E-Paper
Advertisement

MP Defections: ప్రాంతీయ పార్టీలను కుదేలు చేస్తున్న ఎన్డీయే నయా స్ట్రాటజీ.. నెక్ట్స్ టార్గెట్ అదేనా..?

MP Defections: ప్రాంతీయ పార్టీలను కుదేలు చేస్తున్న ఎన్డీయే నయా స్ట్రాటజీ.. నెక్ట్స్ టార్గెట్ అదేనా..?
Advertisement

MP Defections: ఇండియన్ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫిరాయింపుల ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్యే వెస్ట్ బెంగాల్‌‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలు తిరుగుబాటుని దేశం మొత్తం చూసింది. ఇప్పుడు.. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నుంచి ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి చేరేందుకు సిద్ధమవడం హాట్ టాపిక్‌గా మారింది. శివసేనకు ఉన్న 9 మంది ఎంపీల్లో ఆరుగురు షిండే వైపు వెళ్లడం వెనుక భారీ పొలిటికల్ స్ట్రాటజీ దాగుందా? అనే డిబేట్ ఇప్పుడు ఇండియాలో జోరుగా సాగుతోంది.

రాజకీయ ప్రయోజనం..

విపక్షంలో ఉండటం వల్ల తమ నియోజకవర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావడం లేదని, అభివృద్ధి కుంటుపడుతోందని తిరుగుబాటు ఎంపీలు చెబుతున్నారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు చట్టబద్ధంగా పార్టీ మారేందుకు.. ఉన్న ఎంపీల్లో 2/3వ వంతు ఎంపీలు ఒకేసారి పార్టీ ఫిరాయిస్తున్నారు. అధికారపక్షంలో ఉంటేనే వచ్చే ఎన్నికల్లో తమ సీట్లను, పదవులను కాపాడుకోగలమనే ఆలోచనతో ఉన్నారు. ఇలా పైకి కనిపించే కారణాలేవైనా దీని వెనుక బలమైన రాజకీయ ప్రయోజనం దాగుందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Also read: Shinde Sena: ఉద్ధవ్ సేనకు ఏక్‌నాథ్ షిండే కోలుకోలేని దెబ్బ.. ఆరుగురు ఎంపీలతో ఆపరేషన్ టైగర్ సక్సెస్!

మహిళా రిజర్వేషన్ ప్యాకేజీ..

కొద్దిరోజుల్లోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయ్. ఈ సెషన్‌లోనే మహిళా రిజర్వేషన్ ప్యాకేజీలో భాగంగా.. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లుని ఆమోదించాలనే లెక్కలున్నాయ్. దానికి అవసరమైన 2/3 మెజారిటీ సాధించేందుకే బీజేపీ ఆపరేషన్ టైగర్‌ కోసం షిండేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీలో ఇలాంటి ఆపరేషన్ జరిగింది. టీఎంసీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే అన్‌పాపులర్ పార్టీలో విలీనమయ్యారు. దీనిపై.. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడలాంటి ఆపరేషనే.. మహారాష్ట్రలోనూ జరగడం దేశమంతటా కొత్త చర్చకు దారితీసింది.

డీలిమిటేషన్ ప్రక్రియ..

Advertisement

ఎంపీల ఫిరాయింపుల వెనుక డీలిమిటేషన్‌కి లింక్ ఉందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయ్. రాబోయే రోజుల్లో దేశంలో పొలిటికల్ పిక్చర్‌ని మార్చబోయేదే ఈ డీలిమిటేషన్. అది జరిగితే దేశంలో లోక్‌సభ స్థానాలు 800లకు పెరిగే అవకాశాలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి డీమిలిటేషన్ బిల్లు, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలను పార్లమెంటులో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమోదింపజేసుకోవడానికి భారీ మెజారిటీ అవసరం. అందుకోసమే ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి, తమకు మద్దతిచ్చే ఎంపీల బలాన్ని పెంచుకునే మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే.. ఇదంతా జరుగుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒకేసారి 20 మంది ఎంపీలు ఎన్డీయే వైపు టర్న్ తీసుకోవడం, మహారాష్ట్రలో శివసేన యూబీటీ కుదేలవడం చూస్తుంటే ఇదొక ఆర్గనైజ్డ్ పొలిటికల్ స్ట్రాటజీ అనే విషయం అర్థమవుతోంది. ఇదంతా.. రాబోయే డీలిమిటేషన్ యుద్ధానికి ముందే పొలిటికల్ గ్రౌండ్‌ని తమకు అనుకూలంగా సిద్ధం చేసుకునే.. దీర్ఘకాలిక వ్యూహం.

Also read: బుల్లెట్ రైళ్లు సాధారణ పట్టాలపై వెళ్లలేవా? ప్రత్యేక ట్రాక్‌లు ఎందుకు నిర్మిస్తారు?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×