గ్రానైట్ కబ్జా వ్యవహారం ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ల దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం.

మానకొండూర్‌లో ప్రత్యేక చట్టాల దుర్వినియోగం

ఇటీవల జిల్లా పర్యటనకి వచ్చిన మహేశ్‌గౌడ్, మీనాక్షి నటరాజన్‌లు కుడా ఈ విషయంలో సీరియస్ అయ్యినట్లు సమాచారం.. సాక్షాత్తు మంత్రి పేరిట నకిలి లెటర్ సృష్టించడంపై తీవ్రంగా మందలించారని నియోజకవర్గం కోడై కుస్తుంది.. అధికారుల సహాయం తో గ్రానైట్ క్వారీని కబ్జా చేయ్యడానికి మంత్రిని బదనాం చేసాడని మాజీ ఎమ్మెల్యే రసమయి ఆధారాలు కూడా బయటపెట్టారు. గతం నుంచి మురళీ అక్రమంగా అమలు చేస్తున్న ప్రత్యేక చట్టాలు‌ మానకొండూర్ నియోజకవర్గంలో అమలు అవుతున్నాయని, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలన్నా, ఏదన్న పరిశ్రమ పెట్టాలన్నా మురళికి ముడుపులు చెల్లించాల్సిందేనని … ఐదు ఏళ్లలో 200 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకొని చట్టాలు అమలు చేస్తున్నారని రసమయి ధ్వజమెత్తారు.

మారుతున్న రాజకీయ దృశ్యం.. ఎమ్మెల్యే స్పందన ఎక్కడ?

ఈ విషయం లో‌ ఇప్పటివరకి ఎమ్మెల్యే ‌కవ్వంపల్లి‌ సత్యనారాయణ స్పందించక పోవడం పలు అనుమానాలకి తావిస్తుందంటున్నారు. మురళీ చేస్తున్న వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే అండతో జరుగుతున్నాయని వస్తున్న అరోపణలు ఇప్పుడు రసమయి బాలకిషన్ మీడియా ముఖంగా బయటపెట్టారు….మరి ఈ పేక్ లెటర్…గ్రానైట్ కబ్జా, ప్రత్యేక చట్టాలపై‌ ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.

Also Read:  లోక్‌సభలో బుక్ దుమారం.. ఆ బుక్‌లో ఏముంది..?

Story by: Apparao, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×