E-Paper
Advertisement

Bharathiraja Legacy: తెలుగు ఇండస్ట్రీపై భారతీరాజా మార్క్.. కమర్షియల్ హిట్స్‌తో రియలిస్టిక్ పిక్చర్స్ ఇచ్చిన మేధావి..!

Bharathiraja Legacy: తెలుగు ఇండస్ట్రీపై భారతీరాజా మార్క్.. కమర్షియల్ హిట్స్‌తో రియలిస్టిక్ పిక్చర్స్ ఇచ్చిన మేధావి..!
Advertisement

Bharathiraja Legacy: గుడి గంట చర్చి గంట ఒకేసారి కొట్టుకున్న చప్పుళ్లు ఎప్పుడైనా విన్నారా? ఆపై రెండు లేతగుండెలు దగ్గరైనప్పుడు పాడుకునే యుగళ గీతాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? మట్టి వాసనలకంటూ సొబగులున్నాయని నిరూపించిందీ, పల్లెటూరి అందాలకూ వన్నె తీసుకొచ్చిందీ ఆయనే. మధ్య వయసులోనూ ప్రేమ పుట్టుకొస్తుందని, అదొక దృశ్య కావ్యంగా నిలుస్తుందనీ.. రుజువు చేసిందీ ఆయనే. రియలిస్టిక్స్ పిక్చర్స్ తీస్తూనే వాటిని కమర్షియల్ హిట్స్ గా మలచిన దర్శకత్వ ప్రతిభకు కేరాఫ్‌ కూడా ఆయనే. ఆయన స్టార్ట్- కెమెరా- యాక్షన్ అని చెబుతుంటే, ఏదో కవిత చెప్పినట్టే ఉంటుంది. వెండితెరపై వినోదాల పువ్వులే కావు, వికాసాలనూ వెదజల్లిన దర్శకత్వ శైలి భారతీ రాజా!

ఆయన తొలి చిత్రం..

తెర రాజ- భారతీ రాజా ఒకానొక సమయంలో దక్షిణాది దర్శకత్వ ప్రతిభకు గర్వకారణమైన చిరునామా! మన తెలుగులో వచ్చిన పదహారేళ్ల వయసు. ఆయన తొలి చిత్రం. 1977లో పదనారు వయదినిలే పేరిట వచ్చిందీ సినిమా. ఇటు తమిళం, అటు తెలుగులో సూపర్ హిట్ సాధించిందీ చిత్రం. ఇక్కడ భారతీరాజా గొప్పదనం ఏంటంటే, ఆయన ఎందరో నటీనటులకు తగిన విధంగా పాత్రలను తీర్చిదిద్దడం మాత్రమే కాదు వారిని లైమ్ లైట్లోకి తీసుకురాగలిగే డైరెక్షనల్ టాలెంట్ గల దర్శకుడు కూడా. ఆ తర్వాత ఆయన-కిళక్కు పోవుం రైల్ అనే చిత్రం తీశారు. ఇందులో మన సుధాకర్ హీరో. ఇదాయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం. అంతే కాదు ఇదే సినిమా సుధాకర్ తో పాటు, రాధికకు సైతం డెబ్యూ ఫిలిం. మనకు కమెడియన్ గా మాత్రమే తెలిసిన సుధాకర్.. ఈ సినిమాతో వరుసగా 20 నుంచి ముప్పై సినిమాల్లో హీరోగా, ప్రధాన పాత్రల్లో చేశారు. దటీజ్ భారతీ రాజాస్ కల్ట్ క్లాసికల్ కట్.

భారతీ రాజా ఒక ఆల్ రౌండర్..

Advertisement

మొదటి రెండు సినిమాల ద్వారా.. ఆయనపై పడిన ముద్ర- కేవలం పల్లెటూరు ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోగలడని. కానీ, ఇదంతా తప్పని నిరూపిస్తూ ఆయన చేసిన వరుస సినిమాలు తనపై అప్పటి వరకూ ఉన్న ఒపీనియన్ని మార్చేశాయి. భారతీరాజా ప్రయోగాత్మక చిత్రం నీళల్గల్, టిక్ టిక్ టిక్.. ఇలా చెప్పుకుంటూ పోతే- భారతీ రాజా ఒక ఆల్ రౌండర్ గా చెప్పాలి. అంతేనా ఆయనకు నవరస దర్శకుడన్న బిరుదు సైతం లభించింది. ఎయిటీస్ ని భారతీరాజాస్ డికేడ్ గా పిలుస్తారు. ఎనభైల కాలంలో ఆయన సాధించిన అతి పెద్ద విజయాలు- అలైగల్ ఒయివతిల్లై, మన్ వాసనై, ముదల్ మరియాదై వంటి చిత్రాలు.

Also Read: POK Protests: పీఓకేలో పాకిస్తాన్ ఆర్మీ నరమేధం.. కరెంట్ అడిగితే సామాన్య జనం పై బుల్లెట్లతో కాల్పులు..!

అవి పాటలా పూదోటలా?

Advertisement

అలైగల్ ఒయివతిల్లై- తెలుగులో వచ్చిన సీతాకోక చిలుక. ఈ సినిమా ద్వారా కార్తీక్ పరిచయం కాగా తెలుగులో ఈ మూవీ క్రియేట్ చేసిన సన్సేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఇక్కడే భారతీరాజా గొప్పదనం గురించి చెప్పాలి. ఆయన సినిమాల ద్వారా ఎందరో నటీనటులు దక్షిణాది తెరకు పరిచయం కావడం మాత్రమే కావు అవి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన పరిస్థితులు. భారతీరాజా చెయ్యి పడితే ఆ డెబ్యూ హీరో హీరోయిన్ల కెరీర్ ఎక్కడికో వెళ్తుందనడానికి ఎన్నో నిదర్శనాలు. అవి పాటలా పూదోటలా? అన్నట్టు పరవశించి పోయారు ప్రేక్షకులు. సీతాకోక చిలుక ఒకానొక కులాంతర ప్రేమ కథ. కానీ ఆ పాటలు- కులాంతర ప్రేమలకు- ఎంతటి కమ్మటి వాసనలు వెదజల్లిందంటే.. అప్పటి వరకూ సమాజంలో ఎంతో పెద్ద తప్పుగా అనిపించిన కులాంతర వివాహాలు కాస్తా.. నిజజీవిత ప్రేమ కావ్యాలకు నిదర్శనంగా మారాయ్. అంతటి విప్లవాత్మక చిత్రంగా నిలిచింది సీతాకోక చిలుక.

తెలుగులో ఉత్తమ చిత్రం..

ఇక ఎయిటీస్ లో వచ్చిన ముదల్ మర్యాదై.. సినిమా అయితే మధ్య వయసు ప్రేమ గాథలకు తెర రూప దృశ్య కావ్యంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదేమో. ఈ సినిమాలో శివాజీ గణేశన్, రాధ హావ భావ విన్యాసాలకు ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా తెలుగులో ఆత్మబంధువుగా వచ్చి విజయవంతమైంది. తెలుగు వారికీ భారతీ రాజాకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. ఆయన తీసిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా, భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు, నంది ఉత్తమ దర్శకుడు అవార్డు సైతం వరించింది.

పల్నాటి పౌరుషం సినిమా..

ఇక మంగమ్మగారి మనవడు మరేదో కాదు ఆయన మన్ వాసనై సినిమా కథే. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణకు ఈ సినిమా ఫస్ట్ హండ్రెడ్ డేస్ మూవీ. కాగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ సెంటర్స్ లో 175 డేస్ ఆడగా.. హైదరాబాద్ లోని ఒక థియేటర్లో 565 రోజులు ఆడి చరిత్ర సృష్టించిందీ చిత్రం. పల్నాటి పౌరుషం సినిమా స్క్రీన్ ప్లే అందించారు భారతీరాజా. ఇక ఆరాధన సంగతి చెప్పనలవి కాదు. అప్పటి వరకూ మాస్ ఇమేజ్ గల చిరంజీవిని కూడా క్లాస్ గా చూపించిందీ చిత్రం. చిరంజీవి భారతీరాజా దర్శకత్వంలో చేసిన ఏకైక చిత్రం ఇదే. తన నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించి.. ఎందరో కొత్త దర్శకులకు ప్రేరణగా నిలిచారు భారతీ రాజా. కేవలం మెగాఫోన్ పట్టడం మాత్రమే కాదు.. నటుడిగానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించి తాను దర్శక రాజే కాదు నటరాజును కూడా అని నిరూపించారు భారతీరాజా. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించారు. నటుడిగా భారతీరాజా చివరి చిత్రం పులవర్.

Also read: Mohan Naik: ఏసీబీ చరిత్రలోనే మోస్ట్ కాస్ట్‌లీ తిమింగలం..కాంట్రాక్టర్ల రక్తం తాగడం ఆయన నైజం..?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×