E-Paper
Advertisement

గైడ్‌లు బట్టీ కొడితే ఇక సున్నా మార్కులే.. ఏపీ టెన్త్ పరీక్షల్లో ‘పరఖ్’ విప్లవం!

గైడ్‌లు బట్టీ కొడితే ఇక సున్నా మార్కులే.. ఏపీ టెన్త్ పరీక్షల్లో ‘పరఖ్’ విప్లవం!
Advertisement

AP SSC Exams: ఏపీ విద్యాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి చదివింది చదివినట్టు పరీక్షల్లో దించేసి మార్కులు కొట్టేసే పాత పద్ధతికి ఏపీ విద్యాశాఖ గుడ్‌బై చెప్పేసింది. మార్కులు రావాలంటే విద్యార్థి తలలో ఎంత సరుకుందో? అతని ఆలోచనలో ఎలా ఉన్నాయో బయటపెట్టాలి. ఈ అంశాల ఆధారంగానే పదో తరగతి క్శశ్చన్ పేపర్‌ను సిద్ధం చేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ పరఖ్ విధానం అమల్లోకి రానుంది.

ఉన్నది ఉన్నట్టు రాస్తే ఒక్క మార్కు కూడా పడదు..

Advertisement

అందరికి పదో తరగతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ర్యాంకులు, గ్రేడ్లు, తెల్లవార్లూ చదివే బట్టీ చదువులు. కానీ ఇకపై ఆ పప్పులు ఉడకవు. గైడ్‌లో ఉన్నది ఉన్నట్టు రాస్తే ఒక్క మార్కు కూడా పడదు. ఆ విధంగా ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కశ్చన్ పేపర్స్ తయారీలో ఇప్పటివరకు ఉన్న బ్లూమ్స్ టాక్సానమీ విధానాన్ని పక్కనపెట్టేసింది. NCERT పరిధిలో పరఖ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత, సామాజిక స్పృహను పరీక్షించడమే ఈ ఫరఖ్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

ప్రశ్న పత్రంలో మార్పులు..

Advertisement

ఈ న్యూ ట్రెండ్‌లో ప్రశ్నలు మూడు రకాలుగా విడిపోనున్నాయి. సబ్జెక్టుపై అవగాహన ఉంటే చాలు 60 శాతం మార్కులు సాధించవచ్చు. మిగిలిన 40 శాతం మార్కులు రావాలంటే మాత్రం విద్యార్థికి సొంత ఆలోచనలు, భాషపై నైపుణ్యం, సమాజంపై అవగాహన ఉండాల్సిందే. మొత్తం క్వశ్చన్ పేపర్‌లో 30 శాతం సులభమైన ప్రశ్నలు ఉంటాయి. అలాగే 50 శాతం మోస్తరు ప్రశ్నలు, కేవలం 20 శాతం మాత్రమే కష్టమైన ప్రశ్నలు ఉంటాయి.

Also Read: రాజకీయ కక్ష కోసం ప్రాజెక్టులను ఎండబెడతారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

ఓపెన్ మైండెడ్ ప్రశ్నలు..

ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అదే.. ఓపెన్ మైండెడ్ ప్రశ్నలు. అంటే ఒక ప్రశ్నకు ఒకే రకమైన సమాధానం చెల్లదు. విద్యార్థి తన ఇష్టానుసారంగా, తన శైలిలో సమాధానం రాసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఎగ్జాంపుల్‌కు సోషల్ స్టడీస్‌లో ఇంటి పనుల్లో.. జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఎలా చూపిస్తారో రెండు ఉదాహరణలతో నిరూపించండి అనే ప్రశ్న ఇచ్చారు. దీనికి విద్యార్థి తన ఇంట్లో లేదా చుట్టుపక్కల చూసే నిజ జీవిత అంశాలను జోడించి సొంతంగా రాయాల్సి ఉంటుంది.

బ్లూప్రింటర్లు విడుదల..

అలాగే బయాలజీలో కేవలం బొమ్మలు గీసి భాగాలను గుర్తించడం మాత్రమే కాదు.. ధూమపానం వల్ల జరిగే నష్టాలు, యోగా వల్ల కలిగే లాభాలపై స్నేహితుడికి ఎలా కౌన్సెలింగ్ ఇస్తావనే ప్రాక్టికల్ ప్రశ్నలు అడుగుతారు. ఈ విధానం వల్ల విద్యార్థులు కేవలం స్కోరింగ్ మెషిన్స్‌గా మారకుండా.. రేపటి పౌరులుగా సమాజంలో ఎలా బతకాలో నేర్చుకుంటారని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పటికే SSC బోర్డు దీనికి సంబంధించిన బ్లూప్రింట్లను విడుదల చేసింది.

Also Read:రేవంత్ కోసమే సీమ ప్రాజెక్టును చంద్రబాబు ముంచేశారు.. సజ్జల సంచలనం!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×