E-Paper
Advertisement

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియా తుఫాన్.. అసలు నిజమిదే!

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియా తుఫాన్.. అసలు నిజమిదే!
Advertisement

Jr NTR: ఏపీ రాజకీయాల్లో మరోసారి తారకమంత్రం ధ్వనిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందంటూ సోషల్‌మీడియాలో తుఫాన్ మొదలైంది. ఆ వెంటనే అదేం లేదు. అవన్నీ పుకార్లే అంటూ క్లారిటీ వచ్చేసింది. ఇంతటితో కథ ఆగిపోలేదు. పొగ లేకుండా నిప్పు పుడుతుందా? రాజకీయాలపై ఆసక్తి లేనప్పుడు.. సోషల్‌మీడియాలో గంభీరమైన కదలికలు దేని కోసం.? నిజంగానే ఎన్టీఆర్ పొలిటికల్ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నారా?

పొలిటికల్ ఎంట్రీపై జూలై 18న కీలక ప్రకటన

Advertisement

తెలుగునాట ఎన్టీఆర్ అనే మూడక్షరాలకు ఉన్న పవర్ వేరు. ఆ పేరు వెనుక ఒక చరిత్ర ఉంది, ఒక భావోద్వేగం ఉంది. తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పొలిటికల్ ఎంట్రీపై జూలై 18న కీలక ప్రకటన చేస్తారని తెగ ప్రచారం జరిగింది. అదేం లేదని ఎన్టీఆర్‌ టీమ్‌ కొట్టిపారేసినా లైట్‌గా తీసుకోవద్దంటున్నారు విశ్లేషకులు. తెరవెనుక జరుగుతున్న కార్యక్రమాలు మాత్రం వేరే సంకేతాలను పంపుతున్నాయి. ఎన్టీఆర్ ఊరు వాడ వస్తున్నాం ప్రోగ్రామ్‌ ప్లాన్ చేయడం వెనుక పొలిటికల్ ప్లాన్ ఉందా? ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారా? బలమైన క్యాడర్‌ను నిర్మించే వ్యూహమా? నిరుద్యోగ యువతను, విద్యార్థులను ఆకట్టుకునేలా సాగుతున్న ఈ సామాజిక కార్యక్రమాలు పక్కా పొలిటికల్ అజెండాను తలపిస్తున్నాయి.

Also Read: కాంగ్రెస్ స్కెచ్, బీఆర్ఎస్ కౌంటర్, బీజేపీ రివర్స్ ఎటాక్.. కాళేశ్వరం చదరంగంలో అసలు గెలిచేదెవరు?

Advertisement

రాజకీయాల్లో కి అల్లు అర్జున్..?

తమిళనాడులో విజయ్‌ గ్రాండ్‌ విక్టరీ తర్వాత.. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలు ఆయన బాటలోనే వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను కూడా బన్నీ కలిశారని కథనాలు వచ్చాయి. ఇటు హీరో ధనుష్ కూడా ప్రజల్లో నిత్యం ఉండేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇటు ఎన్టీఆర్‌ కూడా పొలిటికల్ ఎంట్రీ కోసం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు చాలా స్మార్ట్‌గా చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌తో లక్షలాది మందిని ఏకం చేస్తున్నారు. ఆ వ్యవస్థ కేవలం వెబ్‌సైట్ కాదు. అది ఒక సైన్యం. భవిష్యత్తులో ఏ క్షణంలోనైనా పొలిటికల్ గేర్ మార్చడానికి వీలుగా సిద్ధం చేస్తున్న ప్లాట్‌ఫామ్. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాను” అని చెప్పడం తాత్కాలిక వ్యూహమే తప్ప, శాశ్వత నిర్ణయం కాదనేది ఇండస్ట్రీ టాక్.

రాజకీయ రంగస్థలంపై తారక్..?

జూలై 18న పెద్ద ప్రకటన ఉండకపోవచ్చు కానీ బ్యాక్ గ్రౌండ్‌లో పెద్ద పొలిటికల్ స్క్రిప్ట్ సిద్ధమవుతోంది.. ప్రస్తుతం జరుగుతున్నదంతా రాబోయే పెద్ద తుఫానుకు ముందున్న నిశ్శబ్దమే. తారక్ ప్రస్తుతానికి సినిమాల్లో యాక్షన్ చెప్తున్నా.. భవిష్యత్తులో ఏపీ రాజకీయ రంగస్థలంపై ఆయన పొలిటికల్ రోల్‌ పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ క్లైమాక్స్ ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుంది!

Also Read: 30 రోజులు జైల్లో ఉంటే పదవి అవుట్.. కేంద్ర బిల్లుపై దేశవ్యాప్తంగా పెను దుమారం!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×