E-Paper
Advertisement

Telangana Politics: కవిత త్యాగం.. అజారుద్దీన్ మంత్రి పదవికి తప్పిన గండం

Telangana Politics: కవిత త్యాగం.. అజారుద్దీన్ మంత్రి పదవికి తప్పిన గండం
Advertisement

Telangana Politics: భారత్ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి పోయే గండం తప్పినట్లేనా? ఇక ఆయనకు ఎమ్మెల్సీ పదవి గవర్నర్ వద్ద తేలేలా లేదని కాంగ్రెస్ డిసైడ్ అయిందా? అందుకే స్థానిక ఎన్నికల్లో పోటీకి అజారుద్దీన్‌ను సెట్ చేస్తున్నారా? ఒక్క దెబ్బ కు రెండు పిట్టలు అన్నట్లుగా ఒక్క నిర్ణయం తో అటు జిల్లా ఈక్వేషన్ ,ఇటు ఎమ్మెల్సీ రెండూ సెట్ అవుతున్నాయా? అసలు అదృష్టవంతుడు అంటే అజారుద్దీన్ అని పార్టీ నేతలు ఎందుకు అనుకుంటున్నారు? .. అసలు అజార్‌కు అంతలా కలిసివచ్చిన లెక్కలేంటి?

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వెటరన్ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు దాటింది. అజారుద్దీన్ ఏ చట్టసభలో సభ్యుడిగా లేకపోవడంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ‌గా కేబినెట్ నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుని, సదరు ఫైల్ గవర్నర్‌కు పంపింది. అయితే గతంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతుండడంతో అది తేలే వరకు గవర్నర్ కోటా లో అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యేలా లేరు.. దీంతో ఆరు నెలల తర్వాత అజారుద్దీన్ మంత్రి పదవి ఊడేలా ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.

Advertisement

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత
అయితే ఇంతలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఉన్న జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామా చేయడం‌తో ఆ స్థానం ఖాళీ అయింది. లోకల్ బాడీ కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ లు, కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంటుంది. అయితే సకాలంలో ఎన్నికలు జరగని కారణంగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, కౌన్సిలర్ల పదవీ కాలం పూర్తై ఆ స్థానాల్నీ ఖాళీగా ఉన్నాయి. దాంతో స్థానిక సంస్ధలు, మున్నిపోల్స్ ఎన్నికలు జరిగిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నిక సాధ్యం అవుతుంది..

నెలాఖరుకు మున్సిపోల్స్‌కు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం..
ఈనెల చివరలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయింది.. నెక్ట్స్ నెల ఎన్నికలు కంప్లీట్ అవ్వగానే మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లతో కవిత ఖాళీ చేసిన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి బై పోల్ వస్తుందని హస్తం పార్టీ భావిస్తుంది. ఈ స్థానం నుంచి అజారుద్దీన్ దింపేందుకు హస్తం పెద్దలు ప్లాన్ చేస్తున్నారంట. ఖాళీ అయిన నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి మరో రెండు సంవత్సరాల పదవి సమయం ఉంది.. ఆ స్థానం నుంచి అజారుద్దీన్ ను గెలిపించుకుంటే 2028 వరకు ఢోకా ఉండదని హస్తం పార్టీ భావిస్తుందట.

Advertisement

నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్లో దక్కని చోటు
మరోవైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రస్తుత కేబినెట్ లో ఒక్కరికి కూడా మంత్రి గా అవకాశం దక్కలేదు.. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ను నిజామాబాద్ స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీని చేస్తే నిజామాబాద్‌కు మంత్రి పదవి ఇచ్చినట్లు అవుతుంది… ఇంకో వైపు అజారుద్దీన్ మంత్రి పదవి కి ఢోకా ఉందడని ఎత్తుగడ వేసారట పీసీసీ పెద్దలు..

Also Read: అమరావతిపై జగన్ కామెంట్స్.. మాట మార్చిన సజ్జల!

దీంతో ఒకే దెబ్బ కు రెండు పిట్టలు అన్నట్లుగా అటు అజారుద్దీన్ సేఫ్, ఇతిటు జిల్లా ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందంటున్నారు పార్టీ నేతలు. ఏదేమైనా అజారుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి అయ్యాడు… గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఆలస్యం అవుతుండడంతో ఇప్పుడు స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీ గా అవకాశం వచ్చింది.. దాంతో అదృష్టం అంటే నీదే గురు అంటున్నారు అందరూ.

Story By Apparao, Bigtv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×