E-Paper
Advertisement

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటీ!
Advertisement

Jubilee Hills Bypoll: కార్పెట్ బాంబింగ్ పేరుతో బీజేపీ చేస్తున్న పాదయాత్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుకున్న ఫలితాలను తెచ్చిపెడుతుందా.? అంత ఆయనదే బాధ్యత అంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న స్టేట్ మెంట్స్, ఆ మంత్రికి చిర్రెత్తిస్తున్నాయా..? నేతల మధ్య సమన్వయం లోపించించడంతో సునీల్ బన్సల్ రంగంలోకి దిగారా..? అసలు అక్కడ మిగిలిన ఎంపీలు జూబ్లీహిల్స్ అంతర్భాగంగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సహకరించడం లేదా? లేకపోతే తన సెగ్మెంట్లో మిగిలిన వారి జోక్యం ఏంటని కిషన్‌రెడ్డే వారిని దూరంగా ఉంచుతున్నారా?

సతమతమవుతున్న కమలం పార్టీ:

ఆచరణ లేదు కానీ లక్ష్యం మాత్రం పెద్దగా ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అటు నుయ్యి, ఇటు గొయ్యి అన్నట్టుగా తయారైందనే చర్చ జరుగుతుంది. ఇటు సొంత నేతలతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోలేక, అటు అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ల ఎత్తుగడలను అంచనా వేయలేక కమలం పార్టీ సతమతమవుతుందట.. ప్రచారాన్ని హోరెత్తించేందుకు కార్పెట్ బాంబింగ్ లతో ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా, అనుకున్నదొక్కటి, అవుతున్నది మరొకటి అన్నట్టుగా ఉందట.

హిందువులంతా ఏకం అవ్వండి అంటున్న బీజేపీ:

Advertisement

జూబ్లీహిల్స్ గ్రౌండ్ లెవల్లో ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో ఆదరణ రావడం లేదని, ఒకేసారి ఏడు డివిజన్లలో 60 చోట్ల కార్పెట్ బాంబింగ్ పేరుతో ముఖ్య నేతలంతా మెగా పాదయాత్ర నిర్వహించినా.. ఎలాంటి రిజల్ట్స్ కనిపించడం లేదనే టాక్ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి, జూబ్లీహిల్స్ లో హిందువులంతా ఏకం అవ్వండి మోడీ అభివృద్ధి కార్డ్ చూడండి అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలు జూబ్లీహిల్స్ ప్రజలు బుర్రకెక్కించుకుంటారా..? లేక లైట్ తీసుకుంటారా..? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది.

కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న ధర్మపురి అరవింద్:

సమయం లేదు 10 రోజులు మాత్రమే ఇట్లాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డా, ఈ ఎన్నిక కిషన్ రెడ్డిదే బాధ్యత, మాకేంటి సంబంధం..? వంటి సొంత పార్టీ నేతలు చేస్తున్న స్టేట్మెంట్లు కిషన్ రెడ్డికి చిర్రెత్తిస్తున్నాయట..ఆడలేక మంగళవారం అన్నట్టూ ప్రచారంలో పాల్గొనకుండా ధర్మపురి అరవింద్ లాంటి నేతలు నేరుగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒక ఎంపీగా బాధ్యత ఉండొచ్చు, కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఎన్నిక జరుగుతుండొచ్చు, కానీ పార్టీ కిషన్ రెడ్డే కాదు కదా..? అందరూ కలిస్తేనే పార్టీ, సమన్వయంతో ముందుకు వెళ్తేనే విజయం. కానీ అందుకు విరుద్ధంగా కొంతమంది నేతల వ్యవహారం కిషన్ రెడ్డినే కాదు, పార్టీని కూడా అవమానించినట్టుగా ఉందనే టాక్ నడుస్తోంది.

Advertisement

ఇక మరోవైపు ఉప ఎన్నిక ఎపిసోడ్ లో మరే ఇతర నేతలను ఇన్వాల్వ్ కాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, అందులో భాగంగానే ప్రచారంలో కీలక నేతలెవరూ పాలు పంచుకోవడం లేదనే చర్చ సైతం నడుస్తోంది. జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగరడమేమో కానీ, నేతల మధ్య రగడలు మాత్రం జూబ్లీహిల్స్ గడ్డపై రచ్చ చేస్తున్నాయి. ఎలుకను పిలిస్తే పిల్లికి కోపం, పిల్లిని పిలిస్తే ఎలుకకు కోపం అన్నట్టుగా ఉన్నాయట కాషాయ పార్టీలో నేతల పంచాయతీలు.

సింగిల్ గానే ప్రచారం చేపట్టాలని కిషన్‌రెడ్డి నిర్ణయం:

ఇక నేతల మధ్య ఎదరవుతున్న సవాళ్లను తీసి పక్కన పడేశారట కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. ఆయన లోక్ సభ పరిధి కాబట్టి గెలుపు కిషన్ రెడ్డికి కీలకం కానుంది. దీంతో కీలక నేతలు ప్రచారానికి ఎవరు వచ్చినా రాకున్నా.. సింగిల్ గానే ప్రచారం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పొద్దు పోయేంతవరకూ జూబ్లీహిల్స్ లోనే జోరు వానలో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రచారంలో అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవాల్సిన పార్టీ నేతలు ఆ దిశగా ముందడుగు వేయడంలేదని ప్రచారం జరుగుతోన్న నేపద్యంలో, ఈ బైపోల్ బాధ్యతలు కిషన్ రెడ్డి తీసుకున్నారనే టాక్ నడుస్తోంది.

చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన సునీల్ బన్సల్:

పార్టీలోని కీలక నేతలెవరూ రెగ్యులర్ గా ప్రచారంలో కనిపించడంలేదని, అడపాదడపా ఇలా వచ్చి అలా వెళ్లిపోతూ కేవలం అటెండెన్స్ కే పరిమితమవుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ పంచాయితీలకు చెక్ పెట్టేందుకు సునీల్ బన్సల్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఉప్ప ఎన్నిక బీజేపీకి కీలకం అయిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన బన్సల్ నేతల బోల్ట్ లు బిగిస్తారనే టాక్ నడుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ తో పాటు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జూబ్లీహిల్స్ ఎన్నికపై కమిటీల ఇంచార్జీలతో వరసగా సమావేశాలు నిర్వహించి, నేతలకు దిశ నిర్దేశం చేసే పని పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. నేతల వ్యవహార శైలిపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ ప్రచారానికి రానున్న భజన్ లాల్ శర్మ:

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు , రాజ్యసభ సభ్యులు ఉండి, ఒక ఉప ఎన్నికపై ఫోకస్ చేయకపోవడంపై బన్సల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సునీల్ బన్సల్ ఇచ్చే స్ట్రోక్ తో రాష్ట్ర నేతల్లో మార్పు వస్తుందా..? లేక మళ్ళీ అదే తంతూ కొనసాగిస్తారా అన్నది అటుంచితే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఢీల్లీ పెద్దలు స్టార్ క్యాంపెనియర్లను ప్రకటించారు. ఆ జాబితాలో నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీనివాస్ వర్మ ఉన్నారు. వారితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సైతం తెలంగాణ ప్రచారానికి రానున్నారు.

స్టార్ క్యాంపెయినర్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్న వారి పేర్లు ఇవే..

జూబ్లీహిల్స్‌లో సెటిలర్లకు గాలం వేయడానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్టార్ క్యాంపెయినర్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య సైతం ఆ జాబితాలో ఉన్నారు. వీరిలో మాధవ్ ఇప్పటికే తెలంగాణ నేతలను కలిసి ప్రచారంలో పాల్గొంటానని, ఇరు రాష్ట్రాల నేతలం కలిసికట్టుగా జూబ్లీహిల్స్ గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించుకొచ్చారు.

ఇక వరసగా ప్రచార కర్తలంతా జూబ్లీహిల్స్ కు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపద్యంలో రాష్ట్ర నేతల కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది. కలిసి నడుస్తారా..? లేక మళ్ళీ కిషన్ రెడ్డిదే బాధ్యత అంటూ పాత పాటే పాడతారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

Story by Apparao, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×