E-Paper
Advertisement

Local body elections: లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కారు జోరు చూపిస్తారా?

Local body elections: లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కారు జోరు చూపిస్తారా?
Advertisement

Local body elections:  స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్‌లో కదలికలు మొదలయ్యాయి.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి తర్వాత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలను దృష్టిలో ఉంచుకుని డ్యామేజ్ కంట్రోల్ కి చర్యలు చేపడుతోంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమ సత్తా చూపించుకునేందుకు సన్నద్ధం అవుతోంది భారత రాష్ట్ర సమితి . మరి గులాబీ పార్టీ స్కెచ్‌లు వర్కౌట్ అవుతాయా?

బీఆర్ఎస్‌లో సమీక్షలు

జూబ్లీహిల్స్ లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆత్మవిమర్శలో పడింది.. ఎక్కడ తప్పు జరిగింది? ప్రజలు తమను ఎందుకు నమ్మలేదు? అన్న అంశాలపై లోతుగా సమీక్షిస్తోంది.. ఇందుకోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేయనుంది.. అందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ముఖ్యనాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సహా కేడర్ ను సిద్ధం చేస్తోంది..

బీఆర్ఎస్ నాయకుల మధ్య సమన్వయలోపం

Advertisement

డిసెంబర్ నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎలాగైనా స్థానిక సంస్థ ఎన్నికల్లో నిలదొక్కుకోవాలని, తిరిగి పుంజుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.. కానీ అందుకు తగ్గ కార్యచరణ మాత్రం మొదలుపెట్టలేదు.. పార్టీకి గ్రామస్థాయి నుంచి కమిటీలు లేకపోవడం, నాయకుల్లో సమన్వయలోపం ఇవన్నీ బీఆర్ఎస్ కి అడ్డంకిగా మారాయి..

లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కారు జోరు చూపిస్తారా?

గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక స్థానాల్లో సత్తా చూపించింది.. కానీ, ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కారు జోరు చూపిస్తుందా? లేక ఢీలా పడిపోతుందా? అని గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. గతంలో రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.. కానీ కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యపరిస్థితుల దృష్ట్యా క్రియాశీలక రాజకీయాలకు మాజీ సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు..

కేటీఆర్ పై ప్రత్యర్ధి పార్టీలలో విమర్శలు

Advertisement

బీఆర్ఎస్ అధిష్టానానికి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవడం.. వీరందరినీ ఏకతాటిపై నడిపించే దిక్సూచి కరువవడం పార్టీకి తీరని లోటుగా మారింది.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నా కూడా గులాబీ నాయకుల్లో ఐక్యత మాత్రం కనిపించడం లేదు.. అందరినీ కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కేటీఆర్ తగిన పాత్ర పోషించడంలేదని ప్రత్యర్థి పార్టీలలో విమర్శలు వెల్లువెత్తున్నాయి..

తూతూ మంత్రంగా సమీక్ష

పార్టీలో ఇన్ని లోపాలు, సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా పార్టీ అధిష్టానం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.. పార్టీని బలోపతం చేయకుండా, నాయకుల్లో సమన్వయం తీసుకురాకుండా తూతూమంత్రంగా సమీక్షా సమావేశాలను నిర్వహించి ముందుకు వెళుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి చూడాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుందో?

 Story By Apparao, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×