E-Paper
Advertisement

ఆరునూరైనా కేసీఆర్ సీఎం.. పోలీసుల తోలుతీసే ప‌నిపైనే మొద‌టి సంత‌కం..!

ఆరునూరైనా కేసీఆర్ సీఎం.. పోలీసుల తోలుతీసే ప‌నిపైనే మొద‌టి సంత‌కం..!
Advertisement

కేటీఆర్ ప్ర‌సంగాలు విచిత్రంగా ఉంటాయి. మ‌ధ్య‌లో కంట్రోల్ త‌ప్పుతా ఉంటాయి. బహుశా బీపీ టాబ్లెట్ వేసుకోక‌పోవ‌డమా? లేదా అధికారం కోల్పోయామ‌నే ఫ్ర‌స్ట్రేష‌నా తెలియ‌దు గానీ.. ఆవేశం హ‌ద్దులు మీరుతూ ఉంటుంది. ప‌నిలో ప‌నిగా త‌మ‌ను ఓడించినందుకు జ‌నంపై కూడా క‌స్సుబుస్సు మంటుంటాడు.

ఎంత‌గా కంట్రోల్ చేద్దామ‌న్నా.. అది సాధ్యం కావ‌డం లేదు ఈ మ‌ధ్య‌. ఇప్పుడు కొత్త‌గా కేటీఆర్ ఓ కామెంట్ చేస్తున్నాడు. బ‌లంగా.. బ‌ల్ల గుద్దిన‌ట్టుగా. ఏమ‌ని? ఆరు నూరైనా కేసీఆర్ ఇక సీఎం అంటున్నాడు. దీన్ని ఎవ‌రూ ఆపేంత సీన్ లేదు. ఆప‌త‌ర‌మూ కాదు… అన్న‌ట్టుగా సాగుతోంది ఆయ‌న ప్ర‌సంగం.

Advertisement

స‌రే, కార్య‌క‌ర్త‌ల్లో .. క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు అలా చేస్తున్నాడ‌ని అనుకుందాం. కానీ దీన్ని మ‌ళ్లీ అహంకార‌మ‌నుకుంటారేమోన‌ని త‌నే భ‌య‌ప‌డి.. ప్ర‌జ‌ల ఆశీస్సులుంటే.. అని కండిష‌న్స్ అప్లై లాగా చ‌వ‌ర‌లో యాదికొచ్చిన‌ట్టుగా ఆ ప‌దాన్ని జోడిస్తున్నాడు. ఇవ‌న్నీ పాత ముచ్చ‌ట్లే.. కొత్త‌వేం కాదు గానీ, పోలీసులు తాట తీస్తానంటున్నాడు.

ఇదీ పాత ముచ్చ‌ట‌నే క‌దా.. అంటున్నారా. అది కాద‌ట‌.. అస‌లు అధికారంలోకి రాగానే ఆయ‌న చేసే మొట్ట‌మొద‌టి ప‌ని అదే అయిన‌ట్టు.. దీనికి అంత ప్ర‌యార్టీ ఇస్తున్న‌ట్టుగా సాగుతోంది ఆయ‌న స్పీచ్‌. నేను కేసీఆర్ అంత మంచోడ్ని కాదు..మీరు రిటైర్‌మెంట్ అయినా వ‌ద‌ల‌ను, స‌ప్త స‌ముద్రాలు దాటి వెళ్లినా.. ప‌ట్టుకు రావ‌డం ఖాయం.. ! అవ‌న్నీ రొటీన్ డైలాగులు కొడుతున్నాడు. కానీ అధికారంలోకి వ‌చ్చిన‌ట్టుగానే మాట్లాడి.. ఇక మీ తోలుతీసే ప‌నే ఉంది.. అర్జెంటుగా! అనే రీతిలో ఆయ‌న మాట్లాడిన తీరు న‌వ్వులపాలు చేస్తున్న‌ది.

Advertisement

తొంద‌ర‌ప‌డి ఓ కోయిలా ముందే కూసింది.. అన్న‌ట్టుగా.. ఇలాంటి మాట‌ల‌తో జ‌నాల్లో మైలేజీ ఏమో గానీ, అధికార ద‌ర్పం.. అహంకారం ఇంకా పోలేద‌నుకునే ప్ర‌మాద‌మూ ఉంది. ఈ విష‌యం ప‌సిగ‌ట్ట‌డం లేదు పాపం.. కేటీఆర్‌. అధికారంలోకి రాగానే మేం ఇది చేస్తాం.. అది చేస్తాం.. దీన్ని ప్ర‌యార్టీగా తీసుకుంటాం.. ఈ ఫైలుపైనే తొలి సంత‌కం చేస్తాం.. అని చెప్ప‌డం చూశాం! కానీ కేటీఆర్ మాత్రం రోజులు, వారాలు, నెల‌లు లెక్క‌బెట్టుకుంటున్నాడు. ఎందుకు అంటారా? అదేనండి అధికారం ఎప్పుడు వ‌స్తుందా? అని. అధికారం రాగానే.. తొల‌త తెలంగాణ పోలీసుల తోలు తీసే ప‌నినే ఓ య‌జ్ఞంగా పెట్టుకుంటాడ‌న్న‌మాట‌. అంటే తొలిఫైలుపై సంత‌కం పోలీసులు తోలు తీసే ప‌నిపైనే రామ‌న్న పెడ‌తాడాన్న‌మాట‌. జ‌ర జాగ్ర‌త్త మ‌రి పోలీసులూ..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×