E-Paper
Advertisement

Chittoor: వీళ్లా మన నాయకులు? చిత్తూరు వైసీపీలో అసలేం జరుగుతోంది?

Chittoor: వీళ్లా మన నాయకులు? చిత్తూరు వైసీపీలో అసలేం జరుగుతోంది?
Advertisement

Chittoor: చిత్తూరులో వైసీపీ నేతల ఆధిపత్య పోరు రోడ్డెక్కింది.. చిత్తూరు వైసీపీ ఇన్చార్జ్ విజయానందరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి అనుచరుడు బుల్లెట్ సురేష్ వర్గాలు మద్య అంతర్గత పోరు వీధుల్లోకి ఎక్కి పార్టీ అందరిలో నవ్వులపాలవుతోంది.. గత ఎన్నికల్లో చిత్తూరు వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి థియోసాఫికల్ సోసైటీ భూములను కబ్జా చేశారని బుల్లెట్ సురేష్ అరోపిస్తే, బుల్లెట్ సురేష్ ఓ అమ్మాయిపై అత్యాచారాయత్నం చేశాడంటూ విజయానంద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయించారు.. దీంతో దొందు దొందు అంటూ చిత్తూరు వాసులు .. వీళ్లా ప్రజా జీవితంలోకి వద్దామనుకుంటున్న నాయకులని చర్చించుకుంటున్నారు. అసలు చిత్తూరు వైసీపీలో ఏం జరుగుతోంది?

వైసీపీలో వర్గాల మధ్య ఘర్షణలు

వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నేతలు, అక్రమాలకు పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న వారు చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నారు. అయితే అంతర్గత విభేదాలు కూడా అక్కడే ఎక్కువుగా ఉంటాయి. జిల్లాలో రోజా వర్సెస్ పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి వర్సెస్ నారాయాణ స్వామి, పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి ఇలా ప్రతినియోజక వర్గంలో పెద్దిరెడ్డి వర్గం, ఆయన యాంటీ వర్గాలు ఆధిపత్యం కోసం రాజకీయం చేస్తూనే ఉంటాయి. చిత్తూరులో కూడా పెద్దిరెడ్డి వర్గానికి బలమైన నాయకులు ఉన్నారు.

చిత్తూరు పెద్దిరెడ్డి వర్గం లో గొడవలు

Advertisement

చిత్తురులోని పెద్దిరెడ్డి వర్గంలో మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ కీలకంగా ఉన్నారు. గత ఎన్నికలలో చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా విజయానందారెడ్డి పోటీ చేసారు..ఆయనకి వ్యతిరేకంగా బుల్లెట్ సురేష్ పనిచేసార్నన్న అరోపణలున్నాయి..ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు పరిపాటిగా మారాయి.

బుల్లెట్ సురేష్ అరోపణలు

విజయానందరెడ్డి వర్గం తాజాగా ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆయన థియోసాఫికల్ భూములను కబ్జా చేసి, అక్కడున్న చారిత్రాత్మక భవనాలను పడగొట్టి, ఆ ప్రాంతాన్ని చదను చేసారని బుల్లెట్ సురేష్ మీడియా సమావేశం పెట్టి అరోపించారు.. చిత్తూరు అర్టీసి బస్టాండ్ వద్ద రెండు ఎకరాల భూమి విషయంలో చిత్తూరులో గత వారం రోజులుగా దానిపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది.

పెద్దిరెడ్డి వర్గం VS విజయానందరెడ్డి వర్గం

Advertisement

ఉన్నట్లుండి కొంతమంది ఈ స్థలంలో ఉన్న భవనాన్ని పడగొట్టి చదను చేశారు. తర్వాత కొంతమంది బయట ప్రాంతాల వారికి తాము భూమిని అమ్మామని, తాము థియోసాఫికల్ వారణాసి సభ్యులమని చెప్పుకున్నారు. అయితే డాక్యుమెంట్స్ చూపించమని నిలదీస్తే.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు..దాంతో ఆ వివాదం అందరి దృష్టిలో పడింది.. ఆ క్రమంలో పెద్దిరెడ్డి వర్గీయుడైన బుల్లెట్ సురేష్ రంగంలోకి దాని వెనుక ఉంది విజయానందరెడ్డని, ఆయనతో పాటు మరో ముగ్గురు నాయకులు ఉన్నారని బహిరంగంగా అరోపించారు.

చిత్తూరు రాజకీయ కలహంలో కొత్త మసాలా

తాజాగా చిత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది మహిళలు చిత్తూరు పోలీస్ స్టేషన్ ఎదుట అందోళన నిర్వహించారు.. అందులో ఓ అమ్మాయి తనపై వైసీపీ నేత బుల్లెట్ సురేష్ అత్యాచార యత్నం చేసాడంటు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దాంతో అక్కడున్న వారితో పాటు పోలీసులు ఆమెను అడ్డుకుని, ఎలాంటి ఉపద్రవం జరగకుండా నిరోధించారు. అయితే ఆ అమ్మాయి గతంలో బుల్లెట్ సురేష్ ఇంట్లొ పనిచేసేదని, అమ్మాయి తమ్ముడు మీద బుల్లెట్ సురేష్ దొంగతనం కేసు కూడా పెట్టాడని సమాచారం.

వైసీపీ శ్రేణుల్లో ఆవేదన

ఈ గొడవల మధ్య అమ్మాయి బయటకు వచ్చి తనపై అత్యాచార యత్నం చేశాడంటూ ఆందోళన చేయడం సంచలనంగా మారింది.. ఈ వ్యవహారం వెనుక విజయానంద రెడ్డి వర్గీయుల హస్తం ఉందని, సురేష్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తం వ్యవహారంలో ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ బజారున పడి, తమ పరువు కూడా పార్టీ పరువు కూడా తీస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి,అంటున్నారు. ఏదేమైనా పెద్దిరెడ్డి వర్సెస్ విజయానందరెడ్డి వర్గాల మద్య చిత్తూరు వైసీపీలో జరుగుతున్న ఆధిపత్యపోరు మరోసారి బయటపడిందంటున్నారు.

Also Read: హోర్ముజ్ పగ్గాలు.. అణు హక్కులు.. ఇరాన్ 10-సూత్రాల ప్లాన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్!

Story by: Anup, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×