E-Paper
Advertisement

నువ్వెవడ్రా..? ఎమ్మెల్యే ఆవేశం.. మంత్రి పదవి గాల్లో దీపమేనా?

నువ్వెవడ్రా..? ఎమ్మెల్యే ఆవేశం.. మంత్రి పదవి గాల్లో దీపమేనా?
Advertisement

Bendalam Ashok: చేయి జారితే తీసుకోవచ్చు…కానీ నోరు జారితే తీసుకోలేమంటారు.. నోరు జారితే ఎంత ప్రమాదకరమోజజ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోశ్ వ్యవహారం స్పష్టం చేస్తోందని శ్రీకాకుళం జిల్లాలో పెద్ద చర్చ నడుస్తుందట. బెందాళం అశోక్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా మంత్రి పదవి దక్కించుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అయితే సమస్యపై తనను కలవడానికి వచ్చిన యువకులపై ఇచ్చాపురం ఎమ్మెల్యే ఆవేశంతో నోరు జారడం తీవ్ర వివాదాస్పదమైంది. తర్వాత ఆయన దిగివచ్చి సారి చెప్పినా.. జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, చేసిన వ్యాఖ్యలే ఆయనకు శాపంగా మారతాయన్న టాక్ వినిపిస్తోంది. అంతకీ ప్రభుత్వ విప్‌గా ఉన్న బెందాళం అశోక్‌కి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?

హ్యాట్రిక్ హీరో అశోక్

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం… టీడీపీకి కంచు కోట లాంటిది. ప్రతిపక్షాల్లో కుమ్ములాటలు తెలుగుదేశం పార్టీకి వరంగా మారుతూ.. ఎన్నిక ఏదైనా నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గాల్లోనూ అక్కడ నుంచి బెందాళం అశోక్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోను ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. 2024 ఎన్నికల తరువాత ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కారణం ఏదైనప్పటికీ ప్రభుత్వం ఆయనకు విప్ పదవి ఇచ్చి సరిపెట్టింది.

కూన రవికుమార్‌కు షాక్?

Advertisement

జిల్లాలో అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న కళింగ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గం ప్రజలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో క్యాబినెట్ విస్తరణలో అదే సామాజిక వర్గానికి చెందిన ఫైర్ బ్రాండ్ కూన రవికుమార్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆయన్ని క్యాబినెట్ లోకి తీసుకోకుండా ఉండడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కూన రవికుమార్‌కి బదులు అదే సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్‌ని త్వరలోనే మంత్రి పదవి వరించనుందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. కానీ ఇంతలోనే ఆయన ఆవేశం శాపంగా మారిందని చర్చించుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు.

ఇచ్చాపురంలో కొత్త టెన్షన్

బెందాళం అశోక్ తనని కలవడానికి వచ్చిన ఆదివాసి యువకులతో కొంచెం నోటి దురుసుతనంతో మాట్లాడారనే టాక్ నియోజకవర్గంలో నడుస్తుందట. ఇచ్చాపురం నియోజకవర్గంలో బెంతు ఒరియా సామాజిక వర్గం సమస్య దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. సమస్యకు పరిష్కారం దొరకకపోతుండటంతో వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మంజూరు కావడం లేదు. దీంతో ఉద్యోగ అవకాశాలకు, ఎడ్యుకేషన్ కు వాళ్లు దూరమవ్వాల్సి వస్తోంది. దీంతో వారి సమస్యకు పరిష్కారం దిశగా , వారిని ఎస్టీల్లో కలపేలా చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే నిర్ణయించారంట. అది ఆదివాసీలు సహా మిగిలిన సామాజిక వర్గాలకు ఒకింత ఇబ్బందిగా మారిందట.

నువ్వెవడ్రా?… ఇచ్చాపురంలో ఎమ్మెల్యే మాటలపై రచ్చ

Advertisement

బెంతుఒరియా సామాజికవర్గాన్ని ఎస్టీల్లో చేర్చడానికి వీలులేదని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ సామాజికవర్గం వారు ఎస్టీలే కాదనేది వారి వాదన. ఇదే అంశంపై చర్చించడానికి ఆదివాసీలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లారు. బెంతు ఒరియా వర్గాన్ని ఎస్టీల్లో చేర్చడానికి ఎలా అంగీకరిస్తారని ఆదివాసీలు ఎమ్మెల్యేని నిలదీశారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆవేశంలో ఓ యువకుడిపై నాకు చెప్పడానికి నువ్వు ఎవడ్రా అంటూ…ఇంగ్లీష్‌లో అనరాని మాట అనేశారు.

అశోక్ వ్యాఖ్యల దుమారం.. ఆదివాసీలు vs ఎమ్మెల్యే!

ఆవేశంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ చేసిన వ్యాఖ్యలతో…అక్కడ ఉన్న వాళ్లు షాక్ అయి, అభ్యంతరం చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఎమ్మెల్యేకు కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ఆ వ్యాఖ్యలే నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్ధితి. బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చితే తమకున్న రిజర్వేషన్ ఫలితాలు తగ్గిపోతాయని ఆదివాసీల వాదన. నియోజకవర్గంలో 27 వేల మంది బెంతు ఒరియా సామాజికవర్గం వారు ఉన్నారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందనేది ఎమ్మెల్యే వెర్షన్.

అశోక్ వివాదం క్లైమాక్స్… క్షమాపణతో ముగిసిందా?

ఎమ్మెల్యే చెప్పిన దాంట్లో కూడా నిజం ఉన్నప్పటికీ.. ఒక ప్రజా ప్రతినిధిగా తమ దగ్గరికి వచ్చిన ప్రజలతో కాస్త నిగ్రహంగా…సహనంతో వ్యవహారించి ఉండాల్సిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బూతులతో దుర్భాషలాడం సమంజసం కాదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అందుకే ఆదివాసీలు కూడా ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌లు మొదలుపెట్టారు. చివరికి ఆదివాసీల డిమాండ్‌తో ఎమ్మెల్యే వెనక్కి తగ్గారు. తాను కోపంలో అలా కామెంట్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. తాను ఉద్దేశం పూర్వకంగా అలా మాట్లాడ లేదని స్పష్టత ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని ఎమ్మెల్యే అనుచరులు వాపోతున్నారు. మొత్తానికి మినిస్టర్ రేసులో ఉన్న సదరు ఎమ్మెల్యే భవిష్యత్తుపై ఈ వ్యవహారం ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి.

Also Read: అసెంబ్లీలో సైలెంట్.. పార్లమెంట్‌లో వాయిలెంట్.. అమరావతిపై వైసీపీ ‘డబుల్ గేమ్’!

Story by: Apparao, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×